– పోలీసులను పరిగెత్తించి కొట్టారు
– రాళ్లతో దాడి
– నష్టపరిహారం కేసులో శిమెత్తిన బిహారీలు
సూర్యాపేట జిల్లా పాలకీడులో డక్కెన్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీలో చాలా మంది బీహార్ కూలీలు పని చేస్తున్నారు. ఇటీవల ఫ్యాక్టరీలో పని చేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు చనిపోయాడు. నష్టపరిహారం విషయంలో మేనేజ్ మెంట్ నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోవటంతో.. బీహార్ కూలీలు అందరూ ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు.
ఫ్యాక్టరీ ఆఫీస్ ధ్వంసం చేశారు. అద్దాలు పగలగొట్టారు. ఆఫీస్ మొత్తాన్ని ధ్వంసం చేశారు. విషయం తెలిసి ఫ్యాక్టరీకి వచ్చిన పోలీసులపైనా తిరగబడ్డారు బీహార్ కూలీలు. ఫ్యాక్టరీ ఆవరణలో అరాచకం చేశారు. పరిస్థితి చక్కదిద్దటానికి ప్రయత్నించిన పోలీసులను తరిమి తరిమి కొట్టారు