Suryaa.co.in

Andhra Pradesh

ఒకే రాష్ట్రం, ఓకే రాజధానికి బిజెపి కట్టుబడి ఉంది

– రైతుల ఆకాంక్షలను తెలుసుకొని కేంద్రానికి నివేదిస్తాం
– బిజెపి గుంటూరు జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ
– ఉద్దండ్రాయుని పాలెం వద్ద మోడీ శంఖుస్థాపన ప్రాంతాన్ని సందర్శించిన బిజెపి నేతలు

రాజధాని రైతుల మనోగతాన్ని కేంద్రానికి తెలియచేస్తామని గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ చెప్పారు. రాజధాని నిర్మాణానికే బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బిజెపి గుంటూరు జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ నాయకత్వంలో మనం మన అమరావతి పాదయాత్ర నాలుగవ రోజు ఉదయం వెలగపూడి నందు ప్రారంభమై ఉద్దండరాయునిపాలెం లింగాయపాలెం రాయపూడి అబ్బూరిపాలెం మీదుగా బోరుపాలెం నందు సాయంత్రం ముగిసినది. బీజేపీ నిర్వహిస్తున్న పాదయాత్రలో మాట్లాడిన రామకృష్ణ, షేక్ బాజీ రొంగల గోపి శ్రీనివాస్ పలు అంశాలను ప్రస్తావించారు.

పాదయాత్రలో భాగంగా మోడీ శంఖుస్థాపన ప్రాంతాన్ని సందర్శించాం.35 నదులు నుండి తీసుకొచ్చిన మట్టితో ఇక్కడ శంఖుస్థాపన చేశారు.రైతుల ఆకాంక్షలను తెలుసుకొని కేంద్రానికి నివేదిస్తాం.ఒకే రాష్ట్రం, ఓకే రాజధానికి బిజెపి కట్టుబడి ఉంది.రాష్ట్ర ప్రభుత్వానికి మంచి బుద్ది రావాలి.ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి జరగాలి.రాష్ట్ర శాఖ, కేంద్రం ఒకటే మాట.ఈ రాష్ట్ర ప్రభుత్వ కుట్రను చేధిస్తాం.అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం.అమరావతి రాజధానిగా కొనసాగిస్తానని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నమ్మించి మోసగించిన ఈ ప్రభుత్వాన్ని ప్రజలు గమనించారు.రాజధానుల పేరుతో రాజకీయాలు చేసి రైతుల గొంతు కోసి వాళ్ళ భవిష్యత్తును కాల రాశారు.స్వార్థ రహిత పాలన ఈ రాష్ట్రానికి అభివృద్ధికి అండగా బిజెపి ఉంటుంది.కేవలం అధికారమే పరమావధిగా అమరావతిని అడ్డం పెట్టుకొని అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ఆంధ్రప్రదేశ్ ప్రజలను వంచించారు.

అమరావతి ప్రజలు ఆత్మాభిమానంతో వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు.భారతీయ జనతాపార్టీ నాడు నేడు రేపు అమరావతి ప్రాంత రైతులకు అండగా ఉంటుంది.ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎదుర్కొంటుంది.బీజేపీ అమరావతి రాజధాని అనే మాటకు కట్టుబడి ఉంది. ఈ దేశంలో ఒక రాజధాని లేని రాష్త్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నాం.ఈ రాష్ట్రానికి అమరావతి రాజధానితో పాటు విద్యా వైద్య పారిశ్రామిక ఆర్థిక స్వావలంబన కలిగేలా బీజేపీ కృషి చేస్తుంది. అమరావతే రాజధాని అని బిజెపి తీర్మానం చేసింది.ఆ తీర్మానానికే కట్టుబడి ఉంది.ఒకసారి తీర్మానం చేసిన తర్వాత వెనక్కి వెళ్ళ.ఒక ఓటు రెండు రాష్ట్రాలని కాకినాడ తీర్మానం చేశాం. దానికి కట్టుబడి ఉన్నాం. రాజధాని అభివృద్ది చెందకపోతే ఈ రాష్ట్రంలో రైతులు భూములివ్వరు.ముఖ్యమంత్రి కుట్ర మూలంగానే రాజధానిని అభివృద్ధి చేయకుండా వదిలేశారు‌. అన్ని ప్రాంతాల ప్రజలు అమరావతి కే మద్దతిస్తున్నారు.రాష్ట్ర ప్రజల్లోకి అమరావతే రాజధానే అన్న అంశాన్ని బలంగా తీసుకెల్తాం‌.

ముఖ్య అతిదులుగా విచ్చేసిన షేక్ బాజీ రొంగల గోపి శ్రీనివాస్ లకు రాజధాని ప్రాంత రైతులు మహిళలు జేఏసీ సభ్యులు నుదుట తిలకం దిద్ది హారతులు ఇచ్చి పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. బిజెపి తుళ్లూరు మండల అధ్యక్షుడు నిరుకొండ లక్ష్మీ నారాయణ, కొమ్మినేని సత్యనారాయణ, జూపుడి రంగరాజు, నల్లబోతు వెంకట్రావు, జమ్ముల శ్యామ్ కిషోర్, మార్త నరేంద్ర, వనమా నరేంద్ర, అనుమోలు ఏడుకొండలు గౌడ్, ఉయ్యాల శ్యామ్ వరప్రసాద్, నాగుల్ మీరా, కామేపల్లి వెంకటేశ్వర్లు, గోలి శ్రీనివాసరావు, మల్లాల లక్ష్మణ్, మోహన్ స్వామి, మహిళా నేతలు రమాకుమారి, నాగమల్లేశ్వరి, మంత్రి సుగుణ, రమాదేవి, పాలపాటి రవికుమార్, ఈదర శ్రీనివాసరెడ్డి, కుమార్ గౌడ్, కంతేటి బ్రహ్మయ్య, సాయి, ముత్యం నరేంద్ర, జితేంద్ర గుప్త, జేఏసీ సభ్యులు అనుమోలు బాలమురళి, ఆలూరి యుగంధర్, అనుమోలు సునీత, పోలు దుర్గ మరియు ఇతర బిజెపి నాయకులు కార్యకర్తలు అమరావతి రైతులు పాదయాత్రలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE