-బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ ఫైర్
కేటీఆర్ ను ప్రసన్నం చేసుకోవడానికి ముఖ్యమంత్రి వ్యాఖ్యలను కొనసాగింపుగా కేటీఆర్ ఆ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సమావేశంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి చైనా భక్తుడిగా మారడం దురదృష్టకరం.భారత దేశంలో ఉంటూ చైనా ను పొగడడం ఇతర దేశాలను పొగడడం టిఆర్ఎస్ పార్టీ నేతలు ఎందుకు చేస్తున్నారు.దీని వెనుక ఉన్న మతలబ్ ఏందో అర్థం కావడం లేదు.
తెలంగాణ ప్రజలను తలదించుకునేలా చేస్తున్న టిఆర్ఎస్ నేతలు చైనా ను ఇతర దేశాలను పొగడడం మానుకోవాలి.నేటి యువతకి దేశభక్తిని సత్ప్రవర్తనను గురించి చెప్పాల్సిన నాయకులు ప్రభుత్వ పెద్దలు దేశం గురించి తప్పుడు విధానాలను వివరించడం క్షమించరాని నేరం.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ద్వారా పదవుల్లో కొనసాగుతున్న ఇలాంటి మంత్రులు తక్షణమే తమ బాధ్యతలనుండి తప్పుకోవాలి.
మంత్రి కేటీఆర్ నేడు ఆ సమావేశంలో మాట్లాడుతూ 2001లో లో డబ్బు మీడియా రాజకీయ పరపతి లేదని చెప్పిన కేటీఆర్ నేడు లక్షల కోట్లకు అధిపతి కావడం దేనికి సంకేతం. టిఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాలు అన్యాయాలు అంతమయ్యే రోజు దగ్గర్లోనే ఉంది తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు.