ఆంధ్రప్రదేశ్ కి బీజేపీ ఒక శనిగ్రహంలా దాపురించింది. బీజేపీకి ఆంధ్రప్రదేశ్ ఎదగడం సుతరామూ ఇష్టంలేదు. తెలుగుదేశం బ్రతకడం అంతకు మించి ఇష్టంలేదు. ఆంధ్రప్రదేశ్ ఎదిగితే కంపెనీలు అన్నీ ఇక్కడకు వస్తాయి అనే ఈర్ష్య.. అభివృద్ధిలో ఉత్తర రాష్ట్రాలను మించిపోతుందనే కుళ్ళుబోతు తనం.
తెలుగుదేశాన్ని లేకుండాచేసి బీజేపీ బలపడాలనే దుర్బుద్ధి. అదే పని వైసీపీని చేసేది. కానీ వైసీపీ లేకపోయినా ముస్లింలు, ఎస్.సి లు బీజేపీని సమర్దించరు.అందువలన చంద్రబాబుకు వయస్సు పైబడిందనే సాకుతో, తెలుగుదేశంను లేకుండాచేస్తే ఓసిలలో హిందూత్వం ఆశలేపి ఎదగాలని.. దానిలో భాగమే గుడులపై దాడులు,రధాలు తగలబెట్టడం చేయించారు.హిందూ ఓట్లతో ఎదగొచ్చని.. వైసీపీతో చేతులుకలిపి, తెలుగుదేశంకు నరకం చూపించారు. టీడీపీ నాయకులు,కేడర్ చంద్రబాబు వెంట పెట్టనికోటలా నిలబడేసరికి వీలుకాక పొత్తుకోసం తెరచాటు ఆట మొదలెట్టారు.
అదీకాక వైసీపీపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చేసరికి.. ఆ మకిలి బీజేపీకి అంటకుండా, తెలుగుదేశంను దగ్గరకు తీస్తున్నారు.రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు ఓటర్లు దేశవ్యాప్తంగా ఉన్నారు.వారు అమరావతికి చేసిన ద్రోహంతో, బీజేపీకి వ్యతిరేకంగా నడుస్తారో అనే భయం ఉంది.గత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో.. తెలుగు ఓట్లర్లు పెట్టిన గడ్డి, కళ్ళముందు కనపడుతుంది.గెలుపు వాకిటిముందుకువచ్చిన బీజేపీని ఓడించారు.
లేడికి కాలమొచ్చి చిక్కిందా, కాళ్లులేక చిక్కిందా అంటే.. కాలమొచ్చే చిక్కింది. కాళ్ళు లేక కాదు. అన్నట్లు అలానే చంద్రబాబుకూడా చేసేదిలేక లొంగినట్లు కన్నపడుతుంది.
ప్రస్తుతం చంద్రబాబు ముందు రెండు విషయాలు గొంతుపట్టుకున్నట్లు కనపడుతున్నాయి.
1..ఎలాగోలా ముందు పార్టీని రక్షించుకోవాలి.లేకపోతే నీళ్ళల్లో మొసలిలా, బీజేపీ ఒడ్డున పులిలా వైసీపీ మింగేయటానికి, కళ్ళు ఆర్పకుండా ఎదురుచూస్తున్నాయి.ముందు ఈ రెంటిలో ఒకదాన్ని చంపాలి. బీజేపీ జాతీయపార్టీ. అది కుదరదు ఇప్పుడు. కాబట్టి బీజేపీ భుజంపై తుపాకిపెట్టి వైసీపీని కాల్చాలి.
2.అంతకుమించి అమరావతి రాజధానిని రక్షించుకోవాలి.
ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబుకు కూడా బీజేపీతో కొన్నాళ్ళు నడవక తప్పదు.
ఇక వైసీపీ నిండా మునిగిన పడవలా .. ఒక్క దౌర్జన్యం చేసైనా గెలవాలనే ఆశతప్ప, అభివృద్ధిపై ఓట్లు అడిగి గెలిసే పరిస్థితి ఐతే లేదు. అదికూడా గతంలో బీజేపీ ఫుల్ సపోర్ట్ చేసింది. ఇప్పుడైతే అలాంటి పరిస్థితి ఉండేలాలేదు.
ఇక బీజేపీ బంగారు కడెం దగ్గర పెట్టుకొన్న ముసలి పులిలా.. ఎవడు దొరుకుతాడా మింగేద్దామని కాచుకు కూర్చుని. ఎంతటి వాడినైనా వాడుకొని చంపేయటంలో దిట్ట. రేపు వైసీపీని చంపేయటం బీజేపీకి పెద్దలెక్కకాదు.వాస్తవంగా బీజేపీకి ఈవీఎంలు లేకపోతే విజయమే ఉండదు.
ఇటువంటి తప్పని పరిస్థితుల్లో.. బీజేపీతో చంద్రబాబు కలిసినా.. పార్టీని,అమరావతిని కాపాడుకుంటూ, తనను తాను రక్షించుకుంటూ.. నీళ్ళల్లో ముసలి బీజేపీకి దొరక్కుండా తిరగగలిగితేనే.. దొరికితే ఒకే ఒక గుటక.ఎంతటి జంతువైనా నీళ్ళల్లో ముసలికి దొరికితే, పల్టీలు కొట్టుకుంటూ ఎంతటి శరీరాన్నైనా ముక్కలు, ముక్కలుగా చీల్సి మింగేస్తుంది.ఎన్నిపార్టీలను మింగిందో చూస్తున్నాముగా.
చంద్రబాబు కూడా.. బీజేపీతో తప్పని పరిస్థితుల్లో కలిసినట్లే కనపడుతుంది. అది ఇప్పుడు కాదు. అండమాన్ మునిసిపల్ ఎన్నికల్లోనే తేలిపోయింది.బీజేపీకి కాంగ్రెస్ కి చెరి 9 వార్డులు వస్తే.. బీజేపీ తెలుగుదేశం పొత్తుతో, కార్పొరేషన్ ను దక్కించుకుంది. అప్పుడే తేలిపోతుంది తెలుగుదేశం బీజేపీ పొత్తు. అలాంటి ముసలితో (బీజేపీ) చంద్రబాబు ఎలా నెట్టుకు వస్తాడో చూడాల్సిందే.
– తుమ్మల