Suryaa.co.in

Telangana

చివరి శ్వాస వరకు కాషాయ జెండా మోస్తా

-తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తాం
-17 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తాం
-బీఆర్‌ఎస్‌ శకం ముగిసింది…
-ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావు
-కాంగ్రెస్‌తోనే తమకు ప్రధాన పోటీ
-హామీలు, గ్యారంటీలతో మోసం చేశారు
-రేవంత్‌ను ప్రజలు నిలదీయాలని పిలుపు
-నైతిక విలువలకు కట్టుబడి పనిచేశా
-సికింద్రాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి

సికింద్రాబాద్‌, మహానాడు: తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యమని కేంద్రమంత్రి, సికింద్రాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లో శుక్రవారం కిషన్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కార్యకర్తల బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సభకు ముఖ్యఅతిథిగా వచ్చిన భారత రక్షణ శాఖ మంత్రి రాజనాథ్‌ సింగ్‌కు ధన్యవాదాలు తెలిపారు. తాను 2019లో సికింద్రాబాద్‌ ఎంపీగా గెలవడానికి ముందు అంబర్‌పేట, హిమాయత్‌ నగర్‌ ప్రజల ఆశీర్వాదంతో మూడు సార్లు శాసనసభ్యుడిగా విజయం సాధించాను. 2009 నుంచి ప్రతిసారి ఎన్నికలకు ముందు గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి పనులపై ప్రజలకు నివేదికను ఆనవాయితీగా సమర్పిస్తున్నాం. సికింద్రాబాద్‌ ఎంపీగా, కేంద్రమంత్రిగా గత నాలుగున్నరేళ్లలో తెలంగాణకు, సికింద్రాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గానికి ఏం చేశామనే దానిపై ప్రజల ముందు సవివరంగా నివేదిక ఇచ్చాం. నైతిక విలువలకు కట్టుబడి ప్రజాప్రతినిధిగా పనిచేశాను. మరోసారి నన్ను ఆశీర్వదించి ఎంపీగా గెలిపించాలని కార్యకర్తలు, ప్రజలకు విజ్నప్తి చేశారు.

తొమ్మిదిన్నరేళ్లలో రూ.10 లక్షల కోట్ల ఖర్చు
నరేంద్ర మోదీ నాయకత్వంలో సికింద్రాబాద్‌ అభివృద్ధి కోసం, సికింద్రాబాద్‌ ప్రజల వాణిని వినిపిస్తూ సబ్‌ కా సాత్‌, సబ్‌ కా విశ్వాస్‌, సబ్‌ కా ప్రయాస్‌ అనే నినాదంతో ముందుకెళుతున్నాం. గత తొమ్మిది న్నరేళ్లలో తెలంగాణ అభివృద్ధి కోసం రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేశాం. రూ. 720 కోట్లతో సికింద్రా బాద్‌ రైల్వేస్టేషన్‌ను ఎయిర్‌ పోర్టు తరహాలో అభివృద్ధి చేస్తున్నాం. భవిష్యత్తులోనూ అదే క్రమశిక్షణతో సికింద్రాబాద్‌ నియోజకవర్గానికి, తెలంగాణ రాష్ట్రానికి సేవ చేస్తాను. సికింద్రాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు, ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు, డ్రిరకింగ్‌ వాటర్‌ కోసం బోర్‌ వెల్స్‌, ఓపెన్‌ జిమ్స్‌, ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి, పార్కుల నిర్మాణంతో పాటు అనేక రకాలుగా అభివృద్ధి చేశాం. సికింద్రాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేయబోతున్నాను. నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. చివరి శ్వాస వరకు కాషాయ జెండా ఎత్తుకునే పనిచేస్తాను. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందడం ఖాయం. బీఆర్‌ఎస్‌ పార్టీకి ఏ సీటులోనూ డిపాజిట్‌ వచ్చే పరిస్థితి లేదన్నారు.

కాంగ్రెస్‌ పార్టీతోనే ప్రధానమైన పోటీ..
వందరోజుల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు పూర్తి చేస్తామన్న కాంగ్రెస్‌ పార్టీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది. కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కులేదు. గ్యారంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్‌ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదని నిలదీయండి. బీఆర్‌ఎస్‌ పార్టీ ఒక సీటు గెలిచినా ప్రజలకు లాభం లేదు.. ఒక సీటు ఓడినా నష్టం లేదు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌ శకం ముగిసింది. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ నిలబడుతుంది. కాంగ్రెస్‌ హామీలు, గ్యారంటీలు అమలు చేసేలా ప్రజల తరపున పోరాటం చేస్తాం. తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేయడమే ఏకైక లక్ష్యమని, 17 సీట్లలో అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు.

ప్రజాశ్రేయస్సే కిషన్‌రెడ్డి అజెండా
ఈటెల రాజేందర్‌ మాట్లాడుతూ 2004 నుంచి 2018 వరకు కిషన్‌రెడ్డి, తాను ఎన్నికల్లో ఏనాడు ఓటమి లేకుండా విజయం సాధించాం. తనకు వ్యక్తిగత అజెండా లేదని, పార్టీ, ప్రజల శ్రేయస్సే ముఖ్యమని చెబుతుండేవారు. కేంద్రమంత్రి అయిన తర్వాత కిషన్‌రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల ముందు నివేదిక ఇచ్చారు. సికింద్రాబాద్‌ చైతన్యానికి మారుపేరు. ఒకనాడు భారతదేశంలో సెవెన్‌ సిస్టర్‌ స్టేట్స్‌లో ప్రశాంతత లేకుండా ఉండేది. అభివృద్ధి జరగలేదు. కానీ, మోదీ ప్రధానమంత్రి అయ్యాక కిషన్‌ రెడ్డికి 7 రాష్ట్రాల బాధ్యతలు అప్పజెప్పారు. వాటిని గొప్పగా అభివృద్ధి చేసి చూపించా రు. సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో ప్రతి మనిషి కష్టాలు తెలిసిన వ్యక్తి. ఆయనకు కులం, మతం రంగులేదు.. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కిషన్‌రెడ్డిని మరోసారి అద్భుత మెజారిటీతో గెలిపించా లని కోరుకుంటున్నా.

కిషన్‌రెడ్డి విజయాన్ని ఆపలేరు
బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ కిషన్‌ రెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రావటం సంతోషంగా ఉంది. నామినేషన్‌ ర్యాలీ విజయోత్సవ సభలా కనిపించింది. సికింద్రాబాద్‌ పార్లమెంటు నియోజక వర్గంలో బీజేపీ గెలుపు ఇప్పటికే నిర్ధారణ అయింది. తెలంగాణలో 17 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యరు ్థలు విజయ బాటలో దూసుకెళుతున్నారు. మోదీ చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రజలే కోకొల్లలుగా చెప్పుకుంటున్నారు. ఆయన ప్రభంజనాన్ని నిలువరించడానికి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయి. ఇచ్చిన గ్యారంటీలు, హామీలు అమలు చేయని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రజలే తిరగబడి కూలగొడుతారు. అవినీతి, కుటుంబ రాజకీయాలుకు మారుపేరు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు. కిషన్‌ రెడ్డి ఐదేళ్లలో సికింద్రాబాద్‌ పార్లమెంటులో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్‌ ఎంపీగా కిషన్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.

న్యాయం, అన్యాయానికి మధ్య యుద్ధం
ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ కిషన్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఒక వైపు న్యాయం.. మరోవైపు అన్యాయానికి మధ్య జరుగుతున్న పోటీ అన్నారు. భారతీయ జనతా పార్టీ ఒకవైపు… కాంగ్రెస్‌ అలియాస్‌ ముస్లిం లీగ్‌ పార్టీ ఒకవైపు ఉందనన్నారు. నలుగురు ఎంపీలుంటేనే తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు తీసుకొచ్చాం.. ఈసారి 12 మంది ఎంపీలు ఉంటే రూ.30 లక్షల కోట్ల బడ్జెట్‌ రాష్ట్రానికి తీసుకొచ్చి అభివృద్ధి చేసు కోవచ్చన్నారు.

అపూర్వ విజయం అందించాలి
మాజీ మంత్రి కృష్ణయాదవ్‌ మాట్లాడుతూ సికింద్రాబాద్‌ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా కిషన్‌రెడ్డి నామినేషన్‌ వేయనున్న సందర్భంగా కార్యకర్తలు, ప్రజలు బ్రహ్మాండమైన ర్యాలీగా తరలివచ్చారు. సికింద్రాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం ఓటర్లు మే 13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌లో అత్యధిక శాతం ఓట్లు బీజేపీకి వచ్చేలా అపూర్వ విజయం అందించాలని పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE