Suryaa.co.in

Andhra Pradesh

అన్నమయ్య జయంతి ఉత్సవాలు నామమాత్రంగా జరపడాన్ని ఖండించిన బీజేపీ

నేడు 614 వ అన్నమయ్య జయంతి ఉత్సవాలు నామమాత్రంగా నిర్లక్ష్య పూరితంగా జరపడాన్ని బీజేపీ మరియు అన్నమయ్య భక్తులు తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నారు.అన్నమయ్య ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిపేవారు.ఓక రోజు ముందు చలువ పందిరి వేసి విద్యుత్ కాంతులు లేకుండా నిర్లక్ష్యం.

ఆనవాయితీగా ! గతంలో 15 రోజుల ముందే రాజంపేట ప్రాంతంలో ఉన్నటువంటి అన్నమయ్య భక్తులను మరియు ప్రజా ప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వారిని స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రజలని పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసే విధంగా పూర్వ యోజన చేసేవారు.కానీ స్వయంగా జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పటి కూడా వారి తండ్రిగారు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఉత్సవాల పరిపాటి కూడా కొనసాగించకపోవడం బాధాకరమైనటువంటి విషయం.

తాళ్లపాకలో వారంలో ప్రతి శనివారం స్వామి వారి యొక్క లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు అందుబాటులో ఉంచేవారు.అలాగే తాళ్ళపాక నుంచి తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి కంకణాలు కట్టించుకోవడానికి వున్న కౌంటర్ కూడా తొలగించారు.

అన్నమయ్య జన్మస్థలాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి అక్కడ అన్నమయ్య ధ్యాన మందిరం పక్కన చెరువులో వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని కడతామని చెప్పి, సంగీత కళాశాలను నిర్వహిస్తామని నేడు మరిచారు.అక్యడి చెరువు కట్టను మరొక ట్యాంకు బండ చేస్తామని చెప్పిన హామీలు కూడా నేరవేరచక పోవడం బాధాకరం .ఒకప్పుడు దళిత గోవిందం అక్కడే ప్రారంభిస్తే ఆనాడు కమ్యూనిస్టులు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలుగా మేము సైతం అందరం కలిసి కమ్యునిష్ట్ ఆగడాలు అడ్డు కోవడం జరిగింది.దళిత గోవిందం వల్ల అన్యమత ప్రచారం ఎంతోకొంత ఆగింది !

ఇప్పుడు ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారు జయంతి ఉత్సవాలను కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా తూతూమంత్రంగా కార్యక్రమాన్ని నిర్వహించి వెళ్ళిపోతున్నారు.ఇది సమంజసం కాదు స్వామి వారికి వచ్చే ఆదాయంలో వెంకటేశ్వర స్వామి హుండిలో అన్నమాచార్యులవారికి కూడా భాగం ఉంది. రూపాయలో వందో వంతు ఖర్చుపెట్టిన తాళ్ళపాక మరో తిరుమల లాగా అభివృద్ధి చెంది ఉండేది కానీ ఎందుకో ఈ నిర్లక్ష్యం .సాక్షాత్తు తిరుమలలో వెంకటేశ్వర స్వామి యొక్క గుడి పక్కన ఉన్నటువంటి అన్నమయ్య గృహము ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని మాడ వీధుల విస్తరణ పేరుమీద తొలగించారు దాని పునరుద్ధరించాలని స్వామిజిలు సూచనలు భేఖాతరు.

అన్నమయ్య వారసుల యొక్క సూచనలు సలహాలు కూడా తీసుకోవాలని టిటిడి వారిని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయాల మీద స్వామి వారి భక్తులు పీఠాధిపతులు మఠాధిపతులు .అన్నమయ్య భక్తులు ఆగ్రహానికి గురు కాకముందే ప్రభుత్వం కళ్లు తెరవాలిని డిమాండ్ చేస్తున్నాం
ఈ సమావేశంలో ముని క్రిష్ణ యాదవ్ , జీవన్ రాయల్, దాము రాయల్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE