Suryaa.co.in

Telangana

టీఆర్ ఎస్ కు భారీ షాక్..

టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. గులాబీ పార్టీకి ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న మాజీ ఐఏఎస్ రామచంద్రు తేజావత్ గుడ్ బై చెప్పారు. ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం, పార్టీ తీసుకున్న నిర్ణయాలు నచ్చకపోవడంతోనే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వకూడదని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడం బాధ కలిగిచిందని చెప్పారు. అందుకే టీఆర్‌ఎస్ పార్టీతో తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. టీఆర్‌ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని..తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని తేజావత్ రామచంద్రు కోరారు. పార్టీకి, ప్రభుత్వానికి మరెంతో సేవ చేద్దామని అనుకున్నానని కానీ​ టీఆర్‌ఎస్ పార్టీ, ప్రభుత్వం తన సేవలను వినియోగించుకోలేదని తేజావత్ రామచంద్రు అన్నారు.

LEAVE A RESPONSE