-తొలుత జేపీ నడ్డా, ఆ తరువాత అమిత్ షాను కలిసి బండి సంజయ్
-పాదయాత్రకు రావాలని ఆహ్వానించిన సంజయ్
-ముగింపు సభకు వస్తానని హామీ ఇచ్చిన అమిత్ షా
-సంజయ్ చేస్తున్న పోరాటాలను అభినందించిన జేపీ నడ్డా
– ప్రజా సంగ్రామ యాత్ర, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలతో చర్చ
-తెలంగాణలో చేస్తున్న పోరాటాలతో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందన్న అమిత్ షా
-అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయి….టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం ఉధృతం చేయాలని సూచన
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాను వేర్వేరుగా కలిశారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితి, టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలతోపాటు ప్రజా సంగ్రామ యాత్రపై ప్రత్యేకంగా వీరితో చర్చించారు. ఏప్రిల్ 14 నుండి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి రావాలని ఇరువురుని ఆహ్వానించారు.
తొలుత నడ్డాతో అరగంటకుపైగా సంజయ్ సమావేశమయ్యారు. టీఆర్ఎస్ నియంత-కుటుంబ-అవినీతి పాలనకు వ్యతిరేకంగా బీజేపీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన తొలి విడత ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం కావడంపట్ల సంత్రుప్తి వ్యక్తం చేసిన జేపీ నడ్డా… రెండో విడత యాత్ర కూడా సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’కు హాజరై సంఘీభావం తెలిపే విషయంలో సానుకూలంగా స్పందించిన జేపీ నడ్డా వీలు చూసుకుని పాదయాత్ర జరిగే సమయంలో రాష్ట్రానికి వస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి, నియంత పాలనపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం చేస్తున్న పోరాటాలను జేపీ నడ్డా అభినందించారు. ‘‘సంజయ్ బండిజీ….. రాష్ట్ర ప్రభుత్వ
ప్రజా వ్యతిరేక విధానాలపై మీరు చేస్తున్న పోరాటాలు భేష్…ఈసారి తెలంగాణలో బీజేపీ అధికారం వచ్చే అవకాశాలున్నాయి. మరింత ఉధ్రుతంగా ఉద్యమాలు చేయండి. మీకు అండగా మేమున్నాం. ’’ అని భుజం తట్టి అభినందించారు.
అనంతరం అమిత్ షా ను బండి సంజయ్ కలిశారు. ఈ సందర్భంగా అమిత్ షా ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ ను అడిగి తెలుసుకున్నారు. ఏయే జిల్లాల్లో, ఎన్ని రోజులు పాదయాత్ర చేస్తున్నారనే వివరాలపై ఆరా తీశారు. రెండో విడత పాదయాత్ర ముగింపు సభ ఎక్కడ ఏర్పాటు చేశారని అడిగారు. పాదయాత్ర ముగింపు సభ హైదరాబాద్ శివారులోని మహేశ్వరం నియోజకవర్గంలో ప్లాన్ చేస్తున్నామని సంజయ్ పేర్కొనడంతో తప్పకుండా ఆరోజు రాష్ట్రానికి వస్తానని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలు పడుతున్న బాధలను, వేసవి కాలంలో వివిధ వర్గాలు ప్రజలు ఎధుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టడం మంచి పరిణామమని సంజయ్ ను అమిత్ షా అభినందించారు.
అనంతరం తెలంగాణలో రాజకీయ పరిస్థితి, కేంద్రాన్ని బదనాం చేసేందుకు టీఆర్ఎస్ చేస్తున్న డ్రామాలపైనా సంజయ్ అమిత్ షాకు వివరించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని, ఈ తరుణంలో బీజేపీ రాష్ట్ర శాఖ చేపడుతున్న కార్యక్రమాలను అమిత్ షా అభినందించారు. ఈ తరుణంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నందున టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలను ఉధృతం చేయాలని సూచించారు.
అమిత్ షా, జేపీ నడ్డాను కలిసిన వారిలో బండి సంజయ్ వెంట ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, పార్లమెంటరీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం, పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ ఉన్నారు.