Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైసీపీ నేతలు

– కండువా కప్పి ఆహ్వానించిన చంద్రబాబు నాయుడు

అమరావతి : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో భీమిలి, జీడి నెల్లూరు నియోజకవర్గాల వైసీపీ నేతలు గురువారం టీడీపీలో చేరారు. వీఎంఆర్డీఏ ఛైర్ పర్సన్ అక్రమాని విజయనిర్మలవెంకట్రావుతో పాటు విశాఖజిల్లా చిరంజీవి(చిరు) సేవా సంఘం అధ్యక్షులు దుక్క కృష్ణాయాదవ్, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఒమ్మి దేవుడు, పద్మనాభం మాజీ ఎంపీపీ గోపిరాజు, మాజీ సర్పంచులు గేదెల చంద్రారావు, నమ్మి వెంకట్రావు, భీమిలి 25వ వార్డు అధ్యక్షులు గడిదేశ సూర్యబాబు చేరారు. జీడి నెల్లూరు నుండి సింగిల్ విండో మాజీ ప్రెసిడెంట్ బాబు నాయుడు, మాజీ సర్పంచ్ జయచంద్ర నాయుడు చేరారు. వీరికి చంద్రబాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

LEAVE A RESPONSE