Suryaa.co.in

Andhra Pradesh

బాషా మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

-బాషా మరణం ముమ్మాటికీ ప్రభుత్వహత్యే
– బాషాని లారీతో గుద్దించి చంపిన వైసీపీనేతను ప్రభుత్వం తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి
– మృతుడి కుటుంబానికి కోటిరూపాయల పరిహారంఇవ్వాలి
• ప్రభుత్వానికి కట్టాల్సినపన్ను కట్టకుండా దొడ్డిదారిలో లారీలు తిప్పుతుందికాక, తన లారీని వెంబడించాడన్న అక్కసుతోనే బాషాని వైసీపీనేత బలితీసుకున్నాడు
• బాషాని బలితీసుకున్న లారీయజమాని, వైసీపీనేత ఎవరు? అతనిపై ప్రభుత్వం ఎందుకు చర్యలుతీసుకోవడంలేదు?
• బాషా కుటుంబానికి ముఖ్యమంత్రి న్యాయంచేయాల్సిందే
టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ, టీడీపీ మైనారిటీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్

షేక్ హుస్సేన్ బాషా మృతిపై జగన్మోహన్ రెడ్డి, అతనిప్రభుత్వం సమాధానం చెప్పాలని పత్తిపాడునియోజకవర్గం రేటూరుకిచెందిన బాషా, ఉద్యోగరీత్యా నారాకోడూరు వ్యవసా య మార్కెట్ యార్డ్ లో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నా డని, 16వతేదీ రాత్రి 11.45గంటలప్రాంతంలో చెక్ పోస్ట్ వద్ద ఆపకుండా వెళ్తున్నలారీని అడ్డుకోవడమే బాషాచేసిన తప్పా అని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు.

మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్రఅధ్యక్షులు మౌలానాముస్తాక్ అహ్మద్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు వారిమాటల్లోనే …
“ 16వతేదీ రాత్రి వ్యవసాయచెక్ పోస్ట్ వద్ద ఆపాల్సిన లారీ (నంబర్ AP4Y 1783) ఆపకుండా ప్రభుత్వానికి కట్టాల్సిన రూ.10వేల ట్యాక్స్ కట్టకుండా ముందుకెళ్లడంతో, ఆ లారీని ఆపడానికి బాషా తనద్విచక్రవాహనంపై వెంబడించాడు. బాధ్యతగల ఉద్యోగి గా నిబద్ధతతో బాషా ఆలారీని ఆపేప్రయత్నంచేశాడు. ఆలారీ డ్రైవర్ మాత్రం నిర్లక్ష్యంగా బాషాపై నుంచి లారీని పోనిచ్చి, కొంతదూరం వెళ్లాక లారీని అక్కడేవదిలేసి పారిపో యాడు. అర్థరాత్రి వేళ ఘటనజరిగి, తెల్లారకచూసిన స్థానికులు అందరూ అది యాక్సిడెంట్ అనే భావించారు.

టీడీపీనేత, మాజీఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ జరిగిందేమిటో తెలుసుకునే ప్రయత్నంచేశారు. బాషా వెంబడించిన లారీ వైసీపీనేతలద ని, వారు చాలాకాలంగా ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులు సక్రమంగా కట్టకుండా దొడ్డి దారిన లారీల్లో సరకురవాణాచేస్తున్నారని నరేంద్రకుమార్ తెలుసుకున్నారు. ప్రభుత్వా నికి కట్టాల్సిన ట్యాక్స్ కట్టకుండా, ఆపాల్సినచోట ఆపకుండా లారీ ముందుకెళ్లబట్టే బాషా దాన్ని వెంబడించాడనికూడా తేలింది. ఆక్రమంలోనే వైసీపీనేతలకు చెందిన లారీతో బాషాను ఢీకొట్టి దుర్మార్గంగా అతన్నిబలితీసుకున్నారు.

బాషా మరణం ముమ్మాటికీ ప్రభుత్వహత్యే
బాషా మృతిపై టీడీపీనేతలు పోలీసుల్ని నిలదీయడంతో, పోలీసులు తప్పుడుబిల్లులు చూపి, లారీయజమానుల్ని వెనకేసుకొచ్చేప్రయత్నంచేశారు. నారాకోడూరు మార్కెట్ యార్డ్, దానిపరిధిలోని ఉద్యోగులకు సదరువైసీపీనేత బాగోతాలు తెలుసు. జగన్మోహన్ రెడ్డి అండతోనే అమాయకుడైన బాషాని లారీతోగుద్ది వైసీపీనేతలు పొట్టనపెట్టుకున్నారు.

టీడీపీ బాషాహత్యను వెలుగులోకి తీసుకురాకపోయి ఉంటే, పోలీసులు దాన్ని ప్రమాదంగానే చిత్రీకరించి చేతులుదులుపుకునేవారు. ఇలాంటి దుర్మార్గాల్ని ప్రోత్సహి స్తూ అమాయకుల్ని బలితీసుకుంటున్న ముఖ్యమంత్రి బాషాకుటుంబానికి ఏం న్యాయం చేస్తాడో చెప్పాలి. లారీతో గుద్దించి బాషానిచంపితే, సదరులారీ డ్రైవర్ పై, యజమానిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులుకేసుని నీరుగార్చే ప్రయత్నం ఎందుకు చేశారో, ఎవరిప్రోద్భలంతో చేశారో డీజీపీ సమాధానంచెప్పాలి.

బాషా మరణం ముమ్మా టికీ ప్రభుత్వహత్యే. లారీయజమాని అయిన సదరువైసీపీనేత ఎవరు… ఎంతకాలం నుంచి ప్రభుత్వానికి పన్నులుఎగ్గొడుతూ, లారీల్ని తిప్పుతున్నాడనే వివరాల్ని కూడా ప్రభుత్వం బయటపెట్టాలి. బాషాని వైసీపీనాయకుడే బలితీసుకున్నాడు. బాషా మర ణంతో ఇద్దరుఆడపిల్లులు తండ్రలేనివారయ్యారు. అతనికుటుంబాన్ని ప్రభుత్వం ఎలా ఆదుకుంటుందో, కుటుంబసభ్యులకు ఏంన్యాయం చేస్తారో చెప్పాలి. బాషా చనిపోతే పొన్నూరు వైసీపీఎమ్మెల్యే కనీసమానవత్వంతో కూడా స్పందించలేదు.” అని రఫీ ఆగ్రహం వ్యక్తంచేశారు.

జగన్ పాలన పట్టాలుతప్పిన రైలులా దూసుకెళ్తూ, అడ్డొచ్చినవారిని తొక్కుకుంటూ ముందుకెళ్తోంది: మౌలానా ముస్తాక్ అహ్మద్
హుస్సేన్ బాషా అలియాస్ బాషా పొన్నూరునియోజకవర్గపరిధిలోని మార్కెట్ యార్డ్ లో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. వైసీపీనేత తనలారీలతాలూకా కట్టాల్సిన పన్ను ప్రభుత్వానికి కట్టకుండా, చెక్ పోస్ట్ వద్ద లారీని ఆపకుండా అడ్డొచ్చిన బాషా లాంటివాళ్లను బలితీసుకుంటాడా? తనప్రాణాలు లెక్కచేయకుండా పన్నుకట్టకుండా వెళ్తున్నలారీని అడ్డుకోవడమే బాషాచేసిన నేరమా? లారీతో బాషాని తొక్కించి చంపే స్తారా? జరిగినదాన్ని రోడ్డుప్రమాదంగా చిత్రీకరించి, చేసినదారుణాన్ని కప్పిపుచ్చాలని చూస్తారా? దొంగతనలారీకి కట్టాల్సినపన్నుకట్టకుండా వెళ్తున్నవాడిని అడ్డుకోవడమే నిజాయితీపరుడైన బాషాచేసిన తప్పా?

ఇంతదారుణం జరిగితే డీజీపీ రాష్ట్రంలో శాంతి భద్రతలు సవ్యంగా, సక్రమంగా ఉన్నాయని చెబుతున్నారు. డీజీపీ సిగ్గులేకుండా అలా ఎలాచెబుతారు? బాషాని చంపినవారిపై డీజీపీ ఏంచర్యలు తీసుకుంటారు? బాషాని దుర్మార్గంగా పొట్టనపెట్టుకున్న వైసీపీనేతలే, బాపట్లజిల్లా ఉప్పరపాలెంలో అమాయకు డైన చిన్నారిని బలితీసుకున్నారు. బాలుడిపై పెట్రోల్ పోసి తగలబెట్టడమేనా శాంతి భద్రతలు సక్రమంగా ఉండటమంటే? బాషాని గుద్దినవెంటనే లారీనిఆపి, అతనకేమైందో చూడకుండా డ్రైవర్ ఎందుకు పారిపోయాడు?

ఆడ్రైవర్ వెనకున్న వైసీపీనేత ఎవరు? అతని అహంకారమేంటి? మైనారిటీలను చంపినా ఎవరేంచేస్తారులే అన్న అహంకార మా? జగన్ ప్రభుత్వం అరాచకపాలన, దోపిడీలు, దుర్మార్గాలకు కేంద్రంగా మారింది. జగన్ పాలన పట్టాలుతప్పిన రైలులా దూసుకుపోతోంది, ఎవరుఅడ్డొచ్చినా తొక్కుకుం టూ ముందుకెళ్తోంది. సొంతఖజానా నింపుకోవడం, ప్రభుత్వ ప్రజలఆస్తుల్ని కొట్టేయ డం, అడ్డొచ్చినవారిని చంపేయడమేనా పాలన అంటే?

 జగన్ హయాంలో ముస్లింలపై జరిగే దారుణాలపై నోరెత్తలేని దుస్థితిలో వైసీపీ ముస్లిం నేతలున్నారు
2007లో నంద్యాలలో నిర్మించిన మదర్సాభవనాన్ని, దానిపరిధిలోని వక్భ్ భూము ల్ని కబ్జాచేయడానికి ప్రయత్నిస్తారా? వక్ఫ్ బోర్డుస్థలంలోని మదర్సాకు పన్నుకట్టడం అనేది ఎక్కడైనాఉందా? నంద్యాల వన్ టౌన్ సీఐ మదర్సాను కబ్జా చేయాలను కుంటున్నవారికి సహకరిస్తూ, ప్రశ్నించినవారిని తుపాకీతో బెదిరిస్తున్నాడు.

మదర్సాలోని పిల్లల్ని భయభ్రాంతులకుగురిచేసి ఇళ్లకుపంపిస్తారా? మదర్సా భవనా న్ని మూసేయించే అధికారం, హక్కుమీకుఎవరిచ్చారు? నేనులేని సమయంలో మదర్సాను మూసేయించి, పిల్లల్ని రోడ్డునపడేస్తారా? మసీదులోకూడా ముస్లింలు ఉండకూడదనిచెప్పే నీచస్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం మదర్సాజోలికి వస్తే ఊరుకునేదిలేదు. హుస్సేన్ బాషాను చంపేసిన వైసీపీనేతపై తక్షణమే ఎఫ్.ఐ.ఆర్ నమోదుచేసి అరెస్ట్ చేయాలి.

బాషా కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే కోటిరూపాయల పరిహారం ఇవ్వాలి. సిగ్గులేకుండా ముసిముసినవ్వులు నవ్వుతూ పరదాలమాటున ప్రజల్లోతిరిగే నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రా? ముస్లింమైనారిటీలంటే ఇంతచిన్న చూపా? ప్రభుత్వంతరుపున అందించాల్సిన సంక్షేమాన్ని అందించకపోగా, ముస్లిం మైనారిటీలప్రాణాలు తీస్తారా? ప్రభుత్వంలోని ముస్లింమైనారిటీనేతలు సాటి సోదరుల పై జరుగుతున్న దురాగతాలపై ఎందుకు స్పందించరు? బాషాచనిపోతే అతని కుటుంబాన్ని పరామర్శించడానికి ప్రభుత్వంలోని మైనారిటీనేతలకు తీరికలేదా? ఎందుకు మీకుపదవులు? చేతగానివారికి పదవులుఉండి ఏం ఉపయోగం?

నరసరావుపేటలో షేక్ ఇబ్రహీంని చంపేస్తే ప్రభుత్వంలోని, అధికారపార్టీలోని ముస్లింనేతలు ఎందుకు నోరెత్తలేదు? ఎవరైనా అతనికుటుంబాన్ని పరామర్శించారా? అబ్దుల్ సలాం, మిస్బా, హాజీరా, కల్యాణదుర్గంలో ఒకదూదేకుల అమ్మాయిని దారుణంగా చంపేసిన నోరుతెరవరా? అలాంటి మీరు మైనారిటీనేతలా? ఈ ప్రభుత్వం మైనారిటీలను రక్షిస్తుందా? ఒకపక్క భక్షిస్తూ, మరోపక్క మైనారిటీలను ఉద్ధరిస్తున్నట్టు వారిని వంచించాలని చూస్తున్నారు. రాజ్యాంగాన్ని తుంగలోతొక్కేస్తూ, మైనారిటీలను బలితీసుకుంటున్న వైసీపీదుర్మార్గులందర్ని చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే కఠినంగా శిక్షిస్తారు. బాషా కుటుంబానికి టీడీపీఎప్పుడూ అండగా ఉంటుంది.

చంద్రబాబు వస్తున్నాడని తెలిసే జగన్ హాడావుడిగా నంబూరువెళ్లి, పవిత్రమైన ప్రదేశంలో రాజకీయాలు చేశాడు
గతంలో టీడీపీప్రభుత్వం కడపలో హజ్ హౌస్ నిర్మించింది. జగన్ వచ్చాక ముస్లిం మైనారిటీలకు ఎక్కడా ఎలాంటి న్యాయంచేసిందిలేదు. చంద్రబాబు హజ్ యాత్రకు వెళ్లే వారికి ఎలాంటిభారంలేకుండా చేశారు. జగన్ వచ్చాక హజ్ యాత్రకు వెళ్లేవారిపై ఒక్కొ క్కరికి రూ.82వేలభారం వేశాడు. ప్రభుత్వం తరుపున యాత్రకువెళ్లేవారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. యాత్రికులతో వెళ్లేవారికి కనీసం మంచినీళ్లుకూడా జగన్ ప్రభుత్వం అందించడంలేదు.

ఆఖరికి బరితెగించి మతాన్ని కించపరిచేలా మసీదు మీనార్ లపై పార్టీబెలూన్లు ఎగరేసే స్థాయికి వచ్చారు. నంబూరులో జరిగిన కార్యక్రమానికి ముందువెళ్లకుండా ఆగిపోయిన జగన్, తరువాత చంద్రబాబు వస్తున్నాడని తెలిసే హుటాహుటిన అక్కడికెళ్లి రాజకీయంచేశాడు. అని ముస్తాక్అహ్మద్ స్పష్టంచేశారు.

LEAVE A RESPONSE