-BJYM రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ శాఖ హాస్టళ్లలో సమస్యలను పరిష్కరించాలని, భోజన వ్యవస్థలోని లోపాల వల్ల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ BJYM రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ ఆధ్వర్యంలో గురుకులాల కార్యాలయాల ముట్టడి నిర్వహించారు.
ఈ సందర్భంగా BJYM అధ్యక్షుడు మాట్లాడుతూ..
TRS ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో రేపిస్టులకు, నిందితులకు జైల్లో బిర్యానిలు.. హాస్టల్లో విద్యార్థులకు బల్లులు, పురుగులు పడ్డ ఆహారం పెడుతున్నారని.. రాష్ట్రంలోని ప్రభుత్వ హస్టల్ విద్యార్దులకు ప్రగతిభవన్ పెంపుడు కుక్కలు కూడా ముట్టని ఆహారం పెట్టడం అనేది పేద విద్యార్థుల పట్ల TRS ప్రభుత్వ తీరుకు నిదర్శనం అన్నారు.
హాస్టల్లో విద్యార్థుల మరణాలకు, మౌలిక సదుపాయాల వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని లేని పక్షంలో అసెంబ్లీని, ప్రగతి భవన్ ని త్వరలో ముట్టడిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో BJYM రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.