-మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ
-దిశ’ యాప్ బ్యాడ్జీ లోగో టీ షర్టును ధరించిన ప్రముఖ పర్వతారోహకురాలు ఆశా మాలవ్య
-ఆశా మాలవ్య లక్ష్యం నెరవేరాలని అభినందనలు తెలిపిన మహిళా కమిషన్
అమరావతి, ఫిబ్రవరి 9. మహిళలకు ఇస్తున్న ప్రాముఖ్యత, మహిళలకు కల్పిస్తున్న రక్షణ, తదితర అంశాలను విస్తృతంగా సమాజంలోకి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో సైకిల్ పై దేశయాత్ర నిర్వహిస్తున్న ప్రముఖ పర్వతారోహకురాలు ఆశామాలవ్యను మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అభినందించారు, ఆమె లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షించారు. మంగళగిరిలోని మహిళా కమిషన్ చాంబర్ నందు వాసిరెడ్డి పద్మ ప్రముఖ పర్వతారోహకురాలు ఆశామాలవ్య గురువారం మర్యాదపూర్వకంగా కలిసారు.
దేశవ్యాప్తంగా సైకిల్ పై తాను చేస్తున్న సైకిల్ యాత్ర లక్ష్యాన్ని చైర్ పర్సన్ కు ఆమె విరించారు. ఆశా మాలవ్య ను చైర్ పర్సన్ వాసిరెడ్డిమంత్రి దుశ్శాలువాతో సత్కరిస్తూ ఎటు వంటి అవసరం ఉన్నా సరే అన్ని విదాలుగా సహకరించేందుకు తాను సిద్దంగా ఉన్నాని ఆమెకు భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ వారి యాత్ర మహిళలకు ఎంతో స్ఫూర్తిదాయకం, పాఠశాలలకు సంబంధించిన బాలికలు కూడా కొత్త విషయాలు నేర్చుకోవడంలో మాలవ్యని స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు మహిళలకు ఇస్తున్న ప్రాముఖ్యత, మహిళలకు కల్పిస్తున్న రక్షణ, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ‘దిశ’ యాప్ పట్ల ‘మాలవ్య’ చాలా సంతోషం వ్యక్తం చేశారు.
‘దిశ’ యాప్ బ్యాడ్జీ లోగో తో కూడిన టీ షర్ట్ ను మాలవ్య ధరించడం చాల స్ఫూర్తిదాయకం. మహిళల రక్షణ కొరకు మహిళలకు 50% రిజర్వేషన్ రిజర్వేషన్, మహిళలకు సంబంధించిన స్కీములు ఇంకా అనేక విషయాలను మాలవ్య దేశం ప్రధానమంత్రికి వివరిస్తాను అన్న మాట చాలా సంతోషకదాయకమైన విషయం.
ఒక స్ఫూర్తిదాయకమైన యాత్ర చేస్తున్న మాలవ్య కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారు, ప్రభుత్వం తరఫున ఉన్న అన్ని శాఖలు కూడా సంపూర్ణ మద్దతు తెలిపారు. అంటే మహిళల పట్ల మేము ఉన్నాము అనటానికి ప్రభుత్వ నిబద్ధతకు ఇదే నిదర్శనం. మహిళలకు అవగాహన కల్పించే ఎటువంటి ఏ సాహస యాత్ర చేసినా, ఎటువంటి ప్రశంసా కార్యక్రమాలు చేసినా దాని వెనుక మీము వుంటాము అని ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో చెప్పటం ఇక్కడ గుర్తించాల్సిన విషయం. మహిళా కమిషన్ సభ్యురాలు .రోఖయా బేగం, కార్యాలయం సిబ్బంది మాలవ్యను అభినందించిన వారిలో ఉన్నారు…