– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి లుక్కా సాయిరాం
తెలుగుదేశం పార్టీ నాయకులు కేసినేని శివనాథ్ చిన్ని కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి లుక్కా సాయిరాం గౌడ్ మాట్లాడుతూ బీసీలకు రావాల్సిన అనేక సంక్షేమ పథకాలను రద్దుచేసి బీసీలను మోసం చేసిన ఘనత బీసీ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు
రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చేసి నలుగురు దుష్టశక్తులకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయసాయిరెడ్డి రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి లాంటి వారికి అప్పజెప్పి రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి సహజవానులని మైనింగ్ ని ఇసుకని దోపిడీ చేసి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కి తరలించే బాధ్యతను వారికి అప్పజెప్పారని ఆయన విమర్శించారు
బీసీ యువతకు ఉన్నత విద్యను దూరం చేసిన ఘనత విదేశీ విద్య అవకాశాలు లేకుండా చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఆయన అన్నారు.వైఎస్ఆర్సిపిలో బీసీలకు రాజకీయ భవిష్యత్తు లేదనవటానికి అనేక ఉదాహరణలు ఉన్నాయని కొలుసు పార్థసారథి అలాగే కర్నూలు ఎంపీ సంజీవరెడ్డి గారు రాజీనామా చేసి బయటికి రావడం చూస్తుంటే వైసిపిబీసీలకు ఇచ్చే ప్రాధాన్యత ఏంటో అర్థమవుతుందని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీలో బీసీలకు ప్రాధాన్యతరించి కేఈ కృష్ణమూర్తి యనమల రామకృష్ణుడు ఇంకా అనేకమందికి ఉన్నత పదవులు అప్పజెప్పి స్వేచ్ఛనిచ్చి పరిపాలన చేసిన ఘనత చంద్రబాబునాయుడు ది మాత్రమేనని ఆయన గుర్తు చేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీ ఎస్సీ మంత్రులకు నోరు కట్టి అన్ని రకాల మాటలను అన్ని రకాల విషయాలను సకల శాఖ మంత్రి రామకృష్ణారెడ్డి అధికారం చలయించే విధంగా నిర్ణయాలు తీసుకునే విధంగా చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి అన్నారు
75 వేల కోట్ల రూపాయలు బిసి సబ్ ప్లాన్ నిధుల్ని దారి మళ్లించి బీసీలకు తీవ్రమైన అన్యాయం చేశారని అన్నారు. స్థానిక సంస్థల్లో చంద్రబాబునాయుడు గారు 34 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తే ఈ సైకో ముఖ్యమంత్రి దాన్ని 24 శాతానికి కుదించి బీసీలకు రావాల్సిన 16,800 సర్పంచులు ఎంపీటీసీలు, జడ్పిటిసి లను పదవులు రాకుండా చేసిన దుర్మార్గపు ముఖ్యమంత్రి బీసీ వ్యతిరేకి జగన్మోహన్రెడ్డి కాదా అని ప్రశ్నించారు.
తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్లను ఫెడరేషన్ ద్వారా నాలుగు లక్షల మందికి 3700 కోట్లు రుణాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి 56 కార్పొరేషన్లు పెట్టి ఒక్క రూపాయి కూడా కార్పొరేషన్లకు నిధులు ఇవ్వకుండా మోసం చేసిన ఘనుడని ఆయన విమర్శించారు. లక్షలాదిమంది బీసీ ఎస్సీ విద్యార్థులకు స్టడీ సర్కిల్ ద్వారా చదివించి ఐఏఎస్ లో ఏపీఎస్ లో ఉన్నత ఉద్యోగాలు వచ్చే విధంగా చర్యలు చేపట్టిన ఘనత చంద్రబాబు నాయుడు ని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా టెక్నికల్ విద్యార్థులకు రెండు లక్షల 13 వేల మందికి ట్రైనింగ్ ఇస్తే లక్ష మందికి పైగా ఉన్నత ఉద్యోగాలు సాధించిన పరిస్థితి నాది ఉండేదని కానీ నేడు ఉద్యోగాల కోసం వెతుక్కునే పరిస్థితి కల్పించిందని ఇంత మందికి ఉద్యోగాలు కల్పించి ఈ అంశములు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జగన్మోహన్ రెడ్డి నియంతృత్వానికి పరాకాష్టని ఆయన అన్నారు
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రతి జిల్లాకు బీసీలకు సంబంధించిన 13 బీసీ భవనాలు 118 కమ్యూనిటీ హాళ్లు శంకుస్థాపన చేసి నిధులు కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి వాటిని శిథిలావస్థకు చేర్చాడని ఆయన విమర్శించారు. APII,RTC,TTD లాంటి ఆర్థికంగా బలమైనటువంటి వాటిలో తెలుగుదేశం సమయంలో చైర్మన్లుగా డైరెక్టర్ గా నియమించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిని ఆయన అన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లయంలో ఈ రకంగా బీసీలకు ఉన్నత పదవులు ఇవ్వగలరా అని ఆయన ప్రశ్నించారు.
రిక్షా ధరల పెంచి కూరగాయ రేట్లు అనిపించి పెట్రోల్ డీజిల్ ధరలను అదుపు చేయకుండా ప్రజలపై పారాల మీద భారాలను మోపుతూ బీసీలను మోసం చేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనకు అవసరమా అని ఆయన ప్రశ్నించారు. బీసీ అత్యధికంగా ఉపాధి కోసం మృతి నిర్వహించేటటువంటి ఆశ వర్కర్లు మున్సిపల్ వర్కర్లు వాలంటీర్లను వాళ్ళ సమస్యలను పట్టించుకోకుండా వాళ్ళ వేతనాల గురించి ఆలోచించకుండా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న అణిచివేసేటట్లు పద్ధతులు వ్యవహరిస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకరణ చేపట్టకుండా బీసీ యువతను బీసీ నిరుద్యోగంలో మోసం చేస్తున్నాడని ఆయన అన్నారు.పేదలకు పండుగలు కానుకలు ఇవ్వకుండా ఆడపిల్లలు పెళ్లి లకు కానుక అందించకుండా ఉన్న పథకాలన్నీ రద్దుచేసి సంక్షేమం గురించి మాట్లాడటం అంటే దెయ్యాలు వేదాలు వల్లించటమేనని ఆయన విమర్శించారు. బీసీలకు న్యాయం జరగాలంటే ఉపాధి అవకాశాలు రావాలంటే యువతకు భవిష్యత్తు ఉండాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవ్వాలి అని ఆయన అన్నారు.
అందుకోసమే 175కు 160 స్థానాల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించే బాధ్యత బీసీలుగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వై నాట్ 160 అని నినాదంతో వీసీలందరి ఏకంగా కావాలని చంద్రబాబు గారిని బలపరిచి తెలుగుదేశం అధికారంలోకి తీసుకువచ్చే వరకు పలుపెరగకుండా పనిచేయాలని ఆయన అన్నారు. బీసీలారా మేల్కొని ఉండి మన దమ్ము చూపిద్దాం ఈ జగన్మోహన్ రెడ్డి బంగాళాఖాతంలో కలిపేద్దాం జగన్న రాజకీయాలనుండి పారిపోయేలాగా మన నిర్ణయం ఉండాలి.