మహమ్మద్ ప్రవక్త బతికి ఉంటే ముస్లింల మతోన్మాదాన్ని చూసి బాధపడే వారు..

-తోటివారితో ఎలా కలిసి జీవించాలో ముస్లింలు నేర్చుకోవాలి
-ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్

న్యూఢిల్లీ: మహమ్మద్ ప్రవక్త ఈరోజు బతికి ఉంటే ముస్లిం మతోన్మాదుల పిచ్చితనం చూసి ఆశ్చర్యపోయేవారని ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీ వ్యాఖ్యానించారు.”మహమ్మద్ ప్రవక్త బతికుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం ఉన్మాదుల పిచ్చితనం చూసి దిగ్భ్రాంతికి గురయ్యేవాడు” అని ఆ ట్వీట్‌లో తస్లీమా అన్నారు.

మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నుపర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. కాగా, కొద్ది రోజుల క్రితమే పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న అసహనంపై తస్లీమా మాట్లాడారు. భారతీయ దేవుళ్ళ‌ విగ్రహాలపై జరుగుతున్న దాడులను ప్రస్తావించారు. కరాచీలోని కోరంగి ప్రాంతంలో ఉన్న శఅరీ మరి మాతా మందిర్‌లోని విగ్రహాలపై దాడి జరిగిన విషయాన్ని గుర్తుచేశారు. పాకిస్తాన్‌లోనే కాకుండా, బంగ్లాదేశ్‌లోనూ అసహనం పెరుగుతోందన్నారు.

ముస్లింలు ముస్లిమేతరులతో జీవించడం నేర్చుకోవాలని, మనుషులుగా గుర్తించాలని హితవు అన్నారు. భారతదేశ ఉత్పత్తులను దేశం వెలుపల ముస్లింలు బాయ్‌కాట్ చేయడం అనేది పెద్ద లెక్కల్లోకి ఏమీ రాదని అన్నారు. మనిషి, సాధువు, భగవంతుడు, జీసస్, ప్రవక్త ఎవరూ విమర్శలకు అతీతులు కాదనీ, ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి విమర్శనాత్మక పరిశీలన అవసరమని తస్లీమా ట్వీట్ చేశారు.

Leave a Reply