Suryaa.co.in

Telangana

మలేషియాలో బతుకమ్మ సంబరాలు

కౌలాలంపూర్: మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో మలేషియా తెలంగాణ సంఘం (మైతా) ఆద్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకలలో సుమారు 800 మంది ప్రవాస తెలంగాణ ఆడ బిడ్డలు తెలంగాణ సంస్కృతిని గౌరవిస్తూ కోలాటం, ఇతర సాంస్కృతిక కార్యక్రమలతో ఘనంగా బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు.

ఈ వేడుకలలో ఉత్తమంగా ఉన్న బతుకమ్మలను సెలెక్ట్ చేసి వాటికి మొదటి, రెండవ, ముడవ బహుమతులకు బంగారు బహుమతులు అందించారు.

ఈ కార్యక్రమములో ముఖ్య అతిథి గా ప్రథమ కార్యదర్శి రాజేష్ హెచ్ మణియాల్, హైకమిషన్ ఆఫ్ ఇండియా (కౌలలంపూర్)పాల్గోని మైట చేస్తున్న సామాజిక కార్యక్రమాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు పొగుడుతూ భవిష్యత్తులో మైతకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సైదం తిరుపతి, వైస్ ప్రెసిడెంట్ చిరుత చిట్టిబాబు , మహిళా ప్రెసిడెంట్ కిరణ్మయి, జనరల్ సెక్రటరీ సందీప్ గౌడ్ , జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ రావు, ట్రేజరర్ సందీప్ కుమార్ లగిశెట్టి, జాయింట్ ట్రేజరర్ సుందర్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ సంతోష్ దాసరాజు, యూత్ వైస్ ప్రసిడెంట్ శివ తేజ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మారుతి, హరి ప్రసాద్, రాములు, రమేష్, మహేష్, శ్రీహరి, జీవం రెడ్డి, వినోద్, రఘుపాల్ రెడ్డి, రంజిత్ రెడ్డి తడితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE