Suryaa.co.in

Editorial

భలే రాజకీయం బాసూ..

– టీడీపీ నేత వంగవీటి రాధాతో వైసీపీ ఎమ్మెల్యేలు వంశీ- కొడాలి నాని దోస్తీ
– బీజేపీ నేత సుజనా చౌదరికి టీడీపీ నేత రాజేంద్రప్రసాద్‌ సన్మానం
– చంద్రబాబును అభినందించిన వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి
– గుంటూరు-నెల్లూరు జిల్లాలో వైసీపీ-టీడీపీ నేతల అలయ్‌బలయ్‌
– తెరచాటు రాజకీయాలతో తెల్లబోతున్న శ్రేణులు
-( మార్తి సుబ్రహ్మణ్యం)

వారంతా ప్రత్యర్థి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు, ఒకదానిపై మరొకరు మాటల యుద్ధం చేసుకుంటారు. కత్తులు దూసుకుంటారు. ట్విట్టర్ల యుద్ధం చేసుకుంటారు. ఒకరిపై మరొకరు భౌతిక దాడులకు దిగుతుంటారు. రక్తం కళ్లచూస్తుంటారు. కేసులు పెట్టుకుంటారు. కానీ.. ఆయా పార్టీలకు చెందిన కొందరు నాయకులు మాత్రం, అవేమీ పట్టించుకోరు. ప్రత్యర్ధి పార్టీ నేతలను కౌగిలించుకుంటారు. విందు రాజకీయాలు చేస్తారు. పాత దోస్తానా కొనసాగిస్తారు. కులాల ముసుగులో కొత్త బంధాలు కలిపేసుకుంటారు. శాలువాలు కప్పి పాత బంధాలను కొత్తగా కలిపేసుకునే ప్రయత్నం చేస్తారు. పార్టీలేవయినా హబ్‌సబ్ ఏక్‌హై అని నినదిస్తుంటారు. ఇదీ ఏపీలో అధికార-విపక్ష పార్టీల మధ్య కొనసాగుతున్న విచిత్ర రాజకీయం.

ఏపీ రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార వైసీపీ-ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నాయకత్వాలు, ఓ వైపు తీవ్రస్థాయిలో యుద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో.. ఇరు పార్టీలకి చెందిన కొందరు నేతలు మాత్రం వాటితో సంబంధం లేకుండా చెట్టపట్టాలేసుకుని తిరుగుతుండటం, బహిరంగంగానే ప్రత్యర్ధి పార్టీలను ప్రశంసించడం నాయకత్వాలకు తలనొప్పిగా పరిణమిస్తున్నాయి. ఈ పరిణామాలు అటు క్షేత్రస్థాయిలో యుద్ధం చేస్తున్న ఇరు పార్టీల క్యాడర్‌ను విస్మయానికి గురిస్తోంది. ‘మేం ఇక్కడ ప్రాణాలు పణంగా పెట్టి మా రాజకీయ శత్రువులతో యుద్ధం చేస్తుంటే, వాళ్లు మాత్రం చెట్టపట్టాలేసుకుని తిరగడం, నాయకత్వాలు కూడా పట్టించుకోకపోవడం ఎలాంటి సంకేతాలు వెళుతున్నాయ’ని క్యాడర్‌ ప్రశ్నిస్తోంది.

కొంతకాలం క్రితం టీడీపీ నుంచి వైసీపీలోకి జంపయిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. టీడీపీకి చెందిన వంగవీటి రాధాతో స్నేహబంధం కొనసాగించడం ఇరు పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. గన్నవరం ఎమ్మెల్యే వంశీతోపాటు, మాజీ మంత్రి గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానితో, విజయవాడకుradha-kodali-vamsi చెందిన టీడీపీ యువనేత వంగవీటి రాధాకు బలమైన స్నేహం ఉందన్నది బహిరంగమే. వైసీపీ ఎమ్మెల్యేలయిన కొడాలి నాని, వంశీ నిరంతరం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్‌పై విమర్శల వర్షం కురిస్తున్నారు. వారిద్దరూ ఒక్కోసారి బాబు-లోకేష్‌పై దారుణమైన వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తున్నారు. గతకొంతకాలం క్రితం బాబు సతీమణి భువనేశ్వరిపై వంశీ చేసిన వ్యాఖ్య పెనుదుమారం రేపింది. ఆ వ్యవహారంలో టీడీపీ నేతలంతా వంశీపై ఎదురుదాడి చేసినా, వంశీ మిత్రుడయిన టీడీపీ నేత వంగవీటి రాధా మాత్రం స్పందించకపోవడం విమర్శలకు దారితీసింది. చివరకు ఆ అంశంలో భువనేశ్వరికి వంశీ క్షమాపణ కూడా చెప్పారు.

తాజాగా ఓ కార్యక్రమానికి హాజరయిన వంశీ-రాధాలు ముచ్చటించుకున్న దృశ్యాలు మీడియాకు చిక్కడం చర్చనీయాంశమయింది. రాధాను వంశీ దగ్గరుండి మరీ కారెక్కించడం, ఇద్దరూ కులాసాగా

మాట్లాడుకోవడం వంటి దృశ్యాలు ఇరు పార్టీ శ్రేణులను విస్మయపరిచాయి. నిజానికి కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడ, వంశీ ఎమ్మెల్యేగా ఉన్న గన్నవరం నియోజకవర్గాల్లో కాపుల సంఖ్య గణనీయంగానే ఉంది. ప్రధానంగా గుడివాడలో దాదాపు 40 వేల ఓట్లున్న కాపులు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. గన్నవరంలో కూడా కాపుల ఓట్లు 25 వేలకు పైనే ఉన్నాయి. నాని-వంశీలు వంగవీటి రాధాతోVangaveeti-Radha స్నేహం చేయడానికి ఇది కూడా ఒక ప్రధాన రాజకీయ కారణమన్నది ఒక విశ్లేషణ. అందుకే వంగవీటి రంగా జయంతి-వర్థంతి కార్యక్రమాలకు వంశీ-నాని తప్పనిసరిగా హాజరయి, రంగా విగ్రహాలకు పూలమాల వేస్తుంటారు.

అయితే ఓవైపు తన పార్టీ అధినేత చంద్రబాబును పరుషపదజాలంతో విమర్శించే వంశీ-నానితో, వంగవీటి రాధా ఎలా స్నేహం కొనసాగిస్తారన్నది ఇప్పుడు టీడీపీ శ్రేణుల నుంచి వినిపించే ప్రశ్న. బాబు-లోకేష్‌పై వారిద్దరూ విమర్శించిన ఏ సందర్భంలో కూడా, రాధా స్పందించని విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

‘రాజకీయాలు-స్నేహాలు వేరయినప్పటికీ, రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయ వాతావరణం అలా లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ.. తన ప్రత్యర్ధులను రాజకీయ ప్రత్యర్ధుల్లా కాకుండా, వ్యక్తిగత శత్రవుల్లా చూస్తోంది కాబట్టి, మేమూ అదే కోణంలో చూడక తప్పదు. అసలు బాబు కుటుంబాన్ని తూలనాడే వంశీ-నానితో టీడీపీలో ఉంటూ రాధా ఎలా స్నేహం చేస్తున్నారో మాకూ అర్ధం కావడం లేదు. మా నాయకత్వం కూడా ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉందో ఇంకో ఆశ్చర్యమ’ని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడొకరు వ్యాఖ్యానించారు.

‘ఇదే పని మరో కులం వారు చేస్తే నాయకత్వం ఇంత నింపాదిగా, ఇంత విశాలహృదయంతో ఉంటుందా? వెంటనే సస్పెండ్‌ చేసేదే కదా? మరి రాధా విషయంలో అంత సహనం, మినహాయింపు ఎందుకు ఇస్తుందో మాకూ అర్ధం కావడం లేద’ని మాజీ మంత్రి ఒకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన దేవినేని అవినాష్‌.. టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయిన దేవినేని ఉమాపై, ఇప్పటివరకూ ఎలాంటి విమర్శలు చేయని విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

ఇక మచిలీపట్నం టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణతో.. వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని తెరచాటు స్నేహం చేస్తున్నారంటూ.. మచిలీపట్నం వైసీపీ ఎంపీ బాలశౌరి తాజాగా చేసిన ఆరోపణ, రెండుperni-bala-konakalla పార్టీల్లోనూ చర్చనీయాంశంగా మారింది. అయితే తనకూ-పేర్ని నానికి ఎలాంటి సంబంధాలు లేవని కొనకళ్ల ఖండించినప్పటికీ, అధికారపార్టీ ఎంపీ అయిన బాలశౌరి ఎలాంటి సమాచారం లేకుండా, సొంత పార్టీ ఎమ్మెల్యేపై విమర్శించరని వైసీపీ నేతలు విశ్లేషిస్తున్నారు.

‘మా పార్టీ ఎమ్మెల్యే పేర్ని నానికి టీడీపీ మాజీ ఎంపీ నారాయణతో మాట్లాడకపోతే నిద్రపట్టదు. సుజనా చౌదరి మా ప్రభుత్వాన్ని, వైసీపీని, ముఖ్యమంత్రిని విమర్శించినా పేర్ని నాని స్పందించడు’ అని వైసీపీ ఎంపీ బాలశౌరి చేసిన ఆరోపణలు వైసీపీ శిబిరంలో కలకలం సృష్టించాయి.

తాజాగా బీజేపీ నేత, కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరిని ఆత్మీయ కలయికలో భాగంగా, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్‌తో భేటీ కావడం మరో ఆశ్చర్యం. టీడీపీ నుంచి బీజేపీలోsujana-babu చేరిన సుజనా చౌదరి, తర్వాత టీడీపీపై విమర్శించకపోయినా, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం, టీడీపీని ఇంకా విమర్శిస్తూనే ఉన్నారు. టీడీపీ కుటుంబపార్టీ అని, టీడీపీ ప్రభుత్వం కూడా రాష్ర్టాన్ని నాశనం చేసిందంటూ బీజేపీ నాయకత్వం విమర్శలు కురిపిస్తోంది. ఈ క్రమంలో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌.. బీజేపీ నేత సుజనా చౌదరిని సన్మానించి, ఆయనతో భేటీ కావడంపై టీడీపీ-బీజేపీ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఎన్నిక ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబును పొగడటం ఆసక్తికరంగా మారింది. ‘‘సిట్టింగ్‌ ఎమ్మెల్యే చనిపోయినప్పుడు అక్కడ జరిగే ఉప ఎన్నికలో పోటీ చేసే మృతిచెందిన వారి కుటుంబంపై పోటీ పెట్టకూడదన్న మంచిnallapareddy-cbn సంప్రదాయం ప్రవేశపెట్టిన చంద్రబాబును అభినందించాలి. ఆ జ్ఞానం బీజేపీకి లేకుండా పోయింద’ని నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. రోజూ చంద్రబాబును తిట్టిపోస్తున్న వైసీపీ నాయకులు, ఈ పరిణామం చూసి నోరెళ్లబెడుతున్నారు. ఓవైపు ‘టీడీపీకి దమ్ముంటే ఆత్మకూరులో పోటీ చేయాల’ని విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీకి సవాళ్లు విసుకురుతుంటే, మరోవైపు ఎన్నికలో టీడీపీ పోటీచేయనందుకు సొంత పార్టీ ఎమ్మెల్యే, చంద్రబాబును అభినందించడమే వారి విస్మయానికి అసలు కారణం.

ఇక గుంటూరు నగరంలో వైసీపీ-టీడీపీ అగ్రనేతల మధ్య, చాలాకాలం నుంచి మ్యాచ్‌ఫిక్సింగ్‌ జరుగుతోందన్న చర్చ నడుస్తోంది. టీడీపీ నగర నాయకుడయిన ఓ వ్యాపారి, వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి సహా వైసీపీ నేతలతో వ్యాపార బంధం కొనసాగిస్తున్నారన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. టీడీపీకి చెందిన సదరు నగర స్థాయి నేతను, సొంత పార్టీ నేతలు ‘ఆల్‌ పార్టీ లీడర్‌’గా ఆటపట్టిస్తున్నారు. ఈ నేతకు టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో పనిచేసే కీలకనేతల ఆశీస్సులు ఉండటం వల్లే, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ నేతలే అసలు గుట్టు విప్పుతున్నారు.

అటు నెల్లూరు జిల్లాలో కూడా కొంతమంది వైసీపీ-టీడీపీ నేతల మధ్య, రహస్యప్రేమ కొనసాగుతోందన్న చర్చ జరుగుతోంది. కులం కోణంలో ఇరు పార్టీలకు చెందిన కొందరు అగ్రనేతలు.. రాజకీయ శత్రుత్వాలు పక్కకుపెట్టి, ఒకరి అవసరాలు మరొకరు తీర్చుకుంటున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

LEAVE A RESPONSE