తెలంగాణ రాష్ట్రంలో ఆరా మస్తాన్ అనే సర్వే సంస్థ .. రాష్ట్ర ఎన్నికల విషయంలో పార్టీ బలాబలాలకు సంబంధించి, ఏ పార్టీకి ఎటువంటి ఆదరణ ఉందని సర్వే చేశారు. ఆ సర్వేలో టిఆర్ఎస్ కు 38.88%, బిజెపికి 30.48% ,కాంగ్రెస్ పార్టీకి 23.71% ఇతరులకు 6.93% గా సర్వే రిపోర్ట్ ఇచ్చారు. అదే విధంగా ఆత్మ సాక్షి అనే సంస్థ కూడ సర్వేచేసి 39.51%,,టి అర్ స్ కు ,31.53% ,బి జె పికి21.78% ఇచ్చారు.దీనిని బట్టి టి ఆర్ స్ గ్రాఫ్ పడిపోతోందని క్లియర్ గా ఆర్ధమవుతుంది.బిజెపి గ్రాఫ్ పెరుగుతుంది. కాంగ్రెస్ కు కొంత పెరిగినా, వారు గెలిచినా తిరిగి టి అర్ స్ కు పోతారని అభిప్రాయానికి ప్రజలు వస్తారు.
అయితే ఈ సర్వేలో బిజెపి గ్రాఫ్ బాగా పెరిగింది. అందులో వారు మాట్లాడుతూ అసెంబ్లీకి సరిపోయే అభ్యర్థులు 29 మంది ఉన్నారని అన్నారు. వాస్తవంకాదు. బిజెపి ఎత్తుగడలు అన్ని బయటకు కనిపించవు. పార్టీ వ్యూహాలు బహిర్గతం చేయరు. ఇంకా ఎన్నికలకు సమయం ఉంది.కావున ఆ సర్వే చేసిన వారికి ఇది అంతు పట్టదు. కాబట్టి వారు ఆ విధంగా అనుకోవచ్చు.
అదేవిధంగా దేశం మొత్తం మీద ఇంకొక సంస్థ సెంటర్ ఫర్ ఒపీనియన్ నేషనల్ సర్వే వారు, 25 మంది ముఖ్యమంత్రుల పని తీరు స్థాయి ఎలా ఉందని సర్వే చేస్తే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కి 20వ స్థానం వచ్చింది. ఓటింగ్ పర్సంటేజ్ లో 40 %,తెలుగుదేశం పార్టీకి 27% ,ఎవరికి చెప్పని ఓటు 33%గా ఇచ్చారు .
దీనిని బట్టి అర్థమయ్యేది ఏంటంటే… దేశం మొత్తం బిజెపి అనుకూలమైన వాతావరణం, ప్రధానమంత్రి మోడీ గారు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించారు ఆదరణ చూపుతున్నారనే దానికి ఇది ఒక నిదర్శనం .అయితే ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ,జనసేన పార్టీలు రెండు కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు నిర్మించి, ప్రజలలో నమ్మకం కలిగించిన రోజున, ఖచ్చితంగా ఎటూ చెప్పని 33% బిజెపికి జనసేనకు వచ్చే అవకాశం ఉంది.1998 లో ఎవరితో పొత్తు లేకుండా బి జె పి ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో18%%ఓట్ల తో 5 పార్లమెంట్ సీట్లు, 12 అసెంబ్లీ సీట్లలో గెలిపించారు.
ప్రజలలో వైఎస్ఆర్సిపి మీద వ్యతిరేకత మొదలైంది. తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన అధికార దుర్వినియోగం, లంచగొండితనం, జన్మభూమి కమిటీలలో ప్రజలలో చాలా వ్యతిరేకత వచ్చిన విషయం మనం మర్చిపోలేదు. తిరిగి ప్రజలు తెలుగుదేశాన్ని అధికారంలోకి తెచ్చేదానికి సిద్ధంగా లేరు.
అందువలన బిజెపి ,జనసేనకు అధికారం, అవకాశం ఇవ్వాలని ప్రజలలో ఆలోచన ఉంది. అయితే బిజెపి ,జనసేన కార్యకర్తలు కేంద్రం చేపట్టిన పథకాలయిన , ఇన్సూరెన్స్ , సంక్షేమ, మహిళలకు, రైతులకు,పేద ప్రజలకి ఇస్తున్న చేయూత తదితర వివరాలు కార్యకర్తలు ఇంటింటికి తీసుకెళ్లి ప్రజలకు వివరిస్తే ఖచ్చితంగా బిజెపి, జనసేనను అధికారంలోకి తీసుకొస్తారనే దాంట్లో పూర్తి విశ్వాసం ఉంది.
– కరణం భాస్కర్
బిజెపి ,
మొబైల్ నెంబర్ 7386128877