Suryaa.co.in

Telangana

తెలంగాణ తెలుగు ఆడపడచులు సనాతన కాలంగా చేసుకుంటున్న పండుగ

తెలంగాణ పల్లెల నుంచి నగరాల దాకా సంబరం ప్రారంభమైంది.. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగ వేడుకలు మొదలయ్యాయి..

బతుకు అమ్మా అనే దీవనే బతుకమ్మ అయింది.. సంస్కృతి అంటే సినిమా పాటలు, డాన్సులు, కప్పగంతులే కనిపిస్తున్నాయి.. సాంప్రదాయ, జానపద కళలు క్రమంగా మరుగున పడుతున్నాయి.. ఇలాంటి రోజుల్లో కల్తీలేని అచ్చ తెలుగుదనం, సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా నిలిచి ఉన్నాయంటే, అది బతుకమ్మ రూపంలోనే అంటే అతిశయోక్తి ఏమాత్రం కాదు.. కష్ట సుఖాలు, ఆనందం, ప్రేమ, ఆప్యాయత, ఉత్సాహం, చరిత్ర, పురాణాలు అన్నీ బతుకమ్మ పాటల రూపంలో కనిపిస్తాయి.

మన బతుకమ్మ.. మన బోనం.. కట్టూ, బొట్టూ, సాంప్రదాయం, ఆచారం.. ఏదైనా ఇలాగే కాపాడుకొని భావితరాలకు అందిద్దాం.. తెలంగాణ తెలుగు ఆడపడచులు సనాతన కాలంగా చేసుకుంటున్న పండుగలు ఇవి..

ఈ పండుగలను రాజకీయాల కోసం వాడే వారికి పట్ల అప్రమత్తంగా ఉందాం.. ఈ మధ్య కాలంలో కొత్త బాణీలు సృష్టిస్తున్నారు.. అవి మన సాంప్రదాయాలకు భంగం కలిగించనంత వరకు మాత్రమే స్వాగతిద్దాం..

దురదృష్టవశాత్తు బతుకమ్మను కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు.. గతంలో ఓ పెద్దాయన హైదరాబాద్ ను తానే కట్టాను అన్నట్లుగా చెప్పుకునేవాడు.. ఇప్పుడు బతుకమ్మను తామే కనిపెట్టామన్నట్లుగా బిల్డప్పులు ఇస్తున్నారు కొందరు.. వీరికి మనవి ఏమిటంటే బతుకమ్మను ఇలాగే బతకనివ్వండి.. ప్రజలప పండుగగానే కొనసాగించండి..
అందరికీ బతుకమ్మ పండుగ ప్రారంభవేళ శుభాకాంక్షలు..

– కేశబోయిన శ్రీధర్

LEAVE A RESPONSE