కేశినేని నాని అనే నిన్ను తెలుగుదేశం పార్టీ 10 సంవత్సరాలు మోసింది

– 10 సంవత్సరాలు పార్టీని నువ్వు మోయలేదు
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోట వీరబాబు

నందిగామ : తెలుగుదేశం పార్టీ ఒక కర్మాగారం 40 సంవత్సరాల చరిత్ర గలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కేశినేని నాని మీరు పార్టీలో రాకముందే మీలాంటి ఎందరో నేతలను తెలుగుదేశం పార్టీ చూసింది.అభివృద్ధి అనే పేరిట దొంగల పార్టీ వైసీపీ నేతలకు మీ నిధులు దోచి పెట్టడం వాస్తవం కాదా? తెలుగుదేశం పార్టీని ధిక్కరించిన ఎందరో నేతలు గోడకు కొట్టిన బంతిలా తిరిగి వచ్చారు దానికి రామచంద్రయ్య, వీరభద్రరావు లాంటి నేతలే ఉదాహరణ.

పార్టీ కార్యకర్తలను వారి మనోభావాలను కించపరుస్తూ మీరు వ్యవహరించిన తీరుకు పార్టీ ఎక్కడా కూడా హద్దు మీరలేదంటే అది తెలుగుదేశం పార్టీకి ఉన్న గొప్పతనం. అది మా అధినేత నారా చంద్రబాబు నాయుడు మాకు నేర్పిన క్రమశిక్షణ,కట్టుబాట్లు. కేశినేని శ్రీనివాస్ నాని అనే వ్యక్తికి తెలుగుదేశం పార్టీ వలన విలువ పెరిగింది తప్పితే, నాని అనే వ్యక్తి వల్ల తెలుగుదేశం పార్టీకి ఎటువంటి వైభవం రాలేదు అది నాని గుర్తుపెట్టుకోవాలి.

కేశినేని నాని అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో సముద్రంలో అలలాంటివాడు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు.అలాంటి వారి వలన ప్రజాప్రయోజనార్థం పెద్ద ఉపయోగం ఏమీ ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.

Leave a Reply