నేడు చాప్లిన్ జయంతి
ఆ ఇంట్లోనే
హాస్యం పుట్టిందేమో..
ఆ మొహమే
చిరునవ్వుకు
చిరునామా ఏమో..
అదేమి చిత్రమో ఆ మనిషిని చూస్తేనే నవ్వు..
అతడేడుస్తున్నా మనకి నవ్వే
ఏందో ఆ చాప్లిన్…
చచ్చి ఇన్నేళ్ళయినా
నవ్విస్తూనే ఉన్నాడు..
అసలు నవ్వించడానికే పుట్టాడు కదా..
అందుకే
నవ్విస్తున్నాడిలా సదా..!
చాప్లిన్ హాస్యంలో
వెకిలి లేదు..
వ్యంగ్యమే..
వినోదంలోనూ సందేశమే..
కామెడీలో ట్రాజెడీ..!
పడిపోతూ నవ్విస్తాడు..
పడకుండా చేసే ప్రయత్నంలో
పాఠం చెబుతాడు..
జారే ప్యాంటూ..
పడిపోయే టోపీ..
ఎగిరిపోయే శాల్తీ..
అన్నిటిలోనూ కనిపించే
చాప్లిన్ తత్వం..
కనిపించదు అందులో
రవ్వంతైనా కల్తీ..!
చాప్లిన్ సినిమా ఓ అడిక్షన్..
ఆయన అభినయం డిక్షనరీ..
మాట రాని మౌనం
శిఖరాగ్ర నటనకు కొలమానం
ఆయన అనుకరణ
ఏ కళాకారుడికైనా
ఓ పరీక్ష..
ఎంత స్టారైనా.. మెగాస్టారైనా
చాప్లిన్ ఇమిటేషన్
ఓ క్వాలిఫికేషన్..!
నవ్వించడమే చాప్లిన్ ట్రెండు
ఆ నవ్వే ఓ బ్రాండు..
పొడుగాటి కోటు..
టూత్ బ్రష్ మీసం..
మాటిమాటికీ
పడిపోయే టోపీ..
జారిపోయే ప్యాంటు..
ఎగిరిపోయే టెంటు..
మెరిసే బూటు..
ఇవన్నీ నవ్వుకు నేస్తాలే..
మొత్తంగా ఆయన గెటప్పు
పొట్ట చెక్కలయ్యే సెటప్పు!
సగం సినిమాలు స్వగతమే
ఏం తీసినా స్వాగతమే..
తన సినిమాలకు
తనే ‘డిక్టేటర్..’
తన జీవితమే ‘సర్కస్’..
ప్రతి సినిమా ఓ ‘గోల్డ్’
విపరీతంగా సోల్డ్..
హిట్లరుపైనా తీసేంత బోల్డ్..!
మన నాన్నలు
కూడా చూడని
నేడే విడుదల పోస్టర్..
మన మునిమనవలు
సైతం చూసే
నేడే చూడండి బ్యానర్
అలా తరతరాలు చూడ్డమే
చాప్లిన్ జోనర్..
సినిమా హాస్యానికి
అతడే తొలి ఓనర్..!
*ఎలిశెట్టి సురేష్ కుమార్*
9948546286