Suryaa.co.in

Andhra Pradesh

బెంగళూరు, చెన్నై ఎయిర్ పోర్టులకు ధీటుగా గన్నవరం ఎయిర్ పోర్ట్ సుందరికరణ

-బ్యూటిఫికేషన్ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్

గన్నవరం : విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు నుండి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు చేపట్టనున్న గ్రీనరీ సుందరీకరణ పనులకు అలాగే ఎయిర్ పోర్ట్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాల వద్ద సుందరికరణ అభివృద్ధి పనులకు శుక్రవారం గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు శంకుస్థాపన చేశారు.

పనుల ప్రారంభించడానికి సహకరించిన ఆంధ్ర ప్రదేశ్ గ్రీనరీ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ అధికారులను ఆయన శాలువాతో సత్కరించి అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే యార్లగడ్డ మీడియాతో మాట్లాడుతూ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎంతోమంది విదేశీయులు పారిశ్రామికవేత్తలు ప్రముఖులు వస్తుంటారని అటువంటివారు ప్రయాణించే రోడ్డు మార్గంలో గ్రీనరీ సరిగా లేని పరిస్థితి నెలకొందని అన్నారు.

అలానే గన్నవరం విజయవాడ మార్గంలో ఫుట్ పాత్ రైలింగ్ లు పాడైపోయిన పరిస్థితి ఉందని చెప్పారు. ప్రముఖులు ప్రయాణించే రోడ్డు మార్గంలో ఎటువంటి ప్రమాణాలు ఉండాలన్న విషయంలో అధికారులను సమన్వయం చేయడానికి ఎక్కువ సమయం పట్టిందని అన్నారు. కేసరపల్లి నుండి గన్నవరం ఎయిర్ పోర్ట్ వరకు 15 వేల చదరపు అడుగులలో గ్రీనరీ బ్యూటిఫికేషన్ పనులను ప్రారంభిస్తున్నామని 15 రోజుల్లో ఈ పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి చిన్న అవుటపల్లి వరకు గ్రీనరీ బ్యూటిఫికేషన్ పనులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. బెంగళూరు చెన్నై ఎయిర్ పోర్ట్ ల వద్ద ఉన్న బ్యూటిఫికేషన్ కు దీటుగా గన్నవరం ఎయిర్ పోర్ట్ ను తీర్చిదిద్దుతామని చెప్పారు.

మల్లవల్లి పారిశ్రామికవాడలో ఎకరం 16.5 లక్షలకే పారిశ్రామికవేత్తలకు భూములను కేటాయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మల్లవల్లిలో 426 పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలకు భూములు కేటాయించారని 18 మాసాల్లో పనులు ప్రారంభించకపోతే భూములు వెనక్కి తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 15,000 మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి తీరుతామని స్పష్టం చేశారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ ఎదురుగా ఉన్న 15 ఎకరాల ప్రభుత్వ భూమిలో పది ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ ను , 2.5 ఎకరాల్లో ప్రభుత్వ గెస్ట్ హౌస్ ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరినట్లు వెల్లడించారు.

ట్రిపుల్ ఐటీ ను గన్నవరం తీసుకువచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. గన్నవరం నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తానని ఎమ్మెల్యే యార్లగడ్డ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమం లో నాయకులు ఆళ్ల గోపాలకృష్ణ, గుజ్జర్లపూడి బాబురావు , జాస్తి వెంకటేశ్వరరావు , గూడవల్లి నరసింహారావు , దొంతు చిన్నా , తెలుగు మహిళా నేతలు మల్ఫురి సాయి కళ్యాణి , మెడేపల్లి రమ , ఆంద్ర ప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేష్ కార్పోరేషన్ ఎండి రాజశేఖర్ రెడ్డి , ఆంద్ర ప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేష్ కార్పోరేషన్ జీఎం దయాకర్ బాబు , ఆంద్ర ప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేష్ కార్పోరేషన్ పిన్సిపల్ ల్యాండ్ స్కెప్ అర్కిటెక్ సత్యనారాయణ , ఎన్.హెచ్.ఏ.ఐ పిడి విజయవాడ శ్రీధర్ రెడ్డి, వెటర్నరి కళాశాల ప్రిన్సిపాల్ పివిఎస్ కిషోర్ , డిపిఓ అరుణ , ఎమ్మార్వో శివయ్య , గన్నవరం సీఐ శివ ప్రసాద్ ఇతర అధికారులు , కూటమి నేతలు , నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE