– సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
తెలంగాణ కోసం పోరాటం చేసిన రాష్ట్రం కోరుకున్న ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. సంపూర్ణ మెజారిటీ లేకుండా తెలంగాణ రాష్ట్రం కాంగ్రేస్ పార్టీ ఇచ్చింది. అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతో రాజ్యాంగ బద్దంగా తెలంగాణ ఏర్పాటు జరిగింది.
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట కోసం సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. మోడీకి తెలంగాణ పై ఉన్న అక్కసు మరోసారి బయటపడింది. సహజంగా చట్టసభల్లో బిల్లులు పెట్టినప్పుడు తలుపులు బంద్ చేసి చేయడం ప్రాసెస్.
మోడీ మాటల పై ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్నటి నుంచి ఎందుకు స్పందించడం లేదు? కాంగ్రెస్ కాకుండా బీజేపీ అయితే తెలంగాణ ఇచ్చేది కాదు. ఆనాడు బిల్లు పాస్ కాకుండా వీగిపోతే తెలంగాణ వచ్చేదా? కేసీఆర్ చెప్పాలి. సరైన మెజారిటీ లేనందునే అందరిని ఒప్పించడానికి ఆనాడు కొంత ఆలస్యం అయింది.
టీఆర్ఎస్- బీజేపీ నేతలకు తాయకాయలు ఉన్నాయా? నోర్లా మొర్లా? తెలంగాణ పై ప్రేమ అభిమానం ఉంటే కేసీఆర్ మోడీ మాటలను ఖండించాలి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను ఒక్క మాట అన్నా టీఆరెస్ తెలంగాణ జాతికి క్షమాపణ చెప్పాల్సి వస్తుంది.
అందరూ సమానమే అన్న రామానుజాచార్యులు ఎక్కడ- ఒకే మతాన్ని వెనకేసుకున్న బీజేపీ ఎక్కడ? బడ్జెట్ లో ఉత్తరాది రాష్ట్రాలకు ఒక రకంగా- దక్షిణాది రాష్ట్రాలకు ఒకలా కేటాయింపులు ఉన్నాయి. కేంద్రానికి పన్నులు కట్టే రాష్ట్రాలు దక్షిణాదివి- బడ్జెట్ కేటాయింపులు మాత్రం ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్తున్నాయి.రామానుజాచార్యుల వద్ద బీజేపీ నేతల మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది.