– బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మనసులొమాట కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీబాత్ కార్యక్రమం వందో ఎపిసోడ్ ఈ నెల చివరి ఆదివారం జరుగుతున్న నేపధ్యంలో గ్రామ స్ధాయిలో ఏర్పాట్లు చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పిలుపునిచ్చారు.
పోలింగ్ బూత్ స్ధాయిలో మన్ కీబాత్ వందో ఎపిసోడ్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని బిజెపి శ్రేణులకు సూచించారు. ఇప్పటికే బిజెపి రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర స్ధాయిలో జిల్లాల ఇంచార్జిలతో ఒక వర్క్ షాప్ నిర్వహించిన నేపధ్యంలో ఈ వర్క్ షాప్ లో పాల్గొన్న నేతలు జిల్లాల వారీగా పర్యవేక్షణ ముందునుండి నిర్వహించాలని సూచించారు. మన్ కీబాత్ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు అదేవిధంగా డ్వాక్రా సంఘాలు, స్వయం సహాయక సంఘాలు యువజనలను, రైతుల సంఘాలను కూడా ఈ కార్యక్రమంలోకి ఆహ్వానించాలన్నారు.
ప్రధానమంత్రి మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలతో మమేకమయ్యే అధ్భుత కార్యక్రమం అని వివరించారు. మన్ కీ బాత్ లో అనేక సందర్భాల్లో మన రాష్ట్రం గురించి, వ్యక్తులగురించి, ఇతర అంశాల పై కూడా ప్రస్తావించిన విషయాలను స్ధానికులకు వివరించి క్షేత్ర స్ధాయిలో ప్రజలకు వివరించి మన్ కీ బాత్ వందో ఎపి సోడ్ లో అందరినీ భాగస్వామ్యం చేయాలని బిజెపి రాష్ట్రకార్యాలయం నుండి విడుదల చేసిన ప్రకటనలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు బిజెపి శ్రేణులకు పిలుపునిచ్చారు