Suryaa.co.in

ఏపీలో ఒమైక్రాన్‌ కలకలం
National

జర భద్రం బ్రదరూ..! కోవిడ్ పోలేదు..!?

దేశం ఇంకా చాలా కాలం పాటు అప్రమత్తంగా ఉండాల్సిందే..జనాభాలో అత్యధిక శాతం కోవిడ్ జాగ్రత్తలు గాలికి వదిలేస్తున్న తరుణంలో ముప్పు ఇంకా పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలో కేసుల సంఖ్య..పాజిటివిటీ రేటు పెరుగుతున్న నేపథ్యంలో జనాలు విచ్చలవిడి తనానికి ఇంకొన్నాళ్ళ పాటు స్వస్తి చెప్పాల్సిందే..అయితే మరీ ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేకపోయినా అదే సమయంలో జాగ్రత్తలు కూడా తప్పనిసరే..

ప్రస్తుతం దేశ రాజధానిలో విస్తరిస్తున్న మహమ్మారి ఏ కోవకు చెందినదో తెలుసుకునేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి.ఇప్పుడు ఓమిక్రాన్లో BA.1..2…3..4 రకాలు ఉన్నాయి.వాటిలో BA 1..2 మన దేశంలో వ్యాప్తి చెందాయి.ఇప్పుడు ఇండియాలో ఒమిక్రాన్ X రకాన్ని కనుగొన్నారు.BA 1..BA 2 రకాలు కలవడం వల్ల ఇది ఉద్భవించింది.
అయితే అక్కడక్కడా కేసుల సంఖ్యలో పెరుగుదల ఉన్నా ఆస్పత్రులలో చేరుతున్న వారు లేరని..ఇది ఊరట కలిగించే విషయమేనని వైద్యులు అంటున్నారు.

ఇ.సురేష్ కుమార్

LEAVE A RESPONSE