Suryaa.co.in

Telangana

మిర్చి రైతుల గోడు ఆలకించిన భట్టి

ముదిగొండ మండలం పండ్రేగిపల్లి పాదయాత్ర లో మిర్చి కల్లాన్నీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పరిశీలించారు. “10 ఎకరాల మిర్చి పంట సాగు చేయడానికి 15 లక్షలు పెట్టుబడి పెట్టాను. పంటకు చీడ తగిలీ కేవలం 3 లక్షల పంట మాత్రమే చేతికి వచ్చింది. 12 లక్షలు అప్పు మిగిలింది. బ్యాంకు లోన్ ఇవ్వలేదు. 3 రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి సాగు చేస్తే మళ్లీ అప్పుడే మిగిలిందని”” మహిళా కౌలు రైతు మీరాభీ సీఎల్పీ నేత కు మిర్చిని చూయిస్తూ కన్నీటి పర్యంతం అయ్యింది.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లు తప్ప నాకు ఏమీ ఆదెరువు లేదని బోరున విలపించింది. పంట దిగుబడి రాకున్న కౌలు కట్టమని అడుగుతున్నారు. 12 లక్షల అప్పు ఎట్లా తీర్చాలో తెలియక చావే చిరంజీవి అనిపిస్తుందని మహిళా రైతు విలపించడంతో పాదయాత్రలో ఉన్న వారందరూ భావోద్వేగానికి లోనయ్యారు.

“అమ్మ ధైర్యంగా ఉండు” : భట్టి
అమ్మ ధైర్యంగా ఉండు ఏడవకు. ఏడిస్తే సమస్య పరిష్కారం కాదు. తామర చీడ నీ మిర్చి పంట ను నాశనం చేసినట్టే…. కేంద్రంలో ఉన్న తామేర పువ్వు పార్టీ దేశ సంపదను లూటీ చేసి దేశాభివృద్ధిని నాశనం చేస్తుంది. మన బతుకులు మారడానికే ఈ పాదయాత్ర చేస్తున్న. సర్కారు మెడలు వంచుతా.. మీ పరిహారం కోసం అసెంబ్లీలో సర్కార్ ను నిలదీస్తా అని”” మిర్చి కౌలు రైతులకు భట్టి భరోసా ఇచ్చారు.

LEAVE A RESPONSE