Suryaa.co.in

Features

నీ గీతం..మా గతం!

వందేమాతరమన్నది
నీ నినాదం..
మమ్మాపఎవరి తరమన్నది
నేటి మా నేతల విధానం..
సుజలాం..స్వజులుం..
సుఫలాం.. స్వలాభాం..
ద్రుమదళ శోభిని..
దుమ్ము దులపడమే
మా పని..
బంకించంద్రా..
అయ్యో రామచంద్రా
పాపపంకిలం
ఈనాటి మా చరితం..
నువ్వు రాసిన గీతం..
ఇప్పుడు తిరిగిరాని
మన మహోన్నత గతం..
ఏడాదికోసారి చదువుకునే నలిగిపోయిన కాగితం..
మసకబారిపోయిన
భరత జాతి ఇంగితం..
అన్నట్టు..
మొన్నటికి మొన్న మందేమాతరం అంటూ
వరస కట్టి ఒకే రోజున
కోట్ల రూపాయల
గుడుంబా తాగి నిషాగీతమాలపించిన జాతికి..జోహారా..
పారాహుషారా..
బంకించంద్రకు క్షమాపణలతో..

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE