Suryaa.co.in

Political News

భేతాళ ప్రశ్నలు

1. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీని గద్దెదించాల్సిందే!
2. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చే ప్రసక్తే లేదు!
3. పార్టీలు, వ్యక్తులు లాభాపేక్షకు స్వస్తి చెప్పి, పొత్తుకు ముందుకొస్తే స్నేహ హస్తాన్ని అందిస్తాం!
4. నేడు మిత్ర పక్షంగా ఉన్న పార్టీ “రోడ్ మ్యాప్” ఇస్తామన్నది. దాని కోసం ఎదురు చూస్తున్నాం!
5. నేటి మిత్ర పక్షం ఇచ్చే “రోడ్ మ్యాప్” ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చేదిగా ఉంటే అప్పుడేం చేస్తారు! సొంత “రోడ్ మ్యాప్”ను రూపొందించుకొంటారా!
6. భిన్న భావజాలాలు, రాజకీయ దృక్పథాలున్న పార్టీలు రాష్ట్రంలో ఉన్నాయి కదా! ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఎలా నివారిస్తారు!
7. ప్రస్తుతం రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా “ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి” కోసం ప్రత్యామ్నాయ విధానాలతో రాజకీయ ప్రత్యామ్నయం కాకుండా కేవలం ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీని గద్దె దించడం ఒక్కటే ఎన్నికల అజెండా అయితే ప్రజలు ఆదరిస్తారా?

– టి.లక్ష్మీనారాయణ
సామాజిక ఉద్యమకారుడు

LEAVE A RESPONSE