Suryaa.co.in

Andhra Pradesh

దేవుడి లడ్డులో గొడ్డు మాంసమా…

  • అన్య మతస్తుల్ని చైర్మన్లుగా నియమించి చేసిన నిర్వాకం ఇదా జగన్…
  • హిందూ ధర్మం హిందూ దేవి దేవతలపై నీకు ఎందుకు అంత కక్ష జగన్…
  • ప్రజా ప్రతినిధులకు గరుడ పురాణంపై శిక్షణను ఇప్పించాలి…
  • కూటమి ప్రభుత్వం మోడీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా దేవాలయాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకుండా పార్లమెంట్లో చట్టం చేయాలి…
  • తిరుమల అపవిత్రతపై బ్రాహ్మణ సమాజం శాపనార్ధాలు..
  • చంద్రబాబు ప్రభుత్వం దేవాలయాలను రాజకీయ నిరుద్యోగ ఆవాస కేంద్రాలు చేయకుండా చూడాలి…
  • బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ

అమరావతి: శుక్రవారం బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది భక్తుల మనోభావం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కైకర్యాలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అపచారాలు చేయటం క్షమించరాని నేరం, దేవుడే వీళ్ళకి శిక్షలు వేయాలి. కనీసం దేవుడు అంటే ఒక భయము భక్తి లేకుండా తిరుమల స్వామివారి ప్రఖ్యాతిగాంచిన ప్రసాదం అయిన లడ్డు లో గొడ్డు మాంసం నూనె, పంది మాంసం నూనె, చేప నూనె, పత్తి గింజల నూనె, పామాయిల్, సోయాబీన్ ఆయిలు వాడి లడ్లు తయారుచేసి ప్రసాదంగా అమ్మేరు అంటే ఎంత దారుణమైన, నీచాతి నీచమైన విషయం.

స్వామివారికి ప్రతిరోజు సుమారు 18 రకాల నైవేద్యాలు కైకర్యాలలో భాగంగా సమర్పిస్తారు అటువంటి దైవాధ్యాలలో ఈ లడ్డు కూడా ఒక భాగం ఆ లడ్డుకి అన్ని స్వచ్ఛమైన పదార్థాలు వాడాలని ఆగమ శాస్త్రాల్లో ఉంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వాడాలైతే దాన్ని వాడకుండా జంతువుల కళేబరాల నూనెలను, చేప నూనెలను తదితర జిగుప్సాకరమైన ఆహార పదార్థాలతో స్వామివారికి ప్రసాదాలు చేసి నైవేద్యాలు పెట్టారంటే ఎంత మహా అపచారం చేసినట్లు జగన్ ప్రభుత్వం అని భక్తులు బ్రాహ్మణ సమాజం భావిస్తుంది.

స్వామివారి నివేదనకు ప్రతి పదార్థాన్ని ఆవు నెయ్యితో తయారుచేస్తారు అయితే ప్రతిరోజు 15 వేల కిలోల ఆవు నెయ్యి అవసరమైతే, గత ప్రభుత్వాల్లో గో సంపద ఎక్కువగా ఉన్న కర్ణాటక, తమిళనాడు తదితర ప్రభుత్వాలకు సంబంధించిన డైరీ ఫారం లో నుంచి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని తెచ్చి వినియోగిస్తుంటే ప్రభుత్వాలకు సంబంధించిన డైరీల నుంచి కమిషన్ రావని గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్లుగా పని చేసిన అన్యమతస్తులైన కరుణాకర్ రెడ్డి, వై వి సుబ్బారెడ్డి బోర్డు సభ్యులు దేవుడు మీద వ్యాపారం పేరిట కమిషన్ల కోసం కక్కుర్తి పడి ప్రభుత్వ డైరీ సంస్థలకు ఇచ్చిన కాంట్రాక్టులు రద్దుచేసి, ఒక అన్యమత ముస్లిం వ్యాపార సంస్థ అయిన “ఆల్ఫా” అనే మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా వ్యాపార సంస్థలకు కాంట్రాక్ట్ అప్పచెప్పి చివరికి ప్రజలతో పాటు భగవంతుణ్ణి కూడా మోసం చేశారని శ్రీధర్ వాపోయారు.

దేశంలో సాధారణంగా స్వచ్ఛమైన ఆవు నెయ్యి కిలో కు 400/- ల నుండి 1000/- ల వరకు ధర పలుకుతుందని, అయితే కమిషన్ల కక్కుర్తి కోసం కేవలం 350 /- రూ. ల తక్కువ ధరకు కోడ్ చేస్తే ఆ అన్యమత కాంట్రాక్టర్ గొడ్డు మాంసం, పంది మాంసం, జంతువుల కలైబారాల నుండి తీసిన నూనెలతో తయారైన నకిలీ నెయ్యి కాకుండా ఒక స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎలా ఇస్తాడు జగన్ మోహన్ రెడ్డి అని శ్రీధర్ ప్రశ్నించారు.

దేశంలో ప్రభుత్వానికి సంబంధించిన ప్రఖ్యాత డైరీ ల్యాబ్ లో నెయ్యి నాణ్యత మీద టీటీడీ వారే పరీక్షలు చేపడితే ఆ రెండు ప్రభుత్వ ల్యాబులు ఆవు నెయ్యి స్థానంలో ఏమున్నాయో టిటిడి కి ధ్రువీకరిస్తూ సర్టిఫికెట్ అందజేశారని దాన్ని చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదనకు గురై ప్రభుత్వం ఏర్పాటు వంద రోజులు ఆయిన సందర్భంగా భాదతో తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగిందని. చంద్రబాబు ఎటువంటి ఆధారాలు లేకుండా ఎప్పుడు ఆయన ప్రజా జీవితంలో విమర్శలు చేయరని, ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందిన టిటిడి తాము తయారు చేస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను ఎందుకు పరిశీలించలేకపోయింది అని అధికారులను శ్రీధర్ ప్రశ్నించారు.

ఆహార పదార్థాల నాణ్యతలను ప్రశ్నించే లాబరేటరీ టిటిడి కి లేదా అని శ్రీధర్ ప్రశ్నించారు, ఇది కాక స్వామివారి అన్న ప్రసాదాన్ని కూడా కలుషితం చేసి నాసిరకమైన భోజనాలను ప్రసాద రూపంలో పెడుతుంటే భక్తులు తినటం మానేశారని, తిరుమలలో ఉన్న ప్రైవేటు హోటల్ల వారి కమిషన్ల కోసం తన ప్రభుత్వ హయాంలో అన్నా క్యాంటీన్లతోపాటు, తిరుమలలో భక్తులు తినే ఉచిత అన్న ప్రసాదాన్ని కూడా సర్వనాశనం చేశారని, జగన్ ఎందుకింత నీకు తినే తిండి పైన కూడా కక్ష అని శ్రీధర్ ప్రశ్నించారు.జగన్మోహన్ రెడ్డి తిరుమలలో అన్యమతస్తులకు ఉద్యోగాలు ఇచ్చి, తిరుమల పవిత్రతను అపవిత్రం చేశాడనీ, కలియుగ ప్రత్యక్ష దైవానికి ఇటువంటి దుస్థితిని పట్టిస్తే దైవం చూస్తూ ఊరుకోదు.

గతంలో ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి పని చేసే సమయంలో తిరుమల వెంకటేశ్వర స్వామికి ఏడుకొండలు ఎందుకని ఒక కొండ చాలని మిగిలిన కొండలు క్రిస్టియన్ చర్చి ఆర్గనైజేషన్లకు కట్టబెట్టబోతే అప్పుడు బ్రాహ్మణ సంఘాలు, భక్త బృందాలు, ప్రతిపక్షాలు ఉద్యమం చేస్తే వెనక్కి తగ్గారని దాని పర్యవసానం అప్పటి ముఖ్యమంత్రిగా పావురాల గుట్టకు పరిమిత మయ్యడని, ఎలా గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులు, ప్రజా ప్రతినిధులు తిరుమల క్షేత్రం పట్ల తప్పులు చేస్తే వాళ్లకి తగు రీతిలో శిక్షలు విధించాడని, వీరందరికంటే జగన్మోహన్ రెడ్డి కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, బోర్డు సభ్యులు ప్రజాప్రతినిధులు అతీతులు కారని వంశపారంపర్యంగా సర్వనాశనం అవుతారని, దైవం పట్ల తాను చేసిన తప్పుడు పనులకే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చేశాడని, చివరికి వైసీపీ పార్టీ లేకుండా చేస్తాడని శ్రీధర్ బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో శాపనార్ధాలు పెట్టారు.

ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా టీటీడీ బోర్డుని రాజకీయ ఆవాస కేంద్రం చేయకుండా, శబరిమలై ట్రావెన్ కోర్ దేవసం బోర్డు లాగా దానికి న్యాయవ్యవస్థ నుండి హైకోర్టు గారి సుప్రీంకోర్టు జడ్జిలను నియమించి వారి కనుసున్నల్లో టీటీడీ వ్యవస్థ నడిచేలాగా చేస్తే భక్తులు, ప్రజలు, ఆధ్యాత్మిక సంఘాలు, బ్రాహ్మణ సంఘాలు హర్షిస్తాయని శ్రీధర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కుంభకోణంతో పాటు తిరుమలలో గత ఐదు సంవత్సరాల్లో అనేక ఆర్థిక కుంభకోణాలు జరిగాయని వాటన్నిటి పైన హైకోర్టు కానీ సుప్రీంకోర్టు గాని సిట్టింగ్ జడ్జిలతో విచారణలు చేయాలని దోషులు ఎంతటి వారైనా సరే తమకు ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిన ఐదేళ్లలో దోషులకు శిక్షలు పడేలా చేయాలని శ్రీధర్ చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దేవాలయాల్లో ట్రస్ట్ బోర్డ్ సభ్యుల పేరిట నియామకాలు ఆపేస్తే దేవాలయాల్లో రాజకీయాలు ఆగిపోతాయని, భగవంతున్ని భగవంతుడి గా చూడకుండా రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు వారి వారి రాజకీయ స్వార్థాల కోసం దేవాలయాలను వినియోగించుకోవడం సిగ్గుమాలిన చర్య అని ఇది ఈ కలియుగంలో చేస్తున్న పాప కర్మలు అని, దేవుళ్ళ పట్ల తాము చేస్తున్న పాపం పనులకు ఆ రాజకీయ నాయకులు బతికి ఉండగానే వారికి వారి కుటుంబ సభ్యులకు తగురీతిలో శిక్షలు అనుభవిస్తారని అది తెలియక ఆ మేధో రాజకీయ అధినేతలమని, ప్రభుత్వాధినేతలమని అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారని అది దేవుడు పట్ల సాధ్యం కాదని, దేవుడు విధించే శిక్షలు వంశపారంపర్యంగా అనుభవించే తీరుతారని గరుడ పురాణం తెలియజేస్తుందని, రాజకీయ పార్టీ నేతలు ప్రజాప్రతినిధులు గరుడ పురాణాన్ని కనుక వింటే అందులో ఉన్న అంశాలను అవలంబిస్తే జీవితంలో ఎప్పటికీ తప్పులే చేయరని శ్రీధర్ ఆశావాహం వ్యక్తం చేశారు.

ప్రజా ప్రతినిధులకు రాజకీయ పార్టీల అధినేతలు గరుడ పురాణం అంటే ఏమిటి, దాంట్లో ఏమి ఉందో, మనిషి జీవితం ఎలా బతకాలో తెలుసుకోవటానికి ఆధ్యాత్మిక శిక్షణలను ఇప్పించవలసిందిగా శ్రీధర్ కోరారు. దేశవ్యాప్తంగా దేవాలయాల్లో రాజకీయాలను పునరావాస కేంద్రాలు చేయకుండా ఒక చట్టం రూపకల్పన జరగాలని ఆ దిశగా ఎన్డీఏ కూటమి మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని శ్రీధర్ డిమాండ్ చేశారు. లేకపోతే విదేశీ శక్తుల ఆధ్వర్యంలో హిందూ ధర్మం, నాగరికత, సాంప్రదాయాలు మంట కలిసిపోయే ప్రమాదం ఉందని ఈ ప్రమాదానికి మనం ఎన్నుకున్న ప్రభుత్వాలే బాధ్యత భవిష్యత్తులో ఊహించాల్సి వస్తుందని శ్రీధర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎండపల్లి శబరి శర్మ, చిలుమూరు ఫణి శర్మ, వంగవీటి చైతన్య శాస్త్రి, వడ్డమాను ప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE