భూమి పూజా మరియు రహదారుల ప్రారంభోత్సవ కార్యక్రమం
ఏపీలో 22 వేల కోట్ల రూపాయల ఖర్చుతో జాతీయ రహదారుల ప్రారంభోత్సవం మరియు భూమి పూజలో భాగంగా విజయవాడకు విచ్చేసిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ మాత్యులు, నితిన్ గడ్కరీకి మరియు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ బిజెపి తరఫున సభా ప్రాగణంలో కరివేపాకు మాలతో ఘనంగా సత్కరించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, రాష్ట్ర కార్యదర్శి, గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం. అనంతరం అమ్మవారి దర్శన పూజా కార్యక్రమం నుండి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మోమేంటోను బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు అధికంగా పాల్గొనడం జరిగింది.