మాఫియా డాన్ నుంచి ప్రజలను కాపాడతాం

-రాక్షస ప్రభుత్వానికి చరమగీతం పాడాల్సిన బాధ్యత ప్రజలదే
-జగన్ ను ఓడిస్తేనే జనాలకు రక్షణ
-సైకో పాలన ను ఇంకా భరిస్తారా
-ఏ ఒక్క వర్గానికి రక్షణ లేదు
-చాక్లెట్ ఇచ్చి నక్లెస్ కొట్టేస్తున్నారు
-జగన్ పాలనపై కన్నా లక్ష్మీనారాయణ ఫైర్
-సత్తెనపల్లి తొండపి గ్రామంలో కన్నా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులు

పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ప్రోగ్రాం నిర్వహించబడింది మహిళలు హారతులు తోటి ఘన స్వాగతం పలికారు తదానంతరం మహిళలకు కరపత్రాలు పంచి పథకాల గురించి వివరించారు.

మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అందరికీ చాక్లెట్ ఇస్తూ నక్లెస్ కొట్టేస్తున్నాడు అనే విషయం తెలియదని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని సత్తెనపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలు దోచుకుంటున్న విగ్రహ శక్తులను తరిమి తరిమి కొట్టాల్సిన సమయం వచ్చిందని రాక్షస పాలన నుంచి విముక్తి కోసం ప్రజలంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు.

సత్తెనపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలని మాఫియా డాన్ రాజ్యం నుంచి మనమందరం విముక్తి చెందాలని ..రాక్షస పాలన నుంచి రామరాజ్యం రావాలని సత్తనపల్లిలో కొన్ని కొన్ని విద్రోహక శక్తులు ఉన్నాయని వాటిని తరిమి కొట్టాలని.. తెలుగుదేశం జనసేన కార్యకర్తల పైన కేసులు పెట్టి భయభ్రాంతులను గురిచేసారని వారిని ఊరికే విడిచి పెట్టేది లేదని తెలియజేశారు.

సత్తనపల్లి ప్రజలకు ఎవరు అభివృద్ధి చేస్తారు ఎవరు దోచుకుంటారో తెలుసని ఎవరు సంబరాలు జరుపుకుంటారు కూడా తెలుసు అని ఎన్ని శక్తులు అడ్డుపడిన సత్తెనపల్లి నియోజకవర్గం లో గెలిచేది తెలుగుదేశం పార్టీ అని తెలియజేశారు మహాశక్తి పేరుతో ప్రకటించిన పథకం ద్వారా మహిళా సాధికారత చేకూర్చడం ఆడపడుచులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు.

సాగు బారమై రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారికి అండగా ఉండేందుకు ఆర్థిక సహాయం చేస్తామని వెల్లడించారు 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తామని ఇంటింటికి ఉచితంగా రక్షిత తాగునీటి కొళాయి కల్పించనున్నారు పేదరికం రూపుమాపేందుకు పి ఫోర్ పూర్ టు రిచ్ విధానం ద్వారా పూర్తి కార్యక్రమం చేపట్టనున్నారని తెలియజేశారు.

మనమందరం కూడా 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దుర్మార్గపు చర్యలను చూస్తూనే ఉన్నామని వ్యవస్థల్ని నాశనం చేసాడని అలాగే జగన్మోహన్ రెడ్డి దళితులకు ద్రోహం చేస్తూనే వచ్చాడని రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులు దోచుకున్నాడని రాజ్యాంగబద్ధంగా 14 శాతం నిధులు మీకు రావాలని చట్టానికి వ్యతిరేకంగా ప్రజాసమును కొన్ని వేల కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు.

అలాగే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా చదువుకున్నటువంటి పిల్లలకి దళితులకు చెందిన 27 పథకాలు రద్దు చేశాడని దళితులకు ద్రోహం చేస్తూనే వచ్చాడని తను అధికారం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల పేరుతో సంపద మొత్తం దోచుకుంటున్నాడని.. భారత దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతాడని విమర్శించారు.

అలాగే కరెంటు బిల్లులు 9సార్లు పెంచిన ఘనుడిగా చరిత్రలో నిలిచిపోతాడని బస్ చార్జీలు బాదుడే బాదుడని తెలియజేశారు సగటున ఒక క్వార్టర్ కి తన ప్రభుత్వంలో ఒక మనిషి మీద రెండు రూపాయల ఆదాయం తీసుకుంటున్నాడని తెలియజేశారు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే దళిత సోదరులందరూ మైనారిటీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ కలిసికట్టుగా పనిచేస్తే తెలుగుదేశం జనసేన కోటమే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అన్నారు.

మీరందరూ కలిసి కృషి చేసి ప్రభుత్వాన్ని తీసుకురావాలన్నారు అలాగే ఇంట్లో ఎంతమంది చదువుకున్న ఒక్కొక్కరికి 15000 రూపాయలు చొప్పున అందరికీ ఇస్తానని సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని నిరుద్యోగ భృతి కింద నెలకి మూడు వేల రూపాయలు ఇస్తామని అలాగే వెనుకబడిన తరగతుల వర్గాల వారికి దళితులకు ప్రత్యేక రక్షణ చట్టం రూపొందిస్తామని ఇది తొలి విడత మేనిఫెస్టోలో చెప్పింది తర్వాత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఇంకా సంక్షేమ అభివృద్ధి పథకాలు శ్రీకారం చుడతారని చెప్పారు.

మనమందరం కలిసి ఈ బ్రిటిష్ పాలన అంతం చేయాలని రాష్ట్ర నుంచి తరిమికొట్టాలని మనమందరం కలిసి అమరావతిని రాజధానిగా తెచ్చుకుందామని పోలవరం నిర్మాణం చేసుకుందామని ఈ రాక్షసుడు నుంచి దోపిడీ దొంగల ముఠా నుంచి సైకో నుంచి రాష్ట్రం నుంచి ప్రాలదొలాలని అని అన్నారు .

ఈ కార్యక్రమం లో సత్తనపల్లి నియోజకవర్గం యువ నాయకులు మరియు డాక్టర్ పవన్ కుమార్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు బత్తుల నాగేశ్వరావు , గ్రామ పార్టీ అధ్యక్షులు రాయిడి వెంకటరావు, మాజీ ఎంపిటిసి రాయిడి శ్రీనివాసరావు గారు రాయుడు అప్పారావు, నల్లబోతు మాణిక్యరావు, గుత్తా రామారావు, గోరుబోతు మోహన్ రావు, రాయిడి శేషయ్య , చల్లా కోటేశ్వరరావు, షేక్ బాబావాలి, ముజావర్ బాజీ , నిమ్మకాయల బుడా,బందెల బుడా గ్రామానికి చెందిన నాయకులు కార్యకర్తలు జనసైనికులు పాల్గొన్నారు

Leave a Reply