Suryaa.co.in

Features

అచ్చమైన సత్యాన్వేషి ..బెట్రాండ్ రస్సెల్ !!

ఆయన గురించి చెప్పడమంటే అంతులేని విజ్ఞాన సర్వస్వపు అంచుల్ని తాకుతూ లోతుల్ని కొలిచే సాహసం చేయడం! ఆయన పరిచయం అవధులు లేని అన్వేషణా తృష్ణకి మానవ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన ఉదాహరణ! ఆయనే రస్సెల్, బెట్రాండ్ రస్సెల్!

జ్ఞానం సమాజం సారమనీ, దానిని సమాజ శ్రేయస్సుకోసమే వినియోగించాలనే ప్రజాపక్ష మేధావి రస్సల్, జీవితాంతం సత్యాన్వేషి గానే బతికాడు. సత్యాన్ని అన్వేషించడం కోసమే బతికాడు!

తిరుగులేని అధ్యయనం, తిరుగుబాటు తత్వం, ఎదురులేని రచనా వ్యాసంగం, ఆకట్టుకునే వచన ప్రసంగాలు ఆయన సొంతం. నమ్మకమనే దాని నడ్డి విరిచిన ఆయన గ్రంథాలన్నీ వివేకాన్నిచ్చే వెలుగు దివిటీలే!వందలాది రచనలు చేసాడు. వ్యాసాలకైతే లెక్కేలేదు. ఆధిపత్యాన్ని, అన్యాయాన్ని అసహ్యించుకున్నాయన జీవితాంతం లౌకికవాద స్పూర్తితో శుద్ధ భౌతికవాదిగా, హేతువాదిగానే జీవించాడు!

దార్శనికుడిగా, గణిత శాస్త్రవేత్తగా, సామ్రాజ్యవాద వ్యతిరేక కార్యకర్తగా, యుద్ధోన్మాద వ్యతిరేక ఉద్యమకారుడిగా, ప్రజాపక్ష మేధావిగా, అరుదైన తాత్వికుడిగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని ప్రభావితం చేసిన వ్యక్తి రస్సెల్!

ఆసక్తి ఉన్నవాళ్ళు ఆయన కృషినీ, రచనల్ని నెట్లో చదవచ్చు కానీ ఆయన ఆచరణా స్పూర్తిని జీవితంలో నింపుకోవాలంటే మాత్రం నమ్మకాలకు, అక్రమాలకు వ్యతిరేకంగా గొంతు విప్పగలగాలి.అదే ఆయనకు నిజమైన నివాళి!

వ్యక్తిగతంగా నాకేంతో ఇష్టమైన రచయిత, తాత్వికుడు, ఆలోచనాపరుడు. మనిషి ఆనందానికి మతం అనవసరమని ఆచరణలోనే తేల్చినవాడు. అలాంటి మేధావిని తల్చుకుంటూ…సూర్యుడిలా అన్నివైపులా తన కాంతి ప్రసరించిన రస్సెల్ అస్తమించి 50 ఏళ్ళు దాటాయ్.ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా..

– గౌరవ్

LEAVE A RESPONSE