Suryaa.co.in

Andhra Pradesh

చెవిరెడ్డి కుటుంబ పాలనను సాగనంపాలి

– అప్పుల్లో ఉన్న ఏపీని ఆదుకోవాలంటే బిజెపి అవసరం
– చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు, చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జి పులివర్తి నాని

చంద్రగిరి: వైసీపీ అన్యాయాలు, నియంతృత్వ పోకడలతో పార్టీని వీడి టీడీపీ చేరుతున్నట్లు పెరుమాళ్, ఎంపిటిసి మహేశ్వరి తెలిపారు. నాపై నమ్మకంతో టీడీపీలో చేరిన పెరుమాళ్, మహేశ్వరి వారి అనుచరులకు నా కృతజ్ఞతలు స్థానికంగా ఉన్న డ్రైనేజీ, ఇంటి స్థలాలు, నిరుద్యోగ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తా.

తుమ్మలగుంటలో పేద ప్రజల కోసం పోరాటం చస్తున్న నా సతీమణి పై దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే ఆదేశాలతో పోలీసులు ఈ దాడికి పాల్పడ్డారు. సాక్ష్యాధారాలతో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే అలాంటి ఘటన జరగలేదని ఎంఆర్ పల్లి సిఐ చెప్పడం శోచనీయం. ఎమ్మెల్యే ఒత్తిడి, భయంతోనో ఆ ప్రకటన చేసి ఉంటారు. అ ఘటనను వారి విజ్ఞత కు వదిలేస్తున్నా.

పోలీసులు, ఇతర ఏ అధికారులనైనా గౌరవించడం మా సంస్కారం. రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ, జనసేన ఎన్డీయే లో చేరడం జరిగింది. 2014లో టీడీపీ, జనసేన, బిజెపి కలయిన చారిత్రాత్మకమైనది. అప్పుల్లో ఉన్న ఏపీని ఆదుకోవాలంటే బిజెపితో అవసరం ఉంటుంది. బిజెపికి సపోర్ట్ చేస్తూ ఏపీకి రావాల్సిన పరిశ్రమలు, బడ్జెట్, పోలవరం ప్రాజెక్టు నిధులు కోసం చంద్రబాబు పోరాటం చేస్తారు.

టీడీపీ, జనసేన, బిజెపి కూటమిని ఆదరించండి. అన్ని వర్గాలను సమానంగా చూసే పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రగిరిలో చెవిరెడ్డి కుటుంబ పాలనను సాగనంపాల్సిన అవసరం అందరిపై ఉంది

LEAVE A RESPONSE