Home » చంద్రన్న మా కుటుంబ సభ్యుడు

చంద్రన్న మా కుటుంబ సభ్యుడు

– 7సార్లు చంద్రబాబును మేం గెలిపించుకున్నాం..మాకు ఆయనపై అంత నమ్మకం
– ప్రతి ఓటరు చందాలు వేసుకుని మా చంద్రన్నకు నామినేషన్ ఫీజులు కట్టి నామినేషన్ వేయించాం
-చంద్రబాబు తరపున నామినేషన్ వేయడానికి భువనమ్మ రావడం మాకు చాలా సంతోషం
– కుప్పంలో పార్టీ ముఖ్యనేతలతో నారా భువనేశ్వరి మాటామంతి

కుప్పం తెలుగుదేశంపార్టీ కుటుంబ సభ్యులకు నా నమస్కారాలు…మా కుటుంబంతో కంటే మీతోనే చంద్రబాబు అత్యధిక సమయం గడిపారు..మీరు ఆయనతో దగ్గరగా ఉన్నారు. చంద్రబాబు ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఆయనకు ఓ టీమ్ అవసరం. కుప్పం ప్రజలు ఇక్కడి పరిస్థితులు చక్కదిద్ది, చంద్రబాబును గెలిపించడానికి కంకణబద్దులు కావాలి. 7సార్లు చంద్రబాబును వరుసగా కుప్పం ప్రజలు ఆశీర్వదించారు..ఈ విషయాన్ని మా కుటుంబం ఎప్పటికీ మరచిపోదు…కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు.

చంద్రబాబు కుప్పంలో ఏ ఒక్కరినీ మర్చిపోరు…ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తారని నా ప్రగాఢ విశ్వాసం. కుప్పంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేలా చంద్రబాబు చూస్తారు. గత ఐదేళ్లుగా కుప్పం ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు..గతంలో ఎన్నడూ ఎదుర్కోని విధంగా సమస్యలు ఎదుర్కొన్నారు..అక్రమ కేసులను భరించారు. వైసీపీ దాష్టీకాలను తట్టుకుంటూ..ధీటుగా ఎదుర్కొంటూ పసుపు జెండాను నిలబెడుతూ వస్తున్న కుప్పం కుటుంబ సభ్యులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. రానున్న ఎన్నికల్లో కుప్పం మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం విజయ దుందుభి మోగించాలి.

రాష్ట్ర ప్రజలు, మన కార్యకర్తల కుటుంబాల కోసం నేను నిజం గెలవాలి కార్యక్రమాన్ని చేపట్టి పూర్తిచేశాను. కుప్పం కుటుంబ సభ్యుల సమక్షంలో చంద్రబాబు తరపున నామినేషన్ వేస్తానని నేను అడగడంతో చంద్రబాబు ఒప్పుకున్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు. చంద్రబాబు నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కుప్పం కుటుంబ సభ్యులు కదలి రావాలని కోరుతున్నాను.

Leave a Reply