హోంమంత్రి ఇలాకాలో వైసీపీ ఘోర పరాభవం

135

– అర్బన్‌బ్యాంక్ ఎన్నికల్లో మొత్తం స్థానాలు గెలిచిన టీడీపీ
– వైసీపీ అభ్యర్ధులను గెలిపించలేని మంత్రి వనిత

ఏపీలో అధికార వైసీపీకి తొలిసారి ఘోర పరాజయం. మున్సిపల్, జడ్పీ.. అసెంబ్లీ.. ఎన్నికలేవైనా వరస విజయాలతో నిన్నటి వరకూ పరుగులు తీసిన అధికార వైసీపీకి, సాక్షాత్తూ హోంమంత్రి వనిత నియోజకవర్గంలో దారుణమైన పరాభవం ఎదురయింది. ఆమె సొంత కొవ్వూరు నియోజకవర్గంలో జరిగిన అర్బన్‌బ్యాంక్ ఎన్నికల్లో ఆమె వైసీపీ అభ్యర్ధులను గెలిపించుకోలేక చేతులెత్తేశారు. ఫలితంగా మొత్తం 11 డైరక్టర్ల స్థానాలూ ఏకగ్రీవమయి, తెలుగుదేశం పార్టీ ఖాతాలో కలిసింది. మూడేళ్లలో వైసీపీకి తగిలిన భారీhome దెబ్బ ఇది. చైర్మన్‌గా టీడీపీకి చెందిన మద్దిపట్ల శివరామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికవడం, హోంమంత్రి వనితకు షాక్ కలిగించింది. తాజా ఎన్నికల ఫలితాలు కొవ్వూరు నియోజకవర్గంలో వైసీపీ బలహీనత, టీడీపీ బలాన్ని చాటిచెప్పాయి.