– ఒకప్పుడు నడిచినట్టు ఇప్పుడు నడుస్తుంది అనుకుంటే కుదరదు
– జేసీ ప్రభాకర్ రెడ్డికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన బీజేపీsu ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి
విజయవాడ: టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కి బిజెపి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి నేరుగా వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ.. నోరు ఉంది కదా ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే మంచిది కాదు. ఒకప్పుడు నడిచినట్టు ఇప్పుడు నడుస్తుంది అనుకుంటే కుదరదు. ఇప్పుడు ఉంది కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. ఎలా బడితే అలా మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకుంటారు. బీజేపీ కార్యకర్తలు ఆయన బస్సు లు కాల్చాల్సిన అవసరం లేదు.
ఏ ఆధారాలతో మాట్లాడతారు? ప్రజాస్వామ్యబద్దంగా ఉండాలి. రౌడీ లు గుండాలు మాట్లాడే భాషలు మాట్లాడితే ఒక ప్రజా నాయకుడిగా అనర్హుడు. కూటమి సమస్య కాదు. ఇది అతని వ్యక్తి గత సమస్య గా ఎమ్మెల్యే అభివర్ణించారు.. జేసీ మాట్లాడుతున్న బాష పూర్తి అభ్యంతరకరం. బిజెపి జోలికి వస్తే వదిలిపెట్టం అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు.