Suryaa.co.in

Andhra Pradesh

పేదల కరుణామయుడు సుజనా చౌదరి

-సుజనా చౌదరి గెలుపు నియోజకవర్గం లోని పేదలకే ముఖ్యం
-మాల మహానాడు నేత బండి బాలయోగి

విజయవాడ వెస్ట్ నుండి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గెలుపు ఆయన కంటే నియోజకవర్గం లోని పేదలకే ముఖ్యం అని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బండి బాలయోగి అన్నారు. మంగళవారం విజయవాడ లోని హోటల్ ఆర్. కే కాన్ఫరెన్స్ హాలు లో జరిగిన సుజనా మద్దత్తు సన్నాహక సదస్సులో బండి పాల్గొని ప్రసంగీంచారు. విజయవాడ వెస్ట్ లో సుజనా చౌదరి గారు పోటీ చెయ్యడం నియోజకవర్గం ప్రజలకు శుభ పరిణామం అని అన్నారు.పేదలపట్ల ఆయన కరుణామయుడు అని బండి కొని యాడారు.

ఉన్నత వ్యక్తిత్వం, విలువలు కలగిన సుజనా గారు పోటీ చెయ్యడం నియోజకవర్గం లోని పేద ప్రజల అదృష్టమని అన్నారు. ప్రతి ఇంటికి మేలు జరగాలి అంటే సుజనా చౌదరి గారు గెలవాలి అన్నారు. ఇప్పటికే కోట్లాది స్వంత నిధులు వెచ్చించి సుజనా పౌండేషన్ ద్వారా పేదలను ఆదుకున్న ఆయన సేవలు నిరూపమానం అన్నారు. కరోనా సమయం లో విజయవాడ కేంద్రం గా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. విద్యా, వైద్య రంగంలో స్వంత నిధులు వెచ్చించి ఆయన చేసిన సేవలకు సార్ధకత రావాలి అంటే ఆయన గెలుపు నల్లేరు మీద నడక కావాలి అన్నారు.

మాల కుల పెద్ద తెలుగు దేశం సీనియర్ నాయకులు జీవరత్నం మాట్లాడుతూ శిఖర సామానుడైన సుజనా చౌదరి గారు మన యం. ఎల్. ఏ అభ్యర్థి కావడం నియోజకవర్గం ప్రజల అదృష్టమన్నారు. ముఖ్య మంత్రి స్థాయి వ్యక్తి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నప్పుడు అన్ని కులాలు, మతాలు ఆయన కు అండగా నిలవాలి అన్నారు. డెబ్భై ఐదేళ్లు తన జీవితం లో సుజనా లాంటి నేతను చూడలేదు అన్నారు. నడిచే మానవత్వం సుజనా అని కొనియాడుతూ ఆయన గెలుపు కోసం ప్రతి మాల కుటుంబం శ్రమించాలి అని పిలుపునిచ్చారు.

బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర నాయకుడు ఎల్లసిల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్టం లోని ప్రజలందరి కళ్ళు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైపు ఉన్నాయని సుజనా ని బంపర్ మెజారిటీ తో గెలిపించాలి అన్నారు. తెలుగు దేశం నాయకులు దేవరాజ్ మాట్లాడుతూ ఎన్నికలు పూర్తి అయ్యే వరకూ ప్రతి భూతు కార్యకర్త అప్రమత్తంగా ఉండాలన్నారు. జగన్ రద్దు చేసిన దళితుల 27 పథకాలు తిరిగి అమలు కావాలంటే సుజనా గెలుపు అనివార్యం అన్నారు.

కార్యక్రమం సమన్వయకర్త బీజేపీ అధికార ప్రతినిధి, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఆర్. డి. విల్సన్ మాట్లాడుతూ విభజిత రాష్ట్రంలో, 11 విద్యాసంస్థలు ఒకే ఏడాది తీసుకురావడంలో, రాజధానికి నిధులు సమకూర్చడం లో, పోలవరం కి నిధులు సకాలం లో రాబట్టడం లో సుజనా చౌదరి పాత్ర స్మరణీ యమన్నారు. అమరావతి రైతులకు న్యాయ సహయం విషయం లో స్వంత నిధులు వెచ్చించి అండగా నిలిచారు అని కొనియాడారు.పట్టుదల కి సుజనా పర్యాయ పదం అన్నారు.

విజయవాడ వెస్ట్ నియోజకవర్గం లో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం, ఉపాధి సౌకర్యం కలగాలి అంటే సుజనా ని గెలిపించుకోవడం తప్పా మరో మార్గం లేదన్నారు. నియోజకవర్గంలో ప్రతి ప్రాంతం సమస్య సుజనా చౌదరి దృష్టికి.. ఇప్పటికే వెళ్లిందని గెలిచిన తర్వాత పరిష్కారాల కోసం ఆయన అన్వేషిస్తున్నారని అన్నారు.సమావేశం లో బీజేపీ దళిత మోర్చా విజయవాడ అధ్యక్షులు సునీల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. పలువురు నేతలు తమ సమస్యలు ఏకరువు పెట్టారు.

LEAVE A RESPONSE