Suryaa.co.in

Andhra Pradesh

జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురు బీజేపీ ధర్నా

గుంటూరు : పశ్చిమ బెంగాల్లో మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురు బిజెపి గుంటూరు జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ లో గత కొన్ని నెలలుగా సందేశ్ ఖులి గ్రామం లోని మహిళా గిరిజనులపై అకృత్యాలు జరుగుతుంటే.. మమతా ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్టు ప్రవర్తిస్తుందని , ఒక మహిళా ముఖ్యమంత్రి అయ్యుండి కూడా మహిళలపై జరుగుతున్న దాడులను ఖండించలేని వాటిని ఆపలేని నిస్సహాయతకు చేతగాని తనం నిదర్శనం అని అన్నారు.

ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివ నారాయణ మాట్లాడుతూ పశ్చిమబెంగాల్లోని టీఎంసీ పార్టీకి ఓట్లు వేయలేదన్న అక్కస్సుతో తృణమాల్ నాయకుడు షేక్ షాజహాన్ అతని అనుచరులు గిరిజన కుటుంబాలకు ఉపాధి వేతనాలు కల్పించకుండా ఇబ్బంది పెడుతున్నారని, మహిళలపై ఇష్టానుసారంగా లైంగిక దాడులు పాల్పడుతున్నారని,కొందరి మహిళలను వివస్త్రలుగా చేసి ఆ గ్రామం లో ఊరేగించి వారి పొలాలను ఆక్రమించుకున్నారని అన్నారు.

ధర్నా అనంతరం ర్యాలీగా కలెక్టర్ ఆఫీస్ లోకి వెళ్లి కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్లమెంటు కన్వీనర్ చంద్రశేఖర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాటిబండ్ల రామకృష్ణ, యడ్లపాటి స్వరూపరాణి,ఈదర శ్రీనివాసరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు చరక కుమార్ గౌడ్, చెరుకూరి తిరుపతి రావు, ఉపాధ్యక్షులు పద్మనాభం, ఆవుల రాము, కార్యదర్శి దానబోయిన శివయ్య ఏలూరి లక్ష్మి, కత్తి మేరీ సరోజినీ,తోట శ్రీను,మోర్చా అధ్యక్షులు తుళ్లిమిల్లి రామకృష్ణ,డాక్టర్ దార అంబేద్కర్,నరేంద్ర షా,తుళ్లిమిల్లి శ్రీనివాసరావు, అసెంబ్లీ కన్వీనర్ వరికూటి వీర సుధాకర్,కన్నా రవిదేవరాజు, కో కన్వీనర్ దర్శనపు శ్రీనివాస్,మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణి, ఉపాధ్యక్షులు వాణి, నాగమల్లీశ్వరి,మహిళా మోర్చా నాయకులు సుకన్య,కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాండు రంగా విట్టల్, తాను చింతల అనిల్ కుమార్,ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కామేపల్లి వెంకటేశ్వర్లు, దాసరి రమేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాకేష్ జీ, మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గౌస్ పీరా,మండల అధ్యక్షులు పోకల పురుషోత్తం,సాంబయ్య,వెంకటేష్, మాదాల సురేష్, భాను ప్రసాద్, నాయకులు రాజేష్ నాయుడు,తాడువాయి రామకృష్ణ, స్టాలిన్, వెంకట్, దేసు సత్యన్నారాయణ,యస్వంత్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE