Suryaa.co.in

Features

హిందువుల ఆత్మ “జై శ్రీరామ్”

హిందువుల ఆత్మగౌరవానికి నిదర్శనం జైశ్రీరామ్..
హిందూ చైతన్యానికి ప్రతిరూపం జైశ్రీరామ్..
ఆధ్యాత్మికతకు అర్థం జైశ్రీరామ్..
యుగయుగాలుగా తరతరాలుగా ప్రతి ఒక్కరూ జపించే తారక మంత్రం జైశ్రీరామ్..
భక్తికి శక్తికి ప్రతిరూపం జైశ్రీరామ్.!

కూటి కోసమో, కూలి కోసమో, కడుపు నింపుకునేందుకు కోసమో చేసే నినాదం కాదు జైశ్రీరామ్.!
పరమ పవిత్రమైన మంత్రం జైశ్రీరామ్..
అన్నిటికీ మించి హిందువుల హృదయ నాడి జైశ్రీరామ్.

సర్వ జగత్తుకు (మానవాళికి )ఆదర్శ పురుషుడు శ్రీరాముడు.
ఓ రాజుగా.. ఓ కుమారుడిగా.. ఓ భర్తగా.. ఓ అన్నగా.. ఈ సృష్టి పవిత్రంగా కొలిచే కోదండ రాముడు మన శ్రీరాముడు.అలాంటి శ్రీరాముడిని జపించడం అదృష్టం.
రాజకీయాలు.. కులాలు.. ప్రాంతాలు.. వర్గాలకు అతీతంగా ఆరాధించే దైవం శ్రీరాముడు. జపించే మంత్రం జైశ్రీరామ్..!

ప్రతి భారతీయుడి హృదయాంతరాలలో ప్రతిధ్వనించే తారక మంత్రం జైశ్రీరామ్..
ప్రతి భక్తుడి మనసు పులకింపజేసే నినాదం జైశ్రీరామ్..
ప్రతి భక్తుడి ఆత్మవిశ్వాసం జైశ్రీరామ్..

జై శ్రీరామ్ నినాదం ఆధారంగానే నాడు ఆ వారధి నిర్మించారు.. నేడు అయోధ్యలో భవ్యమైన బాలరాముడి మందిరం నిర్మించుకున్నాము.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైందవ జాతి ఆత్మగౌరవానికి సాక్షాత్కారం జైశ్రీరామ్.

కూటికోసం.. ఉద్యోగం కోసం.. ఉపాధి కోసం .. కాంట్రాక్ట్ కోసం ..కాదు జైశ్రీరామ్.!

తన మన ధన పూర్వకంగా హృదయాంతరాల్లోంచి రాముడికి సమర్పించే త్యాగం, భక్తి భావం జైశ్రీరామ్.

ఉచ్చరిస్తే గాని తెలియదు జైశ్రీరామ్ గొప్పతనం.
మనసుపెట్టి ఆస్వాదిస్తే గాని తెలియదు జైశ్రీరామ్ మాదూర్యం.

“హిందూ గాళ్లు బందు గాళ్లు” అంటూ హిందువులను ద్వేషించడం..
“రామ జన్మభూమి..రావణ జన్మభూమి.. కృష్ణ జన్మభూమి.. కంస జన్మభూమి.. సూర్పనఖ జన్మభూమి” అంటూ వ్యంగంగా ఎగతాళి చేసే వాళ్లకు తెలియదు జై శ్రీరాం గొప్పతనం.!

గో హాంతకులు (AIMIM) తో రాజకీయ జట్టు కట్టిన వారికి తెలియదు జైశ్రీరామ్ విలువ.!

హనుమంతుడి గుండెల్లో బంధీ అయిన రాముడి గొప్పతనాన్ని తెలుసుకొని మసులుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తన పేరులోనే (తారక రామారావు) రాముడు ఉన్నప్పటికీ ఆ దేవుడి గొప్పతనం తెలుసుకోకపోవడం దౌర్భాగ్యం.

ఇకనైనా రాజకీయ అవసరాల నిమిత్తం జైశ్రీరామ్ నినాదాన్ని వివాదంగా మార్చడం బిఆర్ఎస్ నేతలు మానుకోవాలి. ఇటీవల మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు మాట్లాడుతూ “జైశ్రీరామ్ నినాదం కూడు పెట్టదు ఉద్యోగం ఇవ్వదు” అని మాట్లాడటం హిందువుల మనోభావాలను దెబ్బతీయటమే. ఇలాంటి వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది.

– పగుడాకుల బాలస్వామి
అధ్యక్షులు
జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (JAT)
9912975753
9182674010

LEAVE A RESPONSE