వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్ కోతలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసన

-రైతులు పడుతున్న ఇబ్బందులపై అడ్జెట్మెంట్ మోషన్ కింద అసెంబ్లీలో చర్చించాలని కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
-రైతుల ఇబ్బందులపై చర్చకు అవకాశం ఇవ్వకుండ పట్టించుకోని స్పీకర్ వైఖరిని నిరసిస్తూ అసెంబ్లీ -మీడియా పాయింట్ వద్ద ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేసిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, సీతక్క

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఏమన్నారంటే..
రాష్ర్టంలో విద్యుత్ కోతలతో రైతులు తీవ్రంగా నష్టాలు, ఇబ్బందులు పడుతున్నారు.రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని ప్రభుత్వం ఢంభికాలు చెబుతున్న కనీసం నాలుగైదు గంటలు కూడ కరెంట్ ఇవ్వడం లేదు.ఇచ్చేటువంటి నాలుగైదు గంటల కరెంట్ కూడ ఎప్పుడు ఇస్తున్నారో.. ఏసమయానికి ఇస్తున్నారో చెప్పలేని పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది.

విద్యుత్ కోతలతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయరంగాన్ని కాపాడాలని సీఎల్పీ పక్షాణా ప్రభుత్వానికి కరెంట్ కోతలు, రైతుల ఇబ్బందులపై సభలో చర్చించడానికి అవకాశం ఇవ్వాలని అడ్జెట్మెంట్ మోషన్ ఇవ్వడం జరిగింది.

రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లడాటానికి సమయం ఇవ్వాలని సభలో సభాపతి గారికి వినపడేలా పదే పదే గొంతుపోయేట్టుగా అరిచి, గీ పెట్టుకొని ఈ అంశం మీద మాట్లాడాలి. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ సోదరులు ఇబ్బందులు పడుతున్నారని ఎంత పెద్ద ఎత్తున గొంతు పోయేటట్టుగా అరిచిన కానీ, వైఖరిని కానీ, మా కెళ్లి చూడటం గానీ చేయకుండ అడ్జెట్మెంట్ మోషన్ ను తిరస్కరించినందుకు చాలా బాధాతో.. ఆవేధనతో సభలో నిరసన వ్యక్తం చేసి బయటకు వచ్చాము.సభలో ప్రజా సమస్యలు, రైతులు పడుతున్న ఇబ్బందులు చర్చించడానికి ముందుకు రాని ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాను.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అంతరాయం లేకుండా 24గంటల పాటు నిరవధికంగా ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ విద్యుత్ కోతలపై సభలో చర్చ జరగాలని డిమాండ్ చేస్తున్నాను.

Leave a Reply