– నాలుగున్నరేళ్లలో జగన్ రెడ్డి బీసీలకు చేసింది శూన్యం. ఎన్నికలు సమీపిస్తున్నాయనే జగన్ బీసీల జపం మొదలెట్టాడు
• తన భజన చేసే 50 మంది బీసీలకు పదవులిస్తే మొత్తం బీసీవర్గాన్ని ఉద్ధరించినట్టు కాదని జగన్ రెడ్డి గ్రహించాలి
• సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం అధికారం ఉందని బీసీల గురించి మాట్లాడుతున్నాడు
• బీసీలపై జగన్ రెడ్డి.. ఆయన సామంత రెడ్ల పెత్తనమేంటి?
• తెలుగుదేశానికి పడే బీసీల ఓట్లు తొలగించడానికే జగన్ కులగణన అంటున్నాడు
– మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న
తడిగుడ్డతో బీసీల గొంతు కోసింది ఎవరయ్యా అంటే చిన్నపిల్లలు కూడా జగన్ రెడ్డేనని చెబుతారని, తాను ముఖ్యమంత్రి అయ్యాక 74మంది బీసీల్ని దారుణం గా హత్యచేయించి, దాదాపు 800మందిపై అక్రమ కేసులు పెట్టి వేధించాడని, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“ జగన్ రెడ్డి ముమ్మాటికీ బీసీల ద్రోహి. సజ్జల రామకృష్ణారెడ్డి బీసీల గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. బీసీల గురించి వైసీపీ అధ్యక్షుడిగా.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి మాట్లాడాలి. గుమాస్తాగిరీ చేసుకునే సజ్జలకు ఏం హక్కు.. అధికారం ఉన్నాయని బీసీల గురించి మాట్లాడు తున్నాడు. అసలు బీసీల గురించి మాట్లాడటానికి ప్రభుత్వంలో..వైసీపీలో సరైన బీసీ నాయకుడే లేడా?
తనదోపిడీ కోసం రాష్ట్రాన్ని 5 భాగాలుగా విడగొట్టిన గజదొంగ జగన్ రెడ్డి. బీసీ మంత్రులది బస్సుయాత్ర కాదు.. బేవార్స్ యాత్ర
బీసీల సంక్షేమానికి వెచ్చించాల్సిన రూ.75వేలకోట్ల సబ్ ప్లాన్ నిధుల్ని దారి మళ్లించింది జగన్ రెడ్డి కాదా? టీడీపీ ప్రభుత్వంలో బీసీ ఫెడరేషన్లు, కార్పొరేషన్ల ద్వారా 4లక్షల మందికి రూ.3,700కోట్ల స్వయం ఉపాధి రుణాలు అందిస్తే, జగన్ రెడ్డి 56 ఉత్తుత్తి బీసీ కార్పొరేషన్లు పెట్టి, రూపాయి కూడా సాయం చేయంది నిజం కాదా? 74 మంది బీసీలను దారుణంగా హత్యచేయించిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. రాష్ట్రాన్ని 5 భాగాలుగా విడగొట్టి.. తనవర్గం వారిని సామంతరాజులుగా నియమించి, వారి ద్వారా జగన్ తనదోపిడీని సాగిస్తున్నది నిజం కాదా? చిత్తూ రు నుంచి శ్రీకాకుళం వరకు ఒక్క జిల్లాలో అయినా ఒక్క బీసీ నాయకుడికి తగిన ప్రాధాన్యత…ప్రాముఖ్యం జగన్ పాలనలో ఉందా?
ఆఖరికి నూటికి 90 మంది బీసీలు.. ఎస్సీలు ఉంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి జగన్ రెడ్డి.. వైవీ.సుబ్బారెడ్డి ని ఇన్ ఛార్జ్ గా నియమించాడు. అదీ జగన్ రెడ్డికి బీసీలపై ఉన్న ప్రేమ. కేవలం ఎన్నికలు సమీపిస్తున్నాయనే జగన్ రెడ్డి ఇప్పుడు బీసీల జపం మొదలెట్టాడు. బీసీ మంత్రుల బస్సుయాత్ర అనే దానికంటే బేవర్స్ మంత్రుల బస్సుయాత్ర అంటే సముచితంగా ఉంటుంది. పేరుకే బీసీ మంత్రులు.. వారికి ఎలాంటి అధికారం.. హక్కులు లేవన్నది ప్రజలకు కూడా బాగా తెలుసు.
బీసీల్లో ఎక్కువ మంది పేదలే. వారిలో చాలామంది పూటగడవడమే కష్టంగా జీవిస్తుంటారు. అలాంటి బీసీల కడుపుపై కొట్టేలా జగన్ రెడ్డి ఇసుకదోపిడీకి తెరలేపాడు. కల్తీ మద్యాన్ని అధికధరకు నగదు చెల్లింపులకు అమ్ముతూ..బీసీల కష్టార్జితాన్ని దోచుకున్న గజదొంగ జగన్ రెడ్డి. ఆ గజదొంగకు వంత పాడుతున్న 5 గురు చిన్నదొంగలు 5 గురు సామంతరాజులు. నాలుగున్నరేళ్లలో బీసీవర్గాలకు ఇది చేశానని చెప్పలేని దుస్థితిలో జగన్ ఉన్నాడు.
తనకు భజన చేసే 50 మంది బీసీలకు పదవులిస్తే.. మొత్తం బీసీలను ఉద్దరించినట్టు కాదని జగన్ రెడ్డి తెలుసుకోవాలి
జగన్ రెడ్డి బీసీల పక్షపాతే అయితే..చంద్రబాబు బీసీలకోసం అమలుచేసిన అనేక పథకాల్ని ఎందుకు రద్దుచేశాడు? ఆదరణ పథకం ఏమైంది? అన్నాక్యాంటీన్లు ఎందుకు మూసేశారు? ఎందరు బీసీలకు జగన్ రెడ్డి హాయాంలో సీఎం.రిలీఫ్ ఫండ్ సాయం అందింది? అసలు రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరికైనా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఒక్క దళితుడు..ఒక్క బీసీ.. ఒక్క మైనారిటీకైనా జగన్ రెడ్డి పైసా సాయం అందించాడా?
బీసీలకు రాజ్యసభ పదవులు.. మంత్రులు.. కార్పొరేషన్ ఛైర్మన్లు ఇస్తే బీసీవర్గాన్ని ఉద్ధరించినట్టు కాదు జగన్ రెడ్డి. కేవలం జగన్ రెడ్డి భజన చేస్తూ..ఆయన చుట్టూ తిరిగే ఒక 50, 100 మందికి పదవులిస్తే.. మొత్తం బీసీవర్గాన్నే బాగుచేసినట్టు కాదు. చంద్రబాబు హయాంలో ఎందరు బీసీనేతలు కీలక పదవుల్లో కొనసాగారో…. జగన్ రెడ్డి వచ్చాక ఎందరికి ముఖ్యమైన పదవు లు ఇచ్చాడో చూస్తే, ఆ విషయంలో కూడా జగన్ రెడ్డికి సున్నామార్కులే పడతాయి.
టీడీపీకి పడే బీసీల ఓట్లు తొలగించడానికే జగన్ రెడ్డి కులగణన అంటున్నాడు
త్వరలోనే చంద్రబాబునాయుడితో టీడీపీ బీసీనేతలమైన తాము సమావేశమై… ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ ప్రకటిస్తాం. జగన్ రెడ్డి అతని మంత్రులు బస్సుయాత్ర చేసినా బీసీలు ఎవరూ వారిని ఆదరించలేదు. టీడీపీ బీసీ నేతల మైన తాము ఆటోల్లో వెళితేనే బీసీలు తమను అక్కున చేర్చుకుంటారు. జగన్ రెడ్డి చేయిస్తానంటున్న కులగణన ముమ్మాటికీ బీసీల మధ్య చిచ్చుపెట్టడానికే.
తెలుగుదేశానికి పడే బీసీల ఓట్లు తొలగించడానికే జగన్ కులగ ణన అంటున్నాడు. బీసీలు ప్రతిరోజూ తమ ఓటు ఉందో లేదో సరిచూసుకోవాలి. ఓటు లేకపోతే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి పోరాడైనా ఓటు సాధించాలి.