-వైసీపీ స్కాం లు వెలికి తీయడానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి
– బిజెపి ఫ్లోర్ లీడర్ పెన్మత్స విష్ణు కుమార్ రాజు
-బిసీ లకు రాజ్యాధికారం ఇచ్చిన పార్టీ బిజెపి మాత్రమే
– ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి
విజయవాడ: బిజెపి రాష్ట్ర కార్యాలయ లో వారధి కార్యక్రమం లో భాగంగా ప్రజల వద్ద నుండి సమస్యలు స్వీకరించే కార్యాక్రమంలో బజిపి ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ వి పార్ధసారధి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమను కలసిన పాత్రికేయుల తో ఇరువురు మాట్లాడారు.
వైసీపి ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కుంభకోణాలు వెలికి తీసి దర్యాప్తు చేయడానికి కూటమి ప్రభుత్వం ఒక ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని బిజెపి ఫ్లోర్ లీడర్ పెన్మత్స విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. జగన్ ఆర్ధిక స్కాం పై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలి.
2019-24 మద్య ఏపీ ని అన్ని విధాలా నాశనం చేశారు.వైయస్ బిడ్డగా అవకాశం ఇస్తే అడ్డగోలుగా దోచారు.ఈసారి రెండు స్థానాలు కూడా జగన్ కు వచ్చే అవకాశం లేదు.జగన్ చేసిన అన్ని స్కాం ల పైన ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ను పెట్టాలని సిఎం ను కోరుతున్నా.వైసిపి నాయకులు చాలా మంది దుర్మార్గం గా వ్యవహరించారు.కాకినాడ పోర్ట్ ను కెవి రావును బెదిరించి లాక్కున్నారు.
వాటిపై విచారణ చేసి కెవి రావుకు ప్రభుత్వం న్యాయం చేయాలి.జగన్ అదానీ మధ్య జరిగిన ఒప్పందం లో 1750. కోట్లు అవినీతి జరిగింది.జగన్ డబ్బులు తీసుకున్నట్లు దర్యాప్తు సంస్థ లు నిర్ధారించాయి.ఈ స్కాం పై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేసి చర్యలు తీసుకోవాలి.
దోపిడీ లు చేసి ఎవరికి వారు ఆర్ధికంగా దోచుకుంటే ఎలా.ప్రజల సొమ్ములను కొట్టేసిన వారిని శిక్షించాలి.జగన్ ధన దాహానికి ఇప్పుడు ప్రజల పై విద్యుత్ భారం పడింది. 650 కోట్లకు గంగవరం ప్రాజెక్టు ను ఎలా అప్పగించారు.అదానీ ఏమైనా నీ తల మీద తుపాకీ పెట్టి ఇవ్వమన్నారా.జగన్ హయాంలో అత్యంత దారుణంగా, నిస్సిగ్గుగా దోపిడీ చేశాడు.కూటమి ప్రభుత్వం లో గత ప్రభుత్వం తాలూకూ స్కాం ల పై ఒక్కో విషయం తెలుస్తుంటే మతి పోతుంది.
విశాఖ లో అడ్డగోలుగా భూములను భయపెట్టి దోచుకున్నారు,ప్రైవేటు ఆస్తులు ను కూడా బలవంతంగా లాక్కున్నారు.జగన్ తనఇంటిని మొత్తం పూర్తి గా మూసి వేశారు. ఒకసారి వాస్తు ను కూడా పరిశీలించండి అంటూ వ్యంగ్యోక్తులు విసిరారు.వచ్చే ఎన్నికలలో ఎలాగూ వైసిపి ఓటమి ఖాయం.కనీసం మీరైనా అసెంబ్లీ కి వచ్చేలా పని చేసుకోండి అంటూ వైసీపి పై విమర్శల బాణాలు సంధించారు.
ఎమ్మెల్యే డాక్టర్ వి పార్ధసారధి మాట్లాడూతూ.. వైసీపి కి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏవిషయం దొరకడంలేదు కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వరుస క్రమంలో అమలు చేయడం జరుగుతుందన్నారు. బిజెపి లో బీసీ లందరూ చేరేందుకు సిద్దంకావాలని పిలుపు ఇచ్చారు.
బిసీ లకు రాజ్యాధికారం ఇచ్చిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రేమే నని నొక్కి వక్కాణించారు. ఆర్ కృష్ణయ్య ను దేశ రాజకీయాల్లో కీలక పాత్ర కోసం జాతీయ పార్టీ రాజ్యసభకు ఎంపిక చేసిందన్నారు. దేశ హితం కోసం భవిష్యత్ లో అనేక బిల్లులు పార్లమెంటు ముందుకు రావలసిన అవసరం ఉందన్నారు అందువల్ల క్రుష్ణయ్యకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. సానా సతీష్,బీదా మస్తాన్, ఆర్ క్రుష్ణయ్య ల నామినేషన్ల స్క్రూట్నీ పూర్తి అయ్యిందని, ప్రకటించడం లాంఛనమే నని పార్ధసారధి వివరించారు.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కాపుగోపాలపురం గ్రామానికి చెందిన బడియాల అప్పల నాయుడు వరి రైతు పడుతున్న ఇబ్బందులు వారధిలో ఫిర్యాదు చేశారు. వరిని మిషన్ ద్వారా కటింగ్ చేయడానికి కూడా ఇబ్బందులు పడుతున్నామని అదేవిధంగా సకాలంలో గొనె సంచులు ఇవ్వడం లేదని ఆభారమంతా రైతు లపైనే పడుతోందని వాపోయారు.ధాన్యం అమ్మకాలలో ట్రేడర్లే రాజ్యమేలుతున్నారని అందువల్ల వరిరైతుకు కష్టానికి తగ్గ ఫలితం అందడంలేదని వాపోయారు.
వెంటనే ఈ విషయం ప్రభుత్వం ద్రుష్టికి తీసుకుని వెడతామని బిజెపి ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నేతలు పైడి వేణు గోపాల్, షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు.