– కుప్పంలో ఉప్పొంగిన అభిమానం
-లక్ష మెజార్టీ ఖాయమని వెల్లడి
-వారిచ్చిన డబ్బుతోనే నామినేషన్ వేశా
-పసుపు జెండా తప్ప వేరే జెండాకు తావులేదిక్కడ
-వైసీపీ దుర్మార్గ పాలనను తరిమికొట్టాలని పిలుపు
-జనసంద్రంగా మారిన వీధులు
-కదంతొక్కిన కూటమి పార్టీల శ్రేణులు
కుప్పం, మహానాడు: కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తరపున సతీమణి నారా భువనేశ్వరి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. భువనేశ్వరి వెంట వేలాదిగా నామినేషన్‌కు తరలిరావటంతో కుప్పం రోడ్లు జనసంద్రమయ్యాయి. కార్యకర్తలకు అభివాదం చేస్తూ నామినేషన్ కేంద్రానికి సాగారు. డీజే, తీన్మార్, డప్పులు, కోలాటం కళాకారుల సందడి నడుమ పండుగ వాతావరణాన్ని తలపించేలా ర్యాలీ జరిగింది. కుప్పం బస్టాండ్ పరిసరాలు జనసంద్రంగా మారాయి. కూటమి పార్టీల శ్రేణులు కదం తొక్కాయి. నామినేషన్ అనంతరం బస్టాండ్ సెంటర్‌లో సభలో ప్రసంగించారు. కుప్పం ప్రజలకు, టీడీపీ బిడ్డలకు నా నమస్కారాలు. కుప్పం గడ్డ … టీడీపీ అడ్డా.. కుప్పంలో పసుపు జెండా తప్ప మరో జెండాకు తావులేదు… చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు నేను నిజం గెలవాలి కార్యక్రమాన్ని చేశాను.
నా పార్టీ బిడ్డల కుటుంబాలను నేరుగా కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ సమయంలో పార్టీ బిడ్డలే నాకు అండగా నిలిచారు. నేడు కుప్పంలో అంతకు మించి అన్నట్టు మీ ఉత్సాహం, ఆనందం చూస్తుంటే లక్ష మెజార్టీ ఖాయం అనిపిస్తోంది. నామినేషన్‌కు బయలుదేరినప్పుడు యువత, నిరు ద్యోగులు, మహిళలు, వికలాంగులు, రైతులు వచ్చి నామినేషన్ ఫీజు ఇచ్చారు. చంద్రబాబు సీఎం అయితేనే తమ భవిష్యత్తు బాగుంటుందని అన్నారు.. వారు ఇచ్చిన డబ్బులతోనే నామినేషన్ వేస్తున్నా ను. చంద్రబాబు ఏపీని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలని చూశారు. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని దోచేశారు. వైసీపీ నేతల దోపిడీకి అడ్డుపడిన టీడీపీ కార్యకర్తలను దారుణంగా చంపేశారు. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదు. రాష్ట్రంలో ప్రాంతాలు వేరైనా మనమంతా ఒక్కటే.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు వైసీపీ పాలనలో నలిగిపోయారు. వైసీపీ దుర్మార్గపు పాలనను రానున్న ఎన్నికల్లో ఓడిరచాలి. ఓటు అనే ఆయుధంతో రాక్షస పాలనను గద్దె దించాలి. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు జెండాలు వేరైనా అజెండాలు ఒక్కటే… అది ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడం. మే 13న జరిగే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులను రాష్ట్ర వ్యాప్తంగా గెలిపించాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.