Suryaa.co.in

Features

మా మాష్టారు

అఖండ విజ్ఞాన తరువులు, ప్రచండ విజ్ఞాన ధనువులు,ఆదర్శ గురువులు
మాలాంటి ఎందరో విద్యార్ధులకు మార్గదర్శనం చేసి,
బాధ్యతలను గుర్తెరిగి మసులుకునే వారిగా తీర్చిదిద్దినవారు
మా మాష్టారు…

బాధ్యత గల ఒకపౌరునిగా తీర్చిదిద్దడంలో తండ్రిగా…
ప్రేమామృతాన్ని కురిపించే కన్నతల్లిగా
ఒడిదొడుకుల సమయంలో అక్కున చేర్చుకునే తోబుట్టువుల్లా..
ఆపద సమయాల్లో వెన్నెంటి ఉండే మిత్రుడిలా….
ఇలా విభిన్న పాత్రల ఏకస్వరూపధారుడే గురువు…!
అటువంటి గురువులలో ప్రధమ తాంబులం ఇవ్వతగ్గవారు మా మాష్టారు..!

“ఉన్నత విలువలతో కూడిన విద్యను, కష్టతరమైన పాఠ్యాంశాలను,..
అమ్మ గోరుముద్దపు కమ్మతనాన్ని మరిపించే రీతిలో మా అందరికి అందించిన “విద్యా తపస్వీ” మీరు..
అందుకే అయ్యారు మీరు మా అందరికి దేవుడు మాస్టారు…!

క్రమశిక్షణకు మారుపేరుగా..
ఆదర్శానికి ఆనవాలుగా!
ఆత్మీయతకు ఆలంబనగా!
చిత్తశుద్దికే చిరునామాగా…
మా అందరి చిత్తము దోచిన చిన్మయ గురువులు మీరు!

ఇంతచేసిన మీ ఋణం ఏ విధంగా తీర్చగలం!
మీరు చూపిన ఆదర్శ బాటలో
ఉత్తమ పౌరులుగా నిలిచినప్పుడే!
మా కొన ఊపిరి వరకు మిమ్ము తలచినప్పుడే!!

అందుకే వెలకట్టలేని
మీ ఋణమునకు
మా హృదయం లో కోవెల కట్టాము!!

మీ పాదల చెంత నేడు చిన్నచిన్న పుష్పాలమై
మా అందరి గుండెల్లో మీ పట్ల ఉన్న ఆర్ధ్రతను ఆక్షర రూపంలో చాటుకుంటున్నాం…
తప్పులుంటే క్షమించండి…
అంతేగాని …..
మా చేత గోడ కుర్చీలు వేయించకండి…మీ బెత్తానికి పని చెప్పకండి…. మా చెవులు మెలిపెట్టకండి…!

మణిమయ కాంతుల శోభలతో,
మీ జీవనయానం సాగాలి!
అది పావన గీతం కావాలి.

మీరు నాటిన విద్యా వనాన
విజ్ఞాన పరిమళాలు వెదజల్లుతూనే ఉండాలి
మావంటి వారం ఆపరిమళాలకు పాత్రులమవ్వాలి…!

శ్రీపాద శ్రీనివాస్

LEAVE A RESPONSE