Suryaa.co.in

Andhra Pradesh

ప్రజారోగ్యగానికి మసిపూసి వాళ్ల బతుకుల్నిజగన్ రెడ్డి శ్మశానాల పాలు చేస్తున్నాడు

– రాష్ట్ర వైద్యరంగాన్ని తనదోపిడీ వనరుగా మార్చుకున్న ముఖ్యమంత్రి ప్రజలకు వైద్యసేవల్ని దూరంచేశాడు. ప్రభుత్వాసుపత్రుల్ని అత్యాచారకేంద్రాలుగా మార్చడం, మందులు, సూదులు, దూదిలేకుండా చేయడం… అంబులెన్స్ మాఫియా దెబ్బకు ద్విచక్రవాహానాలపై మృతదేహాలు తరలించడమే ఈ మూడేళ్లలో జగన్ రెడ్డి వైద్యరంగంలో అమలుచేసిన నాడు-నేడు
• పాలనను, ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి
• చంద్రబాబు ఉత్తరాంధ్ర రా పర్యటనలో ప్రజా చైతన్యం కొట్టొచ్చినట్లు కనిపించింది
• జగన్ రెడ్డి బాదుడులో మీరుచెప్పేది పిసరంతే…మమ్మల్ని బాదింది కొండంత అంటూ జనమంతా ప్రతిపక్షనేత ఎదుట వాపోయారు
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి

రాష్టప్రభుత్వం పూర్తిగా అనారోగ్యంపాలై, కోలుకోలేనివిధంగా మంచానపడిందని, జగన్మోహ న్ రెడ్డి రాష్ట్ర వైద్యరంగాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించాడని, ప్రభుత్వాసుపత్రులు అత్యాచార కేంద్రా లుగా మారితే, అంబులెన్స్ ల మాఫియా దెబ్బకు మృతదేహాలను ద్విచక్రవాహానాలపై తరలి స్తున్నారని, మొత్తంగారాష్ట్రానికి ఇలాంటిపరిస్థితి కల్పించిన ఏకైకవ్యక్తిగా ముఖ్యమంత్రి చరిత్ర లోనిలిచిపోతాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఎద్దేవాచేశారు.

శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

జగన్ పాలనలో అటకెక్కిన నాడు-నేడు, ప్రభుత్వాసుపత్రులు, ప్రాథమికఆరోగ్యకేంద్రాల్లో వైద్యులు, మందులకొరత.. ఆరోగ్యశ్రీకింద ఉచితవైద్యం కలగామారింది..ఇలాంటి పరిస్థితు ల్ని ఈప్రభుత్వంలో చూస్తున్నాం. పాలనను, ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన ముఖ్యమంత్రి మాటలుకోటలు దాటుతున్నాయి. కార్పొరేట్ వైద్యశాలలకు ధీటుగా ప్రభుత్వ వైద్యశాలలను తీర్చిదిద్దుతున్నామని, ప్రతిఇంటికి ఉచితవైద్యసేవలు అందిస్తున్నామని ప్రగల్భాలుపలుకు తూ ప్రజారోగ్యగానికి మసిపూసి వాళ్లబతుకుల్ని శ్మశానాలపాలు చేయడానికి ప్రయత్ని స్తున్నాడు.

ప్రభుత్వ వైద్యశాలలో ఎక్కడా కనీసం మందులు, ఇతరవైద్యపరికరాలు లేవు. దానికికారణం ప్రభుత్వాసుపత్రులు, రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు మందులు, ఇతర వైద్యపరికరాలు సరఫరాచేసే సంస్థకు ఈ ముఖ్యమంత్రి దాదాపు రూ.2,800కోట్లు బకాయి పెట్టాడు. అలానే కోవిడ్ సమయంలో మందులుసరఫరా చేసినసంస్థలకు రూ.300కోట్ల వరకు అప్పుపెట్టాడు. అవికాకుండా కోవిడ్ మృతులకు కేంద్రప్రభుత్వం ఇచ్చిన రూ.50 వేల పరిహారాన్ని కూడా జగన్ ప్రభుత్వం దిగమింగింది. భారతదేశవ్యాప్తంగా కోవిడ్ తో చనిపోయి నవారిసంఖ్యను బాగాకుదించారని, దానిలో మరీముఖ్యంగా ఏపీలో బాగాతక్కువచేసి చెప్పా రని స్వయంగా డబ్ల్యుహెచ్ వో, (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) తననివేదికలో అభిప్రాయపడింది.

కోవిడ్ మృతులకు నష్టపరిహారం ఇవ్వాల్సివస్తుందని, రాష్ట్రవైద్యరంగం దుస్థితిప్రజలకు తెలి యకూడదనే జగన్ ప్రభుత్వం కోవిడ్ ఉధృతిని తక్కువచేసి చూపించింది. మూడేళ్లలో రాష్ట్ర వైద్యరంగానికి ఈ ముఖ్యమంత్రి ఏంచేశాడంటే.. ఎవరూసమాధానంచెప్పలేరు. 16 మెడికల్ కళాశాలలు కట్టామని బోగస్ ముఖ్యమంత్రి బోగస్ కబుర్లు చెబుతున్నాడు. అసలు కేంద్ర ప్రభుత్వం నుంచికళాశాలల నిర్మాణానికి అనుమతులు రాలేదు.వైద్యరంగాన్ని అడ్డుపెట్టుకొని దోచేస్తున్న ఫ్రాడ్ ప్రభుత్వానికి ఏఐఎండీసీ వారు ఏపీకి మెడిసిన్స్ సరఫరా చేయొద్దని రెడ్ నోటీసు ఎందుకిచ్చారో ముఖ్యమంత్రి చెప్పాలి?

జగన్ దోపిడీతో ఏపీఎంఎస్ఐడీసీ బ్రోకర్ ఏజెన్సీగా మారింది. జగన్ ప్రభుత్వంలో ఉద్యోగుల, పాత్రికేయులకు కూడా ఆరోగ్య రక్షణ లేకుండా పోయింది. ఆరోగ్యశ్రీ అంటేనే ప్రైవేట్ ఆసుపత్రులు రోగులనులోనికి రానివ్వడంలేదు. సీఎం రిలీఫ్ ఫండ్ కు చాలా మంది ప్రముఖులు, కార్పొరేట్ కంపెనీలు కోట్ల రూపాయలు ఇస్తారు. అలా వస్తున్న సొమ్మంతా ఎటు పోతుందో తెలియడంలేదు. జగన్ ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలపై దృష్టిపెట్టి, వాటిని బాగు చేయకుంటే, చాలాప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.

రాష్ట్రంలోని ప్రధాన వైద్యశాలల్లో ఈప్రభుత్వంచేసిన అభివృద్ధేమిటో చెప్పాలని ముఖ్యమంత్రి కి సవాల్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 16 మెడికల్ కళాశాలల్ని ఎక్కడనిర్మించాడో ముఖ్యమంత్రి చెప్పాలి. గతప్రభుత్వంలో నిర్మించిన వాటికి రిబ్బన్లు కత్తిరించడం, ఉత్తుత్తి శంఖుస్థాపనలుతప్ప, తనకంటూ ఈ మూడేళ్లలో ఇదిచేశానని ముఖ్యమంత్రి చెప్పగలడా? సచివాలయాలు నిర్మించిన తనపార్టీ వారికే జగన్ రెడ్డి బిల్లులు ఇవ్వలేదు. రైతుభరోసా కేంద్రాలు, రైతులను బాధించే కేంద్రాలుగామారాయి. కరోనా సమయంలో ముఖ్యమంత్రి పబ్జీ ఆడుకుంటూకూర్చోబట్టే, లెక్కల్లో లేనన్ని మరణాలురాష్ట్రంలో సంభవించాయని డబ్య్లుహెచ్ వో చెప్పింది.

చంద్రబాబు పర్యటనలో ప్రజాచైతన్యం కొట్టొచ్చినట్టు కనిపించింది….
చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో ప్రజల చైతన్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. జగన్ రెడ్డి బాదుడుదెబ్బకు ప్రజలంతా రోడ్లమీదకొచ్చి, మీరుచెప్పేదానికంటే వందరెట్లు అధికంగా జగన్ రెడ్డి మమల్ని చావబాదుతున్నాడని చంద్రబాబుగారితో చెప్పుకొని వాపోతున్నారు. రూ.150లు వచ్చే కరెంట్ బిల్లు రూ.400వస్తోందని.. పెట్రోల్ డీజిల్ ధరలపెంపు, ఆర్టీసీ ఛార్జీలపెంపు, నిత్యావసరాల ధరలపెంపు, ఆస్తిపన్ను..నీటిపన్ను, డ్రైనేజ్ పన్ను… చెత్తపన్ను..ఇతరత్రాపన్నులతో బాదుతున్నదికాక, మద్యం, ఇసుక ధరలు పెంచేసి మాములుగా దోచుకోవడంలేదని లబోదిబోమంటున్నారు.

ఒకచేత్తో ఇచ్చి, మరోచేత్తో ప్రజలనుంచి నాలుగురెట్లు ఈ ముఖ్యమంత్రి లాక్కుంటున్నాడు. ఆటో తోలుకొనే వ్యక్తి నాతోచెప్పాడు… “రాష్ట్రంలో 6లక్షలమంది ఆటోడ్రైవర్లుఉంటే, వారిలో లక్షా 80వేలమందికి వాహనమిత్రకింద రూ.10వేలిచ్చి, మిగిలిన 4లక్షల20వేలమందికి పంగనామాలుపెట్టాడని, పెట్రోల్ డీజిల్ ధరలుపెంచి రోజూ ప్రతి డ్రైవర్ నుంచి రూ.200లు అదనంగాగుంజుకున్నాడని, అదిచాలదన్నట్లు ఆర్టీవో, పోలీస్ అధికారులతో నెలనెలా రూ.2 నుంచి రూ.3వేలవరకు వసూళ్లుచేయిస్తున్నాడు” చెప్పివాపోయాడు. అదీ ఈ ముఖ్యమంత్రి బాదుడు దెబ్బప్రభావం. ఆటోడ్రైవర్లకు ఇచ్చిందెంత.. వారినుంచి అదనంగా ఈ ముఖ్యమంత్రి గుంజుకున్నది ఎంత?

అలానే మహిళలకు, రైతులకు, చేనేత కార్మికులకు, విద్యార్థులకు అందరికీ నిలువునా పంగనామాలే పెట్టాడు. గతప్రభుత్వంఇలాంటి లెక్కలు లేకుండా, చదువుకునే విద్యార్థులు అందరికీ ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చింది. అలానే ప్రతిమహిళకు పసుపుకుంకుమ కింద, డ్వాక్రా రుణ మాఫీకింద దాదాపు 30వేలవరకు సాయం అందించింది.

ఎప్పుడో ఎన్టీఆర్ గారి హయాంలో కట్టినఇళ్లకు ఓటీఎస్ పేరుతో దోచుకునే అధికారం ఈ ముఖ్యమంత్రికి ఎవరిచ్చారు? రైతులకుఇవ్వాల్సిన సబ్సిడీలు, విత్తనాలు, యంత్రాలు ఏవైనా తనపాలనలో జగన్ రెడ్డి సక్రమంగా ఇచ్చాడా? డ్రిప్ ఇరిగేషన్ స్కీమ్.. ఎన్టీఆర్ జలసిరి ఏమయ్యాయి? చివరకు అప్పులకోసం రైతులమోటార్లకు మీటర్లు బిగించడానికి సిద్ధమయ్యాడు.

పోలీస్ శాఖలోపనిచేసే ప్రతి ఒక్కరూ సంవత్సరానికి రూ.లక్షనుంచి రూ.2లక్షలవరకు కోల్పోతున్నామని సదరుశాఖలోనే వారేచెబుతున్నారు. ముఖ్యమంత్రి బాదుడుదెబ్బకు బలికానివారంటూ రాష్ట్రంలోఎవరూలేరు.
అన్నివర్గాల్లోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండబట్టే, చంద్రబాబునాయుడిగారి పర్యటనలో బ్రహ్మండమైన స్పందన కనిపించింది. అరాచక, అటవిక, రాక్షసపాలన నుంచి నువ్వుమమ్మల్ని కాపాడలంటూ ప్రతిఒక్కరూ చంద్రబాబుగారికి మొరపెట్టుకుంటున్నారు. రాష్ట్రాన్ని,ప్రజలను కాపాడేశక్తి ఆయనకు తప్ప మరొకరికిలేదని స్పష్టమవుతోంది. రామచంద్రాపురంలో చంద్రబాబుగారి సభలో 1000మంది టీడీపీ కార్యకర్తలుంటే, ముగ్గురు వైసీపీకార్పొరేటర్లు వారివెంట నలుగురిని వేసుకొచ్చి చంద్రబాబు గోబ్యాక్ అని నినాదాలుచేశారు. వారు 8మందిలేరు…. వారు చేసిన పనికి మాపార్టీవారికి ఆగ్రహంవచ్చి వారిని తరిమితే ఏంచేసేవారు?

మా నాయకుడి ఆదేశాలతో వారు సంయమనం పాటించారు. జగన్ రెడ్డి దిగిపోయేసమయం దగ్గరకు వచ్చింది. ఆయనప్రస్తుతం పాకుడుమెట్లపై ఉన్నాడు.. రెండేళ్లపాలు కోవిడ్ ను అడ్డంపెట్టుకొని ముఖ్యమంత్రి ప్రజాగ్రహాన్ని అణచివేసి, బయటకురాకుండా తప్పించుకు తిరిగాడు. హోంమంత్రిగా ఉన్నవ్యక్తి తల్లులపెంపకం సరిగాలేకనే అత్యాచారాలు జరుగుతున్నాయనిచెప్పడం సిగ్గుచేటు.

టీడీపీ హయాంలో అత్యాచార నిరోధక చట్టం కిందబాధితులకు రూ.50కోట్లే ఖర్చుపెట్టారంటే, చంద్రబాబుగారిపాలనలో మహిళలపై అత్యాచారాలు, ఇతరత్రా వేదింపులఘటనలు జరగలేదనేకదా! చంద్రబాబుగారి పర్యటన లు రోజురోజుకు పెనుప్రభంజనంగా మారి, ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి దుర్మార్గాలను కూకటి వేళ్లతో సహా పెకలించడం ఖాయం.

 

LEAVE A RESPONSE