హైదరాబాద్ : ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 20 ఏళ్ల ముగింపు ఉత్సవాలకు అతిథిగా తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఐస్బీ ఏర్పాటు జ్ఞాపకాలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 20 ఏళ్ల ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిధిగా హాజరు కావాలని, తెదేపా అధినేత చంద్రబాబును విద్యాసంస్థ అధిపతి పిల్లుట్ల మదన్ ఆహ్వానించారు. 2022 డిసెంబర్ 16న జరిగే ముగింపు ఉత్సవాలకు హాజరు కావాలని ఐఎస్బీ ప్రతినిధులు కోరారు. దీనిపై స్పందించిన చంద్రబాబు.. ఐఎస్‌బీ ఏర్పాటు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సమయం ఎంతో వేగంగా గడిచిపోయిందంటూ ఐఎస్‌బీతో తనకున్న అనుబంధాన్ని తెలిపారు.