– స్పందన కార్యక్రమాన్ని మరింత బాధ్యతగా నిర్వర్తించేందుకే అటెండెన్స్
– గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్
ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ అనేది చాలా పాత విషయమని ఇందులో కొత్తగా చేర్చింది ఏమీ లేదని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. ఉదయం ఆఫీసుకు వచ్చేటప్పుడు తిరిగి సాయంత్రం ఇంటికెళ్లేటప్పుడు రెండు సార్లు పంచ్ వేయడం ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా సర్వసాధారణమైన అంశమన్నారు. అమరావతిలోని కేంద్ర సచివాలయ ఉద్యోగులతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు రెండు సార్లు అటెండెన్సు వేస్తున్నారని చెప్పారు.
అయితే గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు స్పందన కార్యక్రమం ఉంటుందన్నారు. దీనివల్ల అనేక మంది ప్రజల సమస్యలు సకాలంలో పరిష్కారమవుతున్నాయని చెప్పారు. సచివాలయ ఉద్యోగులు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉన్నారని చెప్పేందుకు మరియు ప్రజల సమస్యలు సత్వరంగా పరిష్కారమయ్యేందుకు మధాహ్నం 3 గంటలకు స్పందన కార్యక్రమంలో ఒకసారి అదనంగా బయోమెట్రిక్ వేయమని చెప్పారమన్నారు.
దీనివల్ల ఎవరికీ ఏ ఇబ్బంది లేదనీ ఉద్యోగుల జవాబుదారి తనానికి ఇది నిదర్శనమని చెప్పారు. ఎవరూ ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ikచెప్పిన ఆయన ఫీల్డ్ లో ఉన్న ఉద్యోగులు పనివేళల మధ్యలో ఏదో ఒక సమయంలో అటెండెన్స్ వేసినా సరిపోతుందన్నారు.