– గ్యాస్ సిలిండర్ ధర పెంచి మోడీ ప్రజల ఉసురు తీస్తున్నారు
– మోడీ సిలిండర్ ధర పెంచి మహిళలకు కానుక ఇచ్చారు
– మోడీ చెప్పే అచ్చే దిన్ ఇవేనా?
– మహిళల పై మోడీ వివక్ష కు సిలిండర్ ల ధరల పెంపు ఓ ఉదాహరణ
– రేషన్ షాప్ దగ్గర మోడీ బొమ్మ లేకపోతే కేంద్ర మంత్రి సీతారామన్ బాధ పడ్డారు
– సిలిండర్ ధర పెంచినందుకు మోడీ బొమ్మ వేయాలని ఆమెకు విజ్ఞప్తి చేస్తున్నాం
– మంత్రులు సబితా ఇంద్రారెడ్డి ,సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి
సబితా ఇంద్రారెడ్డి ఏమన్నారంటే..
ఎనిమిదిన్నరేళ్ళుగా మోడీ ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తుందేమో అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.మంచి చేయపోగా ధరలు విపరీతంగా పెంచేస్తున్నారు. తాజాగా సిలిండర్ ధర 50 రూపాయలు పెంచారు. త్వరలోనే మహిళా దినోత్సవం రానున్న నేపథ్యంలో మోడీ సిలిండర్ ధర పెంచి మహిళలకు కానుక ఇచ్చారు. బీజేపీ అంటే ప్రజల జేబులు ఖాళీ చేసే పార్టీ గా మారింది. ధరలు పెంచడం ప్రజలను ముంచడం బీజేపీ విధానం గా మారింది. ఆదానీ ఆస్తులు కరిగిపోతున్నాయి.. ఇపుడు ధరలు పెంచి ప్రజల ఆస్తులు కూడా కరిగిపోయేలా మోడీ విధానాలు ఉన్నాయి. మోడీ చెప్పే అచ్చే దిన్ ఇవేనా? మహిళల పై మోడీ వివక్ష కు సిలిండర్ ల ధరల పెంపు ఓ ఉదాహరణ. ప్రజలు గ్యాస్ పొయ్యి నుంచి మళ్లీ కట్టెల పొయ్యికి మళ్లేలా మోడీ సిలిండర్ ధరలు పెంచుతున్నారు.బీజేపీ నేతలు మోడీ ని దేవుడు అంటున్నారు.. ధరలు పెంచుతున్నందుకు మోడీ దేవుడు లా కనపడుతున్నారా? మహిళలు వంటింటి కి వెళ్లాలంటే భయపడే పరిస్థితి తెచ్చారు. మోడీ ప్రభుత్వానికి మహిళలే చరమ గీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. మహిళలు బీజేపీ కి వ్యతిరేకంగా సంఘటితం కావాలి. రేషన్ షాప్ దగ్గర మోడీ బొమ్మ లేకపోతే కేంద్ర మంత్రి సీతారామన్ బాధ. పడ్డారు..సిలిండర్ ధర పెంచినందుకు మోడీ బొమ్మ వేయాలని ఆమెకు విజ్ఞప్తి చేస్తున్నాం. సిలిండర్ పై మోడీ బొమ్మ వేస్తే ప్రజలకు ధరలు పెంచింది ఎవరో అర్థమవుతుంది. ఇంటర్మీడియట్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య బాధాకరం. విషయం తెలియగానే అధికారులకు పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించాను. విద్యార్థులు పరీక్షల సందర్భంగా ఒత్తిడికి లోను కాకుండా అన్ని కళాశాలలు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సూచించాం. విద్యార్థులకు తగిన కౌన్సెలింగ్ ఇచ్చే వ్యవస్థ ప్రతి కాలేజీ లో ఉండాలి. నిబంధనలు ఉల్లంఘించే కళాశాల ల పై చర్యలు తీసుకుంటాం.
మంత్రి సత్యవతి రాథోడ్ ఏమన్నారంటే..
మోడీ వచ్చాక గ్యాస్ సిలిండర్ ధరలు 175 శాతం పెరిగాయి.మోడీ మహిళలకు ఏదైనా మంచి కానుక ఇస్తారనుకుంటే సిలిండర్ భారాన్ని మోపారు.మోడీ మహిళల పాలిట శాపం లా, గుది బండలా మారారు.దేశం లో అంబానీలే కాదు ఆమ్ ఆద్మీ లు కూడా ఉన్నారనే విషయం మోడీ మరచి పోయారు.ఇంత మొత్తం లో ధరలు పెంచితే సామాన్యులు ఎలా భరిస్తారు?మోడీ గతం లో చాయ్ అమ్మే వారు.. చాయ్ అమ్మిన రీతిలో దేశం లో మోడీ ప్రజల ఆస్తులు అమ్మి వేస్తున్నారు. పేద ప్రజల నడ్డి విరిచే వాడే నరేంద్ర మోడీ.అప్పులు భారీ గా తెచ్చి ధరలు పెంచుతున్న మోడీ సామాన్యుడి మేలు కోసం ఒక్క మంచి పథకమైనా తెచ్చారా ఎన్నికలు ముగియగానే ధరలు పెంచడం మోడీ కి అలవాటుగా మారింది. మహిళలు కచ్చితంగా మోడీ పై తిరగ బడతారు. ఆనాడు స్మృతి ఇరానీ upa ప్రభుత్వం సిలిండర్ ధర పెంచితే రోడ్డు పైకి వచ్చారు. ఇపుడు మంత్రిగా మోడీ ని నిలదీయలేరా? మోడీ పాలన బుద్ది జ్ఞానం లేని వారి పాలన లా ఉంది.ధరలు పెంచడం పేదల ను ముంచడం బీజేపీ కి పరిపాటిగా మారింది.ప్రజలు బీజేపీ ని ముంచే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. సిలిండర్ ధరల పెంపునకు నిరసనగా బీ ఆర్ ఎస్ రేపు ఎల్లుండి నిర్వహించే రాష్ట్ర వ్యాప్త ఆందోళనల్లో మహిళలు స్వచ్చందంగా పాల్గొనాలి. మహిళ దినోత్సవం సందర్భంగా మోడీ మహిళలను నిరాశ పరిచారు.
ఎమ్మెల్సీ సురభి వాణి దేవి ఏమన్నారంటే..
సామాన్యులకు నిత్యావసర వస్తువు గా మారిన గ్యాస్ సిలిండర్ ధర పెంచి మోడీ ప్రజల ఉసురు తీస్తున్నారు.మోడీ పై వంటింటి నుంచే తిరుగు బాటు మొదలవుతుంది.