-ప్రజాస్వామ్యం, ప్రతిపక్షాలు లేకుండా చేయాలని మోడీ కుట్ర
-ప్రజల కోసం పోరాడే సోనియా రాహుల్ పై అక్రమ కేసులు పెట్టిన మోడీ
-బహుళజాతి కంపెనీలకు దేశ పౌరులను బానిసలుగా మార్చుతున్న మోడీ
-మోడీ పెంచుతున్న ధరలు, వేస్తున్న పన్నులతో దుఃఖ సాగరంలో దేశ ప్రజలు
-రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా.. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేస్తూ, ఉపాధిని దెబ్బతీస్తున్న మోడీ సర్కార్
-సోనియా, రాహుల్ ఈ.డి విచారణ అప్రజాస్వామికం
-గాంధీభవన్ సత్యాగ్రహ దీక్షలో మోడీ సర్కార్ పై నిప్పులు చేరిగిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
“దేశంలో ప్రతిపక్షాలు, ప్రశ్నించే గొంతులు, ప్రజాస్వామ్యం, ప్రజల పక్షాన పోరాటాలు చేసే వారు లేకుండా చేయాలని దుర్మార్గమైన ఆలోచనతో సోనియా, రాహుల్ గాంధీ లపై అక్రమ కేసులు పెట్టి ఈ.డి విచారణ పేరిట వేధింపులకు పాల్పడాలని బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పికొడతాం. బ్రిటిష్ పాలకులను ఈ దేశం నుండి ఏవిధంగా పారద్రోలమో, అలాగే బీజేపీని తరిమికొడతాం. బహుళ జాతి కంపెనీల పార్టీగా మారిన బిజెపిని ఈ దేశం నుంచి పారద్రోలే వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదని” సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గారు ఈ.డి ఆఫీసుకు విచారణకు వెళ్తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వ కుట్రలను నిరసిస్తూ, బీజేపీ ధమన నీతికి వ్యతిరేకంగా గాంధీ భవన్ లో నిర్వహించిన సత్యాగ్రహ దీక్షకు ముఖ్యఅతిథిగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, అవినీతి పాలన, రూ. 80 లక్షల కోట్లు అప్పులు చేసి దేశాన్ని తాకట్టు పెట్టిన విధానం, దేశ సంపదను, వనరులను నచ్చిన వారికి ధారాదత్తం చేయడంతో పాటు బహుళ జాతి కంపెనీ పార్టీగా మారిన బిజెపి దేశ పౌరులను మల్టీ నేషనల్ కంపెనీలకు బానిసలుగా మార్చుతున్న వైనంపై ప్రజా క్షేత్రంలో మోడీ సర్కారును నిలదీస్తున్న ఏఐసిసి అధినేత సోనియా, రాహుల్ గాంధీలపై కక్షపూరితంగా అక్రమ కేసులు పెట్టి ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నదని మండిపడ్డారు.
“మేమిద్దరం. మాకిద్దరు అన్నట్లుగా, మోదీ- అమిత్ షా కి, అదానీ, అంబానీలు వ్యవహరిస్తున్నాని, ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ వారికి అమ్మివేస్తున్నారని దుయ్యబట్టారు. మోడీ పాలనలో ఆకాశాన్నంటిన నిత్యవసర వస్తువుల ధరలు, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, చివరకు పసి పిల్లలు తాగే పాలపైన కూడా జిఎస్టి పన్ను విధించడంతో ప్రజలు తీవ్రమైన దుఃఖంలో ఉన్నారని వివరించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని అధికారంలోకి వచ్చిన మోడీ గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థలను, దేశ సంపదను అమ్మివేస్తూ ఉద్యోగ అవకాశాలు లేకుండా చేయడంతో నిరాశతో యువత ఆత్మహత్య చేసుకొనే పరిస్థితుల్లో ఉందన్నారు.
రూ. 80 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రధాని మోడీ దేశ ప్రజలను తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి చేసిన ఈ అవకతవకలు బయట పడకుండా ప్రజల దృష్టిని మళ్ళించడం కోసం నేషనల్ హెరాల్డ్ కేసులో ఏమీ లేదని మూసేసిన కేసును బిజెపి ప్రభుత్వం కుట్రపూరితంగా ఆర్ఎస్ఎస్ బావాజాలం కలిగిన అధికారిని ఈ.డీ కి డైరెక్టర్ గా నియమించి మళ్ళీ రీఓపెన్ చేశారని విమర్శించారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక కాంగ్రెస్ పార్టీదని, కాంగ్రెస్ పత్రికకి కాంగ్రెస్ పార్టీ డబ్బులను అప్పుగా ఇచ్చి నష్టాల్లో ఉన్న సంస్థను కాపాడుకుంటే మనీ లాండరింగ్ జరిగిందని బిజెపి ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టిందన్నారు.
కక్షపూరితంగా ఈ.డి విచారణ పేరిట సోనియా రాహుల్ గాంధీ లను ఇబ్బంది పెడితే దేశ ప్రజలు చూస్తూ ఊరుకోరని బిజెపి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బిజెపి దమన నీతికి చేపట్టిన ఈ నిరసన దీక్ష కేవలం సోనియా, రాహుల్ కోసమే కాదని, కోట్లాది ప్రజల కోసమని, ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమని తెలిపారు. సోనియా గాంధీ ధిరోదాత్తురాలని కొనియాడారు. ప్రధాని పదవిని త్యాగం చేసిన సోనియా దేశ అభ్యున్నతి కోసం యూపీఏ ప్రభుత్వంలో పనిచేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పని చేసేది అధికారం కోసమే కాదని, సామాజిక మార్పు కోసమన్నారు.
రాహుల్, సోనియాకి మద్దతుగా నిలిచి దేశాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దేశానికి స్వాతంత్రం తెచ్చి నవభారత నిర్మాణం చేసిన కాంగ్రెస్ పార్టీగా దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. “కాంగ్రెస్ నాయకులం, కార్యకర్తలం హైదరాబాద్ వదిలి గ్రామాలకు వెళ్దాం. ఇంటిటికి వెళ్లి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, వారి అవినీతి పాలన గురించి ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రచారం చేయాలని” పిలుపునిచ్చారు. కాంగ్రెస్ జెండాని ప్రతి ఇంటిపై ఎగరేయడానికి కదం తొక్కాలన్నారు.