– కేంద్రం పంచాయతీలకు ఇచ్చిన నిధులను దారి మళ్లించారు
– కేంద్రం కూడా ఇటువంటి సిఎం ని ఎక్కడా చూడలేదు
– సొంత పార్టీ సర్పంచ్ లు ఆందోళన చేస్తున్నా .. జగన్ లో చలనం లేదు
– ఆదాయం లేని వాటిని కూడా ఉన్నట్లుగా చూపించి మరీ అప్పులు తెచ్చారు
– వాగ్దానాలు అమలు చేయకుండా మోసం చేశారు
– 19,600కోట్లు ఈ ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించింది
– కేంద్రం ఇచ్చిన నిధులు కూడా సక్రమంగా ఇవ్వలేరా?
– ఏపీ బిజెపి ఛీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి , జాతీయ కార్యదర్శి సత్యకుమార్
– ఏపీ గవర్నర్ను కలిసిన బీజేపీ నేతలు
– శ్వేతపత్రం విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని వినతి
– పంచాయతీ నిధులు దారి మళ్లింపు, అపరిమితంగా చేస్తున్న అప్పుల పై ఫిర్యాదు
ఈ సందర్భంగా ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఏమన్నారంటే..
వైసీపీ ప్రభుత్వం ఆర్ధిక క్రమశిక్షణ తప్పింది లెక్కకు మించి అప్పులు చేయడం ఇదే విషయం పై ప్రజలకు రాష్ట్ర ఆర్ధిక స్ధితిగతుల పై శ్వేత పత్రం విడుదల చేయాలని నేను డిమాండ్ చేశాను.. ఈవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక వ్యవహారం ఉంటే, రాష్ట్రం గుల్లకావడం ఖాయం అందువల్లనే బీజేపీ రాష్ట్ర శాఖ
దశల వారీగా ఆందోళన చేస్తున్నాం. గ్రామాలను అభివృద్ధి చేస్తామని వైసీపీ హామీ ఇచ్చింది.వాగ్దానాలు అమలు చేయకుండా మోసం చేశారు.కేంద్రం పంచాయతీలకు ఇచ్చిన నిధులను దారి మళ్లించారు.
గ్రామాల్లో ప్రభుత్వం పనులు నిలిపివేశారు.చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా బిల్లులు చెల్లించలేని పరిస్థితి.ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కొంతమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు.ఈ అంశంపై రాష్ట్ర గవర్నర్ ను కలిసి పరిస్థితి వివరించాం. సర్పంచులకు న్యాయం చేయాలని, గ్రామీణ వ్యవస్థను కాపాడాలని కోరాం.
రాష్ట్రం పై ఉన్న అప్పుల భారాల మీద పదేపదే బిజెపి ప్రస్తావిస్తూ ఉంది.గడిచిన నాలుగు సంవత్సరాలు కాలంలో 7.44 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చారు. ఎఫ్ ఆర్ బి ఎం లోబడి తీసుకొచ్చిన అప్పు కొంతవరకు ఉంటే, ఆ పరిధిలోకి రానివ్వకుండా అనేక విధాలుగా వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం అప్పులు తెచ్చింది. ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టడం, వివిధ కార్పొరేషన్లు ద్వారా , ఆదాయం లేని వాటిని కూడా ఉన్నట్లుగా చూపించి మరీ అప్పులు తెచ్చారు.
బెవరేజెస్ కార్పొరేషన్ ఏపీ ద్వారా కూడా మద్యం మీద అప్పులు తెచ్చారు.పేదలకు మద్యం సరఫరా చేసి కుటుంబాన్ని చిధ్రం చేసి తద్వారా వచ్చే ఆదాయాన్ని చూపి అప్పులు చేయటం దుర్మార్గం. రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థగా గవర్నర్ ఉన్నారు కాబట్టి వీటి పై స్పందించాలని ఈరోజు ఆయన్ని కలిసి విజ్ఞప్తి చేశాం. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆస్తులు తనఖా విషయాలపై కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించని అంశాలు ఎందుకు ప్రస్తావించలేదు?
రాష్ట్ర ప్రభుత్వం మసి పూసి మారేడు కాయ చేసే విధంగా వ్యవహరిస్తుంది.రాష్ట్రంలో ఉన్న ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదిక కూడా ఇచ్చింది. ఆ రిపోర్టులో చూస్తే రాష్ట్ర ప్రభుత్వం తీరు ఎంత అద్వానంగా ఉందో అందరికీ అర్థమవుతుంది.
బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ ఏమన్నారంటే..
పంచాయతీ ల అభివృద్ధి కి కేంద్రం నిధులు ఇస్తుంది. జగన్ ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్ళించింది. సర్పంచ్ లు నిరసనలు తెలిపినా, నిధులు కోరినా జగన్ లో స్పందన లేదు. 19,600కోట్లు ఈ ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించింది. ఆర్థిక సంఘం ఏర్పాటు చేస్తే నిధులు ఇవ్వాల్సి వస్తుందని ప్రకటనకే పరిమితం చేశారు.గ్రామాల్లో కనీస మౌలిక వసతులు లేకుండా చేశారు.
మూడున్నర కోట్ల మంది ప్రజల కష్టాలు పట్టించుకోవడం లేదు. కేంద్రం ఇచ్చిన నిధులు కూడా సక్రమంగా ఇవ్వలేరా? గ్రామాల పై జగన్మోహన్ రెడ్డి కి ఎందుకు ఇంత కక్ష? సొంత పార్టీ సర్పంచ్ లు ఆందోళన
చేస్తున్నా .. జగన్ లో చలనం లేదు. టక్కు టమార గోకర్ణ విద్యలు తెలిసిన వ్యక్తి సిఎం అయ్యారు. కేంద్రం కూడా ఇటువంటి సిఎం ని ఎక్కడా చూడలేదు. ఈ అంశాల పై విచారించి చర్యలు తీసుకోవాలని గవర్నర్ ని కోరాం.
రాష్ట్రప్రధాన కార్యదర్శులు పివిఎన్ మాధవ్, ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి, వేటుకూరి సూర్యనారాయణ రాజు, బిట్రశివన్నారాయణ , బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుళ్లు ఆదినారాయణ రెడ్డి, చంద్రమౌళి, మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, వామరాజు సత్యమూర్తి , మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, నూతలపాటి బాల తో పాటు వివిధ జిల్లాల నుండి వచ్చిన జిల్లా అధ్యక్షు లు పాల్గొన్నారు.