పివికి భారతరత్న ప్రకటించాలి

– మంత్రి తలసాని డిమాండ్

ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలలోనే మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పివి నరసింహారావు కు భారతరత్న ప్రకటించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. పివి నర్సింహా రావు 18 వ వర్ధంతి సందర్భంగా పివి మార్గ్ లోని పివి జ్ఞాన భూమిలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పివి కుమార్తె, MLC సురభి వాణిదేవి రచించిన నిజాం రాష్ట్రంలో మహాత్ముని పర్యటనలు, హైదరాబాద్ నగరంలో రాజకీయ సభలు, భాగ్య నగర్ రేడియో అనే పుస్తకాలను మంత్రి ఆవిష్కరించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ పివి నరసింహారావు 17 భాషలు అనర్గళంగా మాట్లాడ గలిగిన బహు భాషా కోవిదుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు అని పేర్కొన్నారు. ప్రధాని గా ఆయన సంస్ఖరనలను తీసుకొచ్చి దేశాన్నిimage-1 అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చారని చెప్పారు. MLA గా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా అంచెలంచెలుగా దేశానికి ఎదుగుతూ ప్రధాన మంత్రి గా పనిచేసి సమర్ధవంతమైన పాలనను అందించారని గుర్తుచేసుకున్నారు.

దేశానికి, రాష్ట్రానికి అందించిన సేవలకు గుర్తింపుగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఏడాది పాటు పివి శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాకుండా కాకుండా 26 అడుగుల కాంస్య విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ తీరాన ఏర్పాటు చేయడంతో పాటు నెక్లెస్ రోడ్డు కు పివి మార్గ్ గా నామకరణం చేసినట్లు చెప్పారు.

దేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహనీయుడు PV నరసింహా రావుకు భారతరత్న ప్రకటించడం ద్వారా ఆయన గౌరవాన్ని మరింత ఇనుమడింప చేయాలని కోరారు. నివాళులు అర్పించిన వారిలో MLC సురభి వాణిదేవి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, మాజీ MLC శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ లు అత్తిలి అరుణ గౌడ్, నామన శేషుకుమారి తదితరులు ఉన్నారు.